Karthika Deepam 22 Oct Today Episode : మోనితకు చుక్కలు చూపించిన కార్తీక్.. శౌర్యను చూసిన దీప.. మొత్తానికి కార్తీక్, దీప, శౌర్య కలుస్తారా? సౌందర్య దగ్గరికి వెళ్తారా?

Karthika Deepam 22 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 అక్టోబర్ 2022, శనివారం ఎపిసోడ్ 1490 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి డాక్టర్ బాబుకు నిజం తెలిసింది అనగానే ఉలిక్కి పడ్డావు. నువ్వు డాక్టర్ బాబుకు భార్యగా నా గతం పోగొడతావా? ఆయనకు గతం గుర్తొచ్చే వరకే నీ నాటకాలు అంటుంది దీప. దీంతో రేపటితో నీ ప్రపంచాన్ని తలకిందులు చేస్తా అని మోనిత దీపకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అది రౌడీ నవ్వే. ఎక్కడున్నా నవ్వును పట్టి శౌర్యను పట్టేయొచ్చు. కనిపించినట్టే కనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రేపు మళ్లీ అక్కడికి వెళ్లి వెతకాలి అని అనుకుంటాడు. ఇంతలో ఒక పాప ఏడుపు వినిపిస్తుంది. ఇంతలో ఇంటికి వచ్చి లోపల పిల్లాడు ఏడుస్తున్నాడు. వినిపించడం లేదా అంటాడు కార్తీక్. ఇక్కడే ఉన్నావా లేక వేరే లోకంలో విహరిస్తున్నావా అంటాడు. వెళ్లి తనే పిల్లాడిని తీసుకొని బుజ్జగిస్తాడు.

karthika deepam 22 october 2022 full episode

నీకు ఎందుకు వినిపించలేదు. మనిషివి ఇక్కడున్నావు కానీ.. మనసు, ఆలోచనలు ఇక్కడ లేవు. దుర్గ గారు అంటూ కార్తీక్.. దుర్గను పిలుస్తాడు. ఇప్పుడు వాడిని ఎందుకు పిలుస్తున్నావు కార్తీక్ అని అడుగుతుంది మోనిత. దీంతో ఇంట్లో లేడా అంటాడు. దీంతో లేడు అంటుంది. దీంతో ఒక్క గంట ఇంట్లో లేకపోతేనే ఉండలేకపోతున్నావా అంటాడు కార్తీక్. దీంతో స్టాపిట్ కార్తీక్ అంటుంది. ఇప్పుడు నువ్వు వస్తుంటేనే భయం వేస్తుంది. ఏమంటావో తెలియదు. ఆ దుర్గా గాడిని కలుపుతూ ఏమంటావో తెలియదు. అందుకే ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ మైండ్ బ్లాంక్ అయిపోయింది. అర్థం అయిందా అంటుంది మోనిత. దొంగ ఏడుపులు మాని పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో అంటుంది మోనిత. దీంతో ఆగు కార్తీక్.. ఎందుకు నువ్వు నేను ఏం చెప్పినా నమ్మడం లేదు. ఎందుకు నీలో ఇంత మార్పు వచ్చింది అని అడుగుతుంది మోనిత. దీంతో నాలో ఏ మార్పుకైనా నువ్వే కారణం మోనిత అంటాడు కార్తీక్.

మరోవైపు శివ ఇంటికి వస్తాడు. గుడ్ మార్నింగ్ మేడమ్ అంటాడు శివ. దీంతో ఎక్కడికి వెళ్లివస్తున్నావు అని అడుగుతుంది మోనిత. దీంతో మార్నింగ్ వాక్ కు వెళ్లాను అంటాడు. నువ్వు ఆ వంటలక్క ఇంటి నుంచి వస్తున్నట్టు నేను చూశాను కానీ అసలు నిజం చెప్పు.. అంటుంది.

నువ్వు ఎందుకు అక్కడికి వెళ్లావో కనిపెట్టడం పెద్ద కష్టం కాదు.. అంటుంది. మనసారు నన్ను రోజూ దీపక్క అదే వంటలక్క ఇంటి ముందు పడుకోమని చెప్పారు మేడమ్ అంటాడు. దీంతో ఎందుకు అంటే.. ఏమో మేడమ్ అంటాడు శివ. మొన్నేమో కార్తీక్ అక్కడ పడుకున్నాడు. రాత్రేమో శివను పడుకోమని చెబుతున్నాడు. ఈ మధ్య నా మాటను అస్సలు లెక్క చేయడం లేదు. ఏదో జరుగుతోంది జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది మోనిత.

Karthika Deepam 22 Oct Today Episode : మోనితను దుర్గ విషయం ఇంకా ఇబ్బంది పెట్టిన కార్తీక్

మరోవైపు కార్తీక్.. దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంద్ మోనిత కొడుకు అని తెలిసి కూడా హిమ, శౌర్యలతో సమానంగా పెంచావు అని అనుకుంటాడు. అలాగే రౌడీ గురించి కూడా ఆలోచిస్తాడు. ఇంతలో మోనిత వస్తుంది. కాఫీ ఇవ్వనా కార్తీక్ అంటుంది మోనిత.

దీంతో మంచి టైమ్ కు అడిగావు. తీసుకురా అంటాడు. దుర్గకు కాఫీ ఇచ్చావా అని అడుగుతాడు. దీంతో వాడికి నేను ఎందుకు ఇస్తాను. మళ్లీ మొదలు పెట్టావా అని అంటుంది మోనిత. నేను మొదలుపెట్టడం ఏంటి మోనిత. అతడు నీ ఫ్రెండ్, చుట్టం. నీ దగ్గరికి వచ్చి ఏ సంబంధం లేనిదో ఉంటున్నాడా అంటాడు కార్తీక్.

వాడు ఇక్కడ ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే. వాడికి టీ ఇచ్చావా, కాఫీ ఇచ్చావా అని అడిగితే మాత్ర బాగోదు అంటుంది మోనిత. ఇంతలో కాఫీ అదిరిపోయింది బంగారం. ఏంటో రోజురోజుకు కాఫీ రుచి పెరిగిపోతోంది. నీ చేతితో విషం ఇచ్చినా అది అమృతమే అంటాడు దుర్గ.

నిన్ను చూస్తే కోపం రావడం లేదు మోనిత. జాలి వేస్తోంది అంటాడు. ఇప్పుడు దుర్గ గారికి కాఫీ ఇచ్చింది నేను కాదు అని అనవు కదా అంటాడు కార్తీక్. ఇప్పుడు నా మీద నాకే జాలి వేస్తోంది. నేను మరిచిపోయింది గతమే. కానీ.. నా ఎమోషన్స్ ను కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

దీంతో నన్న వదిలేయ్ రా.. నీకు దండం పెడతా. కార్తీక్ నన్ను అనుమానిస్తే నేను తట్టుకోలేను అంటుంది మోనిత. నువ్వు ఏడుస్తున్నావా.. నువ్వు ఏడిస్తే వచ్చేది కన్నీళ్లు కాదు.. విషపు చుక్కలు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దుర్గ. మరోవైపు దీప దండం మీద బట్టలు ఆరేస్తూ ఉంటుంది.

శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప. ఇంద్రుడు అప్పుడు జ్వాల గురించి చెప్పడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక నుంచి ఆ ఆటో కోసం వెతకాలి. శౌర్య ఎక్కడుందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది దీప. మరోవైపు దుర్గను ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత.

ఇక వాడిని వదిలించుకోవడం కష్టం అనుకొని వేరే దారి చూసుకోవాలి అని అనుకుంటుంది. ఆ దుర్గ గాడి వల్ల ఇప్పుడు అస్సలు ఒప్పుకోడు. ఏం చేయాలి. ఏం చేస్తే కార్తీక్ నాకు దక్కుతాడు. నాకు కావాల్సింది కార్తీక్ మాత్రమే. ఇంకేం వద్దు. ఏం చేయాలి అని అనుకుంటుంది మోనిత. దీనికి ఒకే ఒక్క దారి. ఆ దీప కార్తీక్ కళ్లెదురుగా ఉండకూడదు అని అనుకుంటుంది.

వెంటనే ఆ ఆటోను వెతకడం కోసం బయటికి వస్తుంది దీప. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. పాప్ కార్న్ కొంటాడు. ఇంతలో అతడికి దీప తారసపడుతుంది. మీరేంటి ఇక్కడ అంటుంది. ఊరికే అలా వచ్చాను అంటాడు. పాప్ కార్న్ ఎవరికి అంటుంది. దీంతో చూస్తే కొనాలనిపించింది అంటాడు.

మీ రౌడీకే అవి ఇష్టం డాక్టర్ బాబు అని మనసులో అనుకుంటుంది దీప. మా శౌర్యకు పాప్ కార్న్ అంటే చాలా ఇష్టం డాక్టర్ బాబు అని అంటుంది. దీంతో నేను కొన్నది కూడా శౌర్య కోసమే అని అనుకుంటాడు డాక్టర్ బాబు. ఒక ఆటోలో ఒక అమ్మాయి తిరుగుతోంది. అమ్మానాన్న ఎక్కడున్నారు అని ఆటో వెనుక రాసి ఉంది. ఒకసారి గొంతు విన్నాను. అచ్చం మా శౌర్య లాగానే ఉంది అంటుంది దీప.

ఇప్పుడు అదే ఆటో కోసం వెతుకుతున్నాను. తను మా శౌర్యో కాదో తెలుస్తుంది అని అంటుంది. ఇంతలో ఒక ఆటో అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అందులో శౌర్య ఉంటుంది. శౌర్య ను చూసి గుర్తుపడుతుంది దీప. వెంటనే ఆ ఆటోను ఫాలో అవుతారు కార్తీక్, దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

2 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

3 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

4 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

6 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

7 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

8 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

9 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

10 hours ago