karthika deepam 23 april 2022 full episode
Karthika Deepam 23 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ 1334 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాఫీ తాగేందుకు హిమను పిలుస్తాడు ప్రేమ్. నాకు హాస్పిటల్ కు వెళ్లాలి.. టైమ్ అవుతోంది అంటుంది. దీంతో కాఫీ తాగి వెళ్లు.. నాకోసం ఆ మాత్రం టైమ్ స్పెండ్ చేయలేవా అంటాడు ప్రేమ్. దీంతో సరే.. బావ అంటుంది. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎలాగైనా ఈరోజు తనకు ప్రపోజ్ చేయాలనుకుంటాడు ప్రేమ్. పదా అంటాడు. మరోవైపు సౌందర్య, ఆనంద రావు ఇద్దరూ ఉదయం వాకింగ్ కు వెళ్తారు. కొంత దూరం నడిచాక ఇక నేను నడవలేను. ఏదైనా క్యాబ్ బుక్ చేయి అంటాడు. క్యాబ్ రావడానికి లేట్ అవుతుంది అంటుంది సౌందర్య.
karthika deepam 23 april 2022 full episode
దీంతో అక్కడే ఉన్న ఓ ఆటో దగ్గరికి వెళ్లి ఆటో వస్తావా అంటాడు ఆనంద రావు. అది జ్వాల ఆటో. జ్వాల వాళ్లను చూసి షాక్ అవుతుంది. సౌందర్య కూడా తనను చూసి షాక్ అవుతుంది. నువ్వా అంటుంది సౌందర్య. దీంతో నువ్వా అని జ్వాల కూడా అంటుంది. స్వారీ అని చెబుతుంది సౌందర్య. తొందరపడి నిన్ను కొట్టేశాను అంటుంది. దీంతో నీ స్వారీలేమీ అవసరం లేదు.. అంటుంది. నీకు సారీ చెప్పడమే గొప్ప అంటుంది సౌందర్య. తను ఏం మాట్లాడితే ఆ మాటకు సమాధానం చెబుతుంది.
నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందమ్మా అంటాడు ఆనంద రావు. దీంతో ఆటో నడుపుతాను కదా.. ఎక్కడో చూసి ఉంటారు అంటుంది జ్వాల. తర్వాత ఇద్దరూ జ్వాల ఆటో ఎక్కుతారు. ఎలాగైనా ఇవాళ నా శత్రువు అడ్రస్ తెలుసుకోవాలి అనుకుంటుంది జ్వాల.
ఇంతలో పక్క వీధిలో జగన్నాథ రావు ఉన్నాడు కదా. అతడి దగ్గరికి వెళ్దాం. చాలా రోజులు అవుతుంది కలవక అంటాడు. దీంతో అక్కడికి పోనివ్వు అంటుంది సౌందర్య. హలో సీనియర్ సిటిజన్ అంటుంది జ్వాల. దీంతో సౌందర్యకు కోపం వస్తుంది.
హిమకు పెళ్లి అయిందో తెలుసుకోవాలని తాతయ్య.. మీ మనవరాలికో.. మనవడికో పెళ్లి కాలేదా అంటుంది. దీంతో అవలేదమ్మా అంటాడు ఆనంద రావు. అంటే ఇంకా తనకు పెళ్లి కాలేదనుకుంటా అని అనుకుంటుంది జ్వాల. జ్వాలను చూసి ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనసులో ఏదో తెలియని అలజడి లేస్తుంది ఏంటి అని అనుకుంటాడు ఆనంద రావు.
వాళ్లు ఇంట్లోకి వెళ్లాక.. ఇక్కడే ఉండి.. వీళ్ల అడ్రస్ ఎలాగైనా కనిపెట్టాలి అని అనుకుంటుంది జ్వాల. మరోవైపు కాఫీ తాగడానికి రెస్టారెంట్ కు వెళ్తారు ప్రేమ్, హిమ. రెండు కాఫీ చెబుతాడు ప్రేమ్. తనకు ఇచ్చే ఒక కాఫీ మీద హార్ట్ సింబల్ వచ్చేలా తీసుకురావాలని పర్సనల్ గా బేరర్ కు చెబుతాడు.
హిమకు ఎలా ప్రేమ వ్యక్తం చేయాలో అర్థం కాదు ప్రేమ్ కు. మరోవైపు హాస్పిటల్ కు వెళ్తుంది జ్వాల. నిరుపమ్ ను కలుస్తుంది. తన బాబాయి కోసం మందులు తీసుకోవడానికి నిరుపమ్ దగ్గరికి వెళ్తుంది. నేను ఏదిచ్చినా కాదనకూడదు అంటాడు నిరుపమ్. సరేనా అంటే ఓకే అంటుంది జ్వాల. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.