Karthika Deepam 22 June Today Episode : జ్వాలే శౌర్య అని సౌందర్యకు చెప్పిన హిమ.. జ్వాలకు షాకిచ్చిన నిరుపమ్.. హిమపై మరింత పగ పెంచుకున్న జ్వాల?

Karthika Deepam 22 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 1385 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంకెప్పుడు మారుతావే నువ్వు అని సౌందర్య.. స్వప్నతో అంటుంది. దీంతో నేనెందుకు మారాలి అంటుంది స్వప్న. ఇప్పుడే ఇలా ఉందంటే.. ఇక పెళ్లయ్యాక నన్ను ఏమాత్రం లెక్క చేస్తుందో అర్థం అవుతోంది అంటుంది స్వప్న. నేను నీకు ముందే చెప్పా కదా నిరుపమ్ అంటుంది స్వప్న. నా మాట విను. వెళ్దాం పదా.. ఈ సంబంధం వద్దు.. ఏదీ వద్దు.. ఆ శోభను పెళ్లి చేసుకో అంటుంది స్వప్న. దీంతో నువ్వు ఆ శోభను ఇచ్చి పెళ్లి చేస్తానంటే మేము చూస్తూ ఊరుకుంటామా అంటుంది హిమ. ఈ కొంపలోకి రావడమే తప్పు అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న. దీంతో స్వప్న వెంటే నిరుపమ్ కూడా వెళ్లిపోతాడు. వాళ్లు వెళ్లిపోయాక ఇప్పుడు చెప్పు ఏంటి నీ వేషాలు.. చచ్చిపోతున్నానని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతుంది సౌందర్య. అంత పెద్ద అబద్ధం చెప్పడానికి కారణం ఏంటి అని అడుగుతాడు ఆనంద రావు. దీంతో శౌర్య కోసం అని అసలు నిజం చెప్పేస్తుంది హిమ.

Advertisement
karthika deepam 22 june 2022 full episode
karthika deepam 22 june 2022 full episode

దీంతో సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు. శౌర్య కోసం ఏంటి అమ్మ.. నీకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పి ఎక్కడుందో తెలియని శౌర్య కోసం అని ఎందుకు అంటున్నావు అంటాడు ఆనంద రావు. దీంతో నానమ్మ మీ దగ్గర నేను ఒక విషయం దాచాను.. శౌర్య ఎవరో ఎక్కడుందో నాకు తెలుసు అంటుంది హిమ. ఏంటమ్మా శౌర్య తెలుసా? అని ఆశ్చర్యపోతాడు ఆనంద రావు. ఏంటే నువ్వు శౌర్య ఎక్కడుందో తెలిసి ఇన్నాళ్లు చెప్పకుండా ఉన్నావా? అసలు ఏం జరుగుతోంది. దాని కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం కదా. తను ఎక్కడుంది.. తన ఫోటో చూపించు అని అడుగుతుంది సౌందర్య. దీంతో తను ఎవరో ఎక్కడుందో చెప్పేముందు నీకు చాలా విషయాలు చెప్పాలి అంటుంది. మనం ఒక చోటుకు వెళ్లాలి అంటుంది హిమ. దీంతో పదా వెళ్దాం అంటుంది సౌందర్య.

Advertisement

దీని డొంకతిరుగుడు మాటలు చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పదా అంటుంది. ఆశ్రమానికి వెళ్తున్నానని జ్వాల ఫోన్ చేసింది. బహుషా అక్కడే ఉండొచ్చు అని అనుకుంటుంది హిమ. మరోవైపు ఆశ్రమంలో నిరుపమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది జ్వాల.

ఇంతలో నిరుపమ్ వస్తాడు. నమస్తే డాక్టర్ సాబ్.. నేను ఫోన్ చేస్తే కూడా మీరు తీయడం లేదు. మీతో మాట్లాడను అంటూ బుంగమూతి పెడుతుంది జ్వాల. ఏంటి డాక్టర్ సాబ్.. ఆరోజు వెళ్లిపోయానని కోపమా.. నా మనసులో మాట చెప్పలేదని మీరు నా మీద అలిగారా అంటుంది జ్వాల.

ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇప్పటి దాకా కోరుకోనంతగా నేను మిమ్మల్ని అంటూ ఏదో చెప్పబోతుంది.. ఇంతలో జ్వాల ప్లీజ్ అసలేంటి నీ ఉద్దేశం. నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి. ముందు నేను చెప్పేది విను జ్వాల అంటాడు నిరుపమ్. వెనుకా ముందు ఆలోచించకుండా నా మీద ఆశలు పెంచుకోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు అంటాడు నిరుపమ్.

Karthika Deepam 22 June Today Episode : తింగరిని పెళ్లి చేసుకుంటున్నా అని జ్వాలకు చెప్పిన నిరుపమ్

తప్పేంటి డాక్టర్ సాబ్.. మీ మమ్మీ మాటలకు లొంగిపోయారా? కొంపదీసి ఆ శోభను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అనబోతుండగా.. షటప్ జ్వాల అంటాడు నిరుపమ్. మనసులో మాట విను అని నువ్వేగా చెప్పింది అంటాడు నిరుపమ్. దీంతో అవును.. ఆ మనసులో ఉన్నది నేనే కదా అంటుంది జ్వాల.

నువ్వు లేవు.. నా మనసులో నువ్వు లేవు.. వేరే వాళ్లు ఉన్నారు. తనతోనే జీవితం.. తనతోనే నా పెళ్లి అంటుంది. ఇంతలో జ్వాల, నిరుపమ్ మాట్లాడుకుంటుండగా సౌందర్య, హిమ అక్కడికి వచ్చి.. చెట్టు పక్కన నిలబడతారు. తనే శౌర్య నానమ్మ అని చెబుతుంది హిమ.

దీంతో సౌందర్య చాలా సంతోషిస్తుంది. శౌర్య.. నిరుపమ్ బావను ప్రేమిస్తోంది అని చెబుతుంది. ఇప్పుడేమో డైరెక్ట్ గా తనను కాదు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేసేది అని అంటుంది హిమ. చూడు జ్వాల నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటాడు నిరుపమ్.

మరి నా సంగతి ఏంటి అని అడుగుతుంది. దీంతో నీ సంగతి ఏంటి జ్వాల. నేను ఎప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పానా అంటాడు నిరుపమ్. అప్పుడు తాగి చెప్పారు కదా అంటుంది. దీంతో తాగినప్పుడు ఏదో అన్నానేమో కానీ.. జ్వాల ఐలవ్యూ అని ఎప్పుడైనా అన్నానా అంటాడు.

వెళ్లి నిరుపమ్ ను ఆపడానికి ప్రయత్నిస్తుంది హిమ కానీ.. వద్దు అంటూ వారిస్తుంది సౌందర్య. డాక్టర్ సాబ్ మీరు జోక్ చేస్తున్నారు కదా. ఇదంతా అబద్ధం కదా.. చెప్పండి డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. ఐలవ్యూ అని చెప్పడానికి ముందు నన్ను ఏడిపిస్తున్నారు కదా అని అడుగుతుంది జ్వాల. దీంతో చెబుతుంటే అర్థం కావడం లేదా.. నేను నిన్ను ప్రేమించడం లేదు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది.

నీకు అర్థం అవుతోందా అని అంటాడు నిరుపమ్. మరి నాలో ఆశలు ఎందుకు లేపారు. నాలో ప్రేమను ఎందుకు కలిగించారు అని అడుగుతుంది జ్వాల. దీంతో చూడు జ్వాల నువ్వు అనుకున్నావు. అది నా తప్పు కాదు అంటాడు నిరుపమ్. దీంతో తన గళ్ల పట్టుకొని నిలదీస్తుంది జ్వాల.

నాకు ఆటో ఎందుకు కొనిచ్చారు.. ప్రేమగా ఎందుకు మాట్లాడమన్నారు. నా మనసులో మాట ఎందుకు చెప్పమన్నారు. నాకు బట్టలు ఎందుకు కొనిచ్చారు. ఏంటి ఇదంతా.. మాట్లాడండి డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. ఆటో నడుపుకునే దాన్ని.. నన్ను డాక్టర్ సాబ్ ఇష్టపడుతున్నాడేంట్రా అని చాలా పొంగిపోయాను అంటుంది జ్వాల.

అసలు నేను ఆడపిల్లనని.. నాకు మీరే గుర్తు చేశారు. ఎవరు నన్ను ఒక్క మాట అన్నా మీరు అడ్డువచ్చారు. ఏంటి ఇదంతా.. చెప్పండి డాక్టర్ సాబ్.. ఏంటి అని అడుగుతుంది. దీంతో అది ప్రేమ కాదు జ్వాల. అన్ని నీకు నువ్వుగా అనుకున్నావు. మీ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లమ్.

ప్రేమతో ఉన్నవాడిని స్నేహం అనుకుంటారు.. స్నేహంతో ఉన్నవాడిని ప్రేమ అనుకుంటారు అంటాడు నిరుపమ్. దీంతో తప్పంతా నాదే అంటారా అంటుంది జ్వాల. అవును.. తప్పంతా నీదే.. ఇంకోసారి మన మధ్య మాటలు స్నేహాలు ఉండకపోవచ్చు అంటాడు నిరుపమ్.

వీలు అయితే నా పెళ్లికి రా జ్వాల అంటాడు నిరుపమ్. డాక్టర్ సాబ్.. మీరు పెళ్లి చేసుకోబోయేది డాక్టర్ నేనా అని అడుగుతుంది జ్వాల. దీంతో అవును అంటాడు నిరుపమ్. మనసును చంపుకొని.. నా మీద ప్రేమను చంపుకొని ఆ శోభను పెళ్లి చేసుకుంటున్నారు కదా అని అడుగుతుంది జ్వాల.

దీంతో నేను శోభను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటాడు నిరుపమ్. మరి తింగరినా అని అడుగుతుంది. దీంతో అవును అని తల ఊపుతాడు నిరుపమ్. డాక్టర్ సాబ్.. మీరు తింగరిని పెళ్లాడటం ఏంటి అని అడుగుతుంది. నిజం చెప్పండి ఇది జోకే కదా అంటుంది జ్వాల.

మీరు, ఆ తింగరి కలిసి నన్ను పరీక్షిస్తున్నారు కదా అని అడుగుతుంది జ్వాల. చెప్పండి డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. తింగరి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అని అడుగుతుంది. దీంతో నేను పెళ్లి చేసుకునేది మీ తింగరినే. తననే నేను ప్రేమించాను అంటాడు నిరుపమ్.

చూడు జ్వాల.. నీది ఆకర్షణ మాత్రమే ప్రేమ కాదు అంటాడు నిరుపమ్. దీంతో నాది ప్రేమ కాదని మీరెలా చెబుతారు అంటుంది జ్వాల. నాది నిజంగా ప్రేమే అంటుంది జ్వాల. నీకు నువ్వు ఊహించుకుంటే అది నా తప్పు కాదు. జీవితం అంటే ఊహ కాదు.. అంటాడు నిరుపమ్.

మీ మాటలు అబద్ధం.. వెళ్లిపోండి. మీరంతా అబద్ధం అంటుంది జ్వాల. నువ్వు, ఆ తింగరి ఇద్దరూ అబద్ధమే అంటుంది జ్వాల. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement