Karthika Deepam 21 June Today Episode : జ్వాలే శౌర్య అని సౌందర్యకు చెప్పేసిన హిమ.. జ్వాలకు షాకిచ్చిన నిరుపమ్.. ఇంతలో ట్విస్ట్

Karthika Deepam 21 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1384 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా పెళ్లి బాధ్యత నువ్వు తీసుకుంటా అన్నావు కదా. బాధ్యత తప్పొద్దు అని హిమతో అంటుంది జ్వాల. దీంతో సరే అంటుంది హిమ. నువ్వు సూపర్ తింగరి. నేనంటే నీకు చాలా ఇష్టం కదా అంటుంది జ్వాల. అవును.. అడగడం మరిచిపోయాను వాళ్లింట్లో ఏం ఫంక్షన్ చేశారని నన్ను పిలిచారు అని అడుగుతుంది జ్వాల. దీంతో వాళ్ల అమ్మ గారి బర్త్ డే అంటుంది హిమ. నువ్వు వెళ్లావా అని అడుగుతుంది జ్వాల. దీంతో వెళ్లా అంటుంది హిమ. డాక్టర్ సాబ్ అందుకే నన్ను రమ్మన్నారా అని అంటుంది. నువ్వు ఎందుకు రాలేదు అని అడుగుతుంది హిమ. దీంతో సరిగ్గా వాళ్ల ఇంటికి వచ్చే సమయానికి నాకు నా శత్రువు హిమ ఫోన్ చేసింది.. అంటుంది జ్వాల. దీంతో నానమ్మకు శౌర్య గురించి శోభ చెప్పకముందే నేనే చెప్పేయాలని అని అనుకుంటుంది హిమ. నువ్వు ఏంటి ఈ మధ్య తింగరి తింగరిగా చేస్తున్నావు అని అడుగుతుంది జ్వాల.

Advertisement
karthika deepam 21 june 2022 full episode
karthika deepam 21 june 2022 full episode

ఏం లేదు అంటుంది హిమ. అసలు నీకు నేను, డాక్టర్ సాబ్ కలవడం ఇష్టం లేదా అని అడుగుతుంది. దీంతో జ్వాల ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటుంది హిమ. ఊరికే అన్నానులే. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. బయటికి వెళ్దామా.. ఐస్ క్రీమ్ తిందామా అని అంటుంది జ్వాల. మరోవైపు సౌందర్య.. డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. చిన్న హెల్ప్ కావాలి అంటుంది. తనకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉంది అంటుంది. ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారా అంటే.. తను మా మాట వినడం లేదు అంటుంది. తను వేసుకునే ట్యాబ్లెట్లు తీసుకొచ్చి డాక్టర్ కు చూపిస్తుంది సౌందర్య. దీంతో ఇవి దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు కావు. ఇవి క్యాన్సర్ కు సంబంధించినవి కాదు. బలానికి వాడేవి అంతే అంటాడు డాక్టర్.

Advertisement

దీంతో సౌందర్య షాక్ అవుతుంది. తను కూడా డాక్టరే అంటుంది సౌందర్య. తను డాక్టరా.. ఏ హాస్పిటల్ లో చేస్తుంది అని అడుగుతాడు. దీంతో డాక్టర్ హిమ అంటుంది సౌందర్య. తనకు క్యాన్సర్ ఏంటి.. తనకు ఎటువంటి క్యాన్సర్ లేదు అంటాడు డాక్టర్.

మీరు ఏ హిమ అనుకుంటున్నారో అని అంటుంది సౌందర్య. దీంతో మాకెందుకు తెలియదు. మా హాస్పిటల్ లో రీసెంట్ గా బ్లడ్ అవసరం వస్తే.. మీ హిమ గారే బ్లడ్ డొనేట్ చేసి వెళ్లారు. ఒక క్యాన్సర్ పేషెంట్ దగ్గర బ్లడ్ తీసుకోం కదా. తనకు క్యాన్సర్ ఉంటే.. తనెలా బ్లడ్ ఇస్తుంది మేడమ్ అంటాడు డాక్టర్.

మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి అని చెబుతాడు డాక్టర్. దీంతో ఏం చేయాలో సౌందర్యకు అర్థం కాదు. మరోవైపు శోభ ఇంటికి వెళ్తుంది హిమ. తన ఇంట్లో సోఫాలో కూర్చొంటుంది. తనను చూసి శోభ షాక్ అవుతుంది. నువ్వా అంటుంది. దీంతో రండి శోభా దేవి గారు రండి కూర్చోండి అంటుంది హిమ.

ఏంటి నన్ను చూడగానే ఏదో పులిని చూసినట్టుగా అంతలా భయపడుతున్నావు అంటుంది హిమ. దీంతో నువ్వు పులివా.. అంటుంది. నిన్ను చూస్తుంటే నవ్వాలో.. ఏడవాలో.. లేక జాలిపడాలో నాకే తెలియడం లేదు అంటుంది శోభ. నువ్వు చెబుతుంటే ఎలా ఉందో తెలుసా.. పులి దగ్గరికి జింక పిల్ల వచ్చి బెదిరించినట్టుగా ఉంది అంటుంది శోభ.

Karthika Deepam 21 June Today Episode : శోభకు హిమ వార్నింగ్

నువ్వేంటో.. నీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో.. ఇంట్లో నుంచి ఎవరు వెళ్లిపోయారో.. ఇవన్నీ నాకు అంటూ ఏదో అనబోతుండగా ఏయ్ అంటూ శోభ గొంతు పట్టుకుంటుంది హిమ. ఏంటో నువ్వు సాఫ్ట్ అనుకున్నాను.. గొంతు పట్టి ఇలా చేస్తావా అంటుంది. నా ఫ్యామిలీ జోలికి వస్తే అస్సలు ఊరుకోను అంటుంది హిమ.

పిచ్చి పిచ్చి వేషాలు మానేయ్ శోభ.. అంటే నిరుపమ్ అంటే నాకు పిచ్చి.. నిరుపమ్ ను నేను వదులుకోలేను అంటుంది శోభ. నిన్ను శోభ గారు అని పిలిచేదాన్ని. కానీ ఇప్పుడు నీ బుద్ధి తెలిశాక శోభ అని పిలుస్తున్నాను.. ఇంకా వేరేలా పిలిపించుకోకు. నువ్వు డాక్టర్ వనే ఇంకా చిన్న గౌరవం ఉంది అంటుంది హిమ.

ఏదో మీ నానమ్మ చెప్పిందో.. లేక మేము మాట్లాడుకుంటుంటే విన్నావో తెలియదు కానీ.. నేను హిమను అని జ్వాలకు ఫోన్ చేస్తున్నానని తెలుసుకున్నావు. ఇంతటితో సినిమా అయిపోలేదు కదా. నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. మీ జ్వాలను నిరుపమ్ కు ఐలవ్యూ చెప్పకుండా ఆపాను అంటుంది శోభ.

నువ్వే జ్వాల వెతికే శత్రువు అని చెప్పాను అనుకో.. ఏంటమ్మా నీ మానసిక పరిస్థితి. ఇన్నాళ్లూ అన్నీ తెలిసే హిమ నీతో లవ్ గేమ్ ఆడింది.. నీకు ఫోన్లు చేసింది అని చెప్పాననుకో.. ఒకటికి మూడు.. మూడుకు ముప్పై కలిపి చెప్తాను.. అప్పుడేంటమ్మా.. అంటుంది శోభ.

మా నానమ్మకు ఇంకో మనవరాలును చూపిస్తానని బేరం పెట్టావు కదా.. ఆ మనవరాలికే నిన్ను చూపిస్తాను.. అప్పుడు బాగుంటుంది కదా అని అంటుంది హిమ. దీంతో అవన్నీ పక్కన పెడుదాం. నీకు క్యాన్సర్ లేదు అని చెప్పాననుకో.. నీ పని అవుట్ అంటుంది శోభ.

ఇది నా బ్రహ్మాస్త్రం బేబీ అంటుంది శోభ. దీంతో హిమ నవ్వుతుంది. శెభాష్.. చెప్పి చెప్పి అలిసిపోయావు కానీ.. నీళ్లు తాగుతావా.. జ్యూస్ ఉందా ఇంట్లో తెచ్చి పెట్టమంటావా.. ఏంటి బ్రహ్మాస్త్రం ఫెయిల్ అయిందని అనుకుంటున్నావా.. నేను కూడా చాలా అలిసిపోయాను అంటుంది హిమ.

నువ్వు జ్వాలకు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేయ్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది హిమ. మరోవైపు హిమ ఇంటికి రాగానే.. తన చెంప చెళ్లుమనిపిస్తుంది సౌందర్య. ఏంటే నీకు క్యాన్సరా.. థర్డ్ స్టేజ్ లో ఉందా. ఎందుకు ఇలా అందరితో ఆడుకుంటున్నావు అంటుంది సౌందర్య.

అంతా తెలిసిపోయింది. నీకు క్యాన్సర్ లేదు అంటుంది సౌందర్య. దీంతో ఆనంద రావు షాక్ అవుతాడు. లేనిదాన్ని ఉన్నట్టు ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు అంటే అబద్ధాలు చెప్పలేదు మోసం చేసింది అంటుంది సౌందర్య. ఇంతలో నిరుపమ్ అక్కడికి వస్తాడు. స్వప్న కూడా వస్తుంది. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు అంటాడు నిరుపమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement