Karthika Deepam 21 Jan Today Episode : దీప ఫ్యామిలీ గురించి తెలుసుకునేందుకు ట్రై చేసిన అప్పారావు.. కార్తీక్ పనిచేసే హోటల్ కు వచ్చిన సౌందర్య, ఆనందరావు.. ఇంతలో మరో ట్విస్ట్

Authored By Varun G | The Telugu News | Updated on : 21 January 2022, 11:30 am

Karthika Deepam 21 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1255 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత బాధ తట్టుకోలేకే అత్తయ్య మామయ్య ఆశ్రమానికి వచ్చి ఉంటారని అనుకుంటుంది దీప. మరోవైపు తన బాబును ఎత్తుకెళ్లిన కోటేశ్ ఫోటోను చూస్తూ ఎవర్రా నువ్వు అని అనుకుంటుంది. ఇంతలో లక్ష్మణ్ వస్తాడు. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అంటుంది మోనిత. వీడెవడో నా బాబును కారులో నుంచి ఎత్తుకెళ్లాడు అంటుంది. నా కొడుకును నువ్వే ఎలాగైనా వెతికి పెట్టాలి అంటుంది. దానికి నేను ఎక్కడ వెతకాలి మేడమ్. పోలీస్ కంప్లయింట్ ఇవ్వొచ్చు కదా మేడమ్ అంటాడు. దీంతో నాకు తెలియదా.. పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని. చెప్పింది చేయి లక్ష్మణ్. ఇంతకీ నువ్వు నా కొడుకును వెతుకుతావా లేదా.. సరే నువ్వు నీ భార్యకు ట్రీట్ మెంట్ చేసినందుకు నాకు లక్షన్నర తెచ్చి ఇవ్వు అంటుంది మోనిత.

karthika deepam 21 january 2022 full episode

karthika deepam 21 january 2022 full episode

దీంతో లక్ష్మణ్ షాక్ అవుతాడు. మరోవైపు హోటల్ కు వెళ్లిన దీప.. అప్పారావు లే.. టైమ్ ఎంతైంది చూడు అంటుంది. దీంతో కిచెన్ లో పనిచేసే వెంకటమ్మ ఈరోజు రానంది. కాస్త నువ్వు నాకు సాయం చేయి అంటుంది దీప. స్టార్లు పొద్దున్నే లేవరు అక్క అంటాడు అప్పారావు. దీప వంట స్టార్ట్ చేస్తుంది. అక్క ఒక మంచి కాఫీ పెట్టు అక్క అంటాడు అప్పారావు. ఈరోజు ఆశ్రమానికి పార్శిల్ మనం తీసుకెళ్దామా అంటుంది దీప. ఎవరో ఒకరిద్దరు పార్శిల్ తెప్పించుకుంటారు అంతే. అక్కడ ఎవ్వరూ పార్శిల్ తీసుకెళ్లరు అంటాడు అప్పారావు. మరోవైపు పిల్లలకు టిఫిన్ తినిపిస్తుంటాడు కార్తీక్. డాడీ మమ్మీ పొద్దున్నే నిద్రలేచి అక్కడ పనిచేస్తుంది కదా.. అంటారు పిల్లలు. అవును అమ్మా అంటాడు. మమ్మల్ని మాత్రం పొద్దున్నే లేపకు అంటారు పిల్లలు.

Karthika Deepam 21 Jan Today Episode : పిల్లి గడ్డానికి ఒక పని అప్పజెప్పిన రుద్రాణి

కట్ చేస్తే రుద్రాణి తన పనివాళ్లకు ఒక పని చెబుతుంది. తన పనివాడికి ఏదో ప్లాన్ చెబుతుంది. నేను చెప్పినట్టు చేయి అంటుంది. సరే అంటాడు ఆ వ్యక్తి. సరదాగా వెళ్లి ఆ పని పూర్తి చేసుకొని రా అంటుంది రుద్రాణి. దీప నీకు ఇక వేరే దారి లేదు. నీ దారులన్నీ మూసేస్తున్నాను అని అనుకుంటుంది రుద్రాణి.

మా పిల్లి గడ్డం గాడు అన్నట్టు నేను గీసిందే గీత.. రాసిందే రాత. ఈ రుద్రాణి నుంచి తప్పించుకోలేవు దీప అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు వంట చేసి లేట్ అవడంతో పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది దీప. ఇంతలో అప్పారావు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇల్లు ఎంత దూరం అని అడుగుతాడు. బావ ఏం చేస్తాడు అంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతాడు.

దీంతో నాకు బావను చూడాలని ఉంది అక్క. ఏం చదివాడు బావ అంటూ వంద ప్రశ్నలు అడుగుతాడు. బావ అస్సలు చదువుకోలేదు కదా అంటాడు. మరి బావను కూడా మన హోటల్ కు తీసుకొస్తే ఆడుతూ పాడుతూ ప్లేట్లు కడుగుతాడు కదా అంటాడు. దీంతో అప్పారావు అంటూ కోపంతో అతడి మీద అరుస్తుంది.

ఇంతకీ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అని అడుగుతాడు అప్పారావు. హోటల్ లో వంటలు బాగా చేస్తావు కదా. ఇంట్లో ఎలా చేస్తావోనని చూడాలని ఉంది అంటాడు. దీంతో ఒకసారి భోజనానికి ఇంటికిరా అంటుంది దీప. మరోవైపు సౌందర్య, ఆనందరావు కారులో అలా బయటికి వెళ్తారు.

కాసేపు కారులో ఊరు తిరుగుతారు. సౌందర్య నాకు కాఫీ కావాలి అంటాడు. దీంతో హోటల్ కు వెళ్దాం అంటుంది సౌందర్య. మరోవైపు హోటల్ లో డ్యాన్స్ వేస్తుంటాడు అప్పారావు. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. కార్తీక్ ను చూసి నా డ్యాన్స్ ఎలా ఉంది అని అడుగుతాడు అప్పారావు. బాగుందిలే అంటాడు కార్తీక్.

ఇంతలో సౌందర్య, ఆనంద రావు హోటల్ కు వస్తారు. అప్పారావు వెళ్లి ఆర్డర్ అడుగుతాడు. కాఫీ కావాలి అని అడుగుతారు. దీంతో బావా రెండు కాఫీ అంటాడు. దీంతో కార్తీక్ కాఫీ తయారు చేసి లోపలికి తీసుకెళ్లబోతూ.. తన అమ్మానాన్నను చూస్తాడు. చూసి షాక్ అవుతాడు.

ఇంతలో అప్పారావు.. సౌందర్యతో చిట్టాపాటీగా మాట్లాడుతూ ఉంటాడు. తన అమ్మానాన్నను చూసి కార్తీక్ ఏం చేస్తాడు? వాళ్లు తనను చూస్తారా? లేదా? తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి