Karthika Deepam 23 May Today Episode : హిమ, జ్వాలకు శోభ బిగ్ షాక్.. నిరుపమ్, శోభ పెళ్లిని హిమ, జ్వాల ఎలా ఆపుతారు?

Karthika Deepam 23 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 మే 2022, సోమవారం ఎపిసోడ్ 1359 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు నా ప్రేమ విషయంలో సపోర్ట్ చేయాలి అంటే.. తప్పకుండా అది నా బాధ్యత అంటుంది తింగరి. దీంతో ఓయ్.. నీ బాధ్యత ఏంటి అంటుంది. దీంతో నువ్వు నా గురువువు కదా.. అందుకే.. అలా అన్నాను అంటుంది. అంతే కాదు.. మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది అంటుంది హిమ. దీంతో హిమను గట్టిగా హత్తుకుంటుంది జ్వాల. కానీ.. నేను చెప్పేదాక.. నిరుపమ్ బావకు నువ్వు ఐలవ్యూ చెప్పకూడదు అంటుంది హిమ. దీంతో ఎందుకు అలా తింగరి అంటుంది. నేను డాక్టర్ సాబ్ మనసులో ఉన్నాను కదా అంటుంది. అయినా సరే.. నువ్వు ఇప్పుడే చెప్పకు అంటుంది. దీంతో సరే.. నువ్వు చెప్పినప్పుడే డాక్టర్ సాబ్ కు ఐలవ్యూ చెబుతా అంటుంది జ్వాల.

karthika deepam 23 may 2022 full episode

థాంక్యూ తింగరి.. నువ్వు నా కోసం చాలా ఆలోచిస్తున్నావు అంటుంది జ్వాల. మరోవైపు సౌందర్య, ఆనంద రావు ఇద్దరూ ఇంట్లో కూర్చుంటారు. ఆనంద రావు అప్పుడే ఊరి నుంచి వస్తాడు. శౌర్య ఫోన్ చేసిందనే వార్త తెలుసుకొని సంతోషిస్తాడు ఆనంద రావు. అది మనల్ని దూరం నుంచి చూస్తూ మనతో దాగుడు మూతలు ఆడుతోందని అనిపిస్తోంది అంటుంది సౌందర్య. తనకు మనల్ని చూడాలని.. మనల్ని నానమ్మ.. తాతయ్య పిలవాలని లేదంటారా అని ఆనంద రావుతో అంటుంది సౌందర్య. తను ఇప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మనల్ని చూసిందో లేదో.. చూస్తుందో ఏమో.. ఏమీ తెలియదు కదా అంటాడు ఆనంద రావు. నిశ్చితార్థం రోజు.. హిమ ఎందుకు అలా చేసింది. స్వప్న.. ఏం అనలేదా అని అంటాడు ఆనంద రావు.

ఇంతలోనే స్వప్న వచ్చి.. హాయ్ మమ్మీ.. హాయ్ డాడీ అంటుంది స్వప్న. స్వప్న.. తన మమ్మీతో మాట్లాడటంతో ఆనంద రావు షాక్ అవుతాడు. నేను మీకు తీపి కబురు చెప్పడానికి స్వీటు బాక్స్ తో వచ్చాను అంటుంది స్వప్న. దీంతో సౌందర్య, ఆనంద రావు టెన్షన్ పడతారు.

తీసుకోండి అని స్వీట్లు ఇస్తుంది. శోభను పిలిచి డాక్టర్ శోభాదేవి నాకు కాబోయే కోడలు అని సౌందర్య, ఆనంద రావుకు పరిచయం చేస్తుంది. నా ఇంటికి రాబోయే పెద్ద కోడలు అని చెబుతుంది. దీంతో సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు. ఎవరు వచ్చినా రాఖీలు కట్టిస్తా అన్నావు కదా.. ఇంట్లో రాఖీలు ఉన్నాయా అంటుంది.

శోభ.. తాళి కట్టించుకొని తీరుతుంది.. నా కొడుకు నిరుపమ్ తో అంటుంది. అందానికి అందం.. హోదాకు హోదా.. అంటుంది స్వప్న. నీ నిశ్చితార్థం పాపం ఫెయిల్ అయింది. నా ప్లానింగ్ సూపర్ సక్సెస్ అవుతుంది అంటుంది స్వప్న. దీంతో సౌందర్య నవ్వుతుంది.

Karthika Deepam 23 May Today Episode : సౌందర్యకు శోభాదేవిని పరిచయం చేసిన స్వప్న

సౌందర్య లేచి.. శోభ దగ్గరికి వెళ్లి.. శోభాదేవి పేరు చాలా బాగుంది అమ్మాయి. చాలా చక్కగా ఉన్నావు. చెంప మీద ఉన్న ఈ దెబ్బ ఏంటి.. ఇలా కందిపోయింది ఏంటి అని అడుగుతుంది. దీంతో మేకప్ అంటుంది స్వప్న. దీంతో ఇది మేకప్ లా లేదే.. అంటుంది సౌందర్య.

నాకైతే డౌటే.. నా మనవరాలి వయసు ఉన్న పిల్ల ఎవరో చెంప దెబ్బ కొట్టింది అని అంటుంది. నువ్వు ఎన్ని వేషాలు వేసినా.. నీ పెద్ద కోడలు నా మనవరాలే అవుతుంది అంటుంది సౌందర్య. ఏం తీసుకుంటారు.. టీ కాఫీ కూల్ డ్రింక్స్ అంటుంది.

మమ్మీ నీ వెటకారాలు ఆపు అంటుంది. దీంతో నా పెద్దలు శోభనే ఎవరు ఆపుతారో.. ఎలా ఆపుతారో నేను చూస్తాను అంటుంది. హలో అంటూ ఆ స్వీటు బాక్స్ ను తిరిగి స్వప్నకే ఇచ్చేస్తుంది సౌందర్య. మరోవైపు నిరుపమ్.. జ్వాల ఆటోలో వెళ్తుంటాడు.

నిరుపమ్ ను చూసి మురిసిపోతుంది జ్వాల. డాక్టర్ సాబ్.. మీకొక విషయం చెప్పనా అంటుంది జ్వాల. మీరు నా ఆటోలో కూర్చుంటే.. నాకు ఆటో నడిపినట్టు అనిపించదు. విమానం నడిపినట్టు ఉంటుంది అంటుంది జ్వాల. ఎందుకు అంటాడు నిరుపమ్.

దీంతో అదంటే డాక్టర్ సాబ్ అంటుంది. మీరు నా ఆటోలో కూర్చుంటే మనసు గాలిలో తేలిపోతుంది డాక్టర్ సాబ్ అని మనసులో అనుకుంటుంది జ్వాల. అవును.. డాక్టర్ సాబ్.. ఎక్కడికి వెళ్లాలో చెప్పలేదు అని అడుగుతుంది జ్వాల. దీంతో కాసేపు అన్నీ మరిచిపోయే చోటుకు తీసుకెళ్లు అంటాడు నిరుపమ్.

ఎలాంటి కల్మషం లేని నీతో మాట్లాడుతుంటే కాస్త రిలీఫ్ గా ఉంటుంది. నా మనసులో ఉన్న దిగులు పారిపోతుందదేమో అంటాడు నిరుపమ్. మీకు దిగులు ఏంటి.. దిగండి అని ఆటో ఆపుతుంది. ఆటో నడపమని చెబుతుంది. అతడి పక్కన కూర్చుంటుంది జ్వాల.

ఆటో నడుపుతూ రిలాక్స్ అవుతాడు నిరుపమ్. మరోవైపు హిమ హాస్పిటల్ కు వస్తుంది శోభ. తనను చూసి షాక్ అవుతుంది హిమ. ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈవిడ. తీరా చూస్తే తను కూడా డాక్టర్ అని తెలుసుకొని షాక్ అవుతుంది హిమ.

నేనెందుకు వచ్చాను అని టెన్షన్ పడుతున్నావా? మా ఆంటీ వచ్చాక అంతా నీకే తెలుస్తుంది అంటుంది. అంతలోనే స్వప్న వస్తుంది. రండి ఆంటి.. ఇప్పుడే పరిచయాలు అయ్యాయి అంటుంది. నీకు తనెవరో తెలుసా అని అడుగుతుంది స్వప్న. దీంతో తెలుసు ఆంటి.. కాసేపటి క్రితమే పరిచయాలు అయ్యాయి అంటుంది శోభ.

ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుంది తనే అని స్వప్న.. శోభతో చెబుతుంది. ఎక్కువ ఆలోచించకు.. నిరుపమ్ ఎక్కడ అని అడుగుతుంది స్వప్న. నా కొడుకు ఎక్కడ అంటుంది. నిరుపమ్ బావ శౌర్యతో కలిసి బయటికి వెళ్లాడు అని తెలిస్తే స్వప్న అత్త అరుస్తుందేమో అని భయపడుతుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago