Karthika Deepam 24 Feb Today Episode : ఆనంద్ మోనిత కొడుకే అని తెలుసుకున్న దీప.. మోనిత కొడుకును తిరిగి మోనితకే అప్పగిస్తుందా? కార్తీక్ ఏం చేస్తాడు?

Karthika Deepam 24 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 ఫిబ్రవరి 2022, గురువారం ఎపిసోడ్ 1284 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత కొడుకే ఆనంద్ అని చెప్పేసరికి ఆనంద్ రావు షాక్ అవుతాడు. మోనిత బిడ్డను మన ఇంట్లో పెట్టుకున్నామా. మోనిత ఎప్పుడైతే బిడ్డను కన్నదో అప్పటి నుంచి మన కష్టాలు ప్రారంభం అయ్యాయి.. అంటాడు ఆనంద్ రావు. మన కర్మ కాకపోతే ఏంటండి ఇది. ఒక సమస్య పోగానే మరో సమస్య ఎదురవుతోంది. కార్తీక్, పిల్లలు ఇల్లు వదిలి వెళ్లారని ఇన్నేళ్లు బాధపడ్డాం. ఇప్పుడు ఏమో మోనిత కొడుకు రూపంలో మరో సమస్య వచ్చిపడింది అని అనుకుంటారు.

karthika deepam 24 february 2022 full episode

ఉదయం లేవగానే కార్తీక్ రెడీ అయి సౌందర్య దగ్గరికి వస్తాడు. అమ్మ.. మోనిత బాబుకు సంబంధించిన ఫుటేజ్ మీ దగ్గర ఉందట కదా.. అని అడుగుతాడు. దీంతో ఏంటి డాక్టర్ బాబు.. మోనిత బాబను మీరు వెతుకుతారా అని అంటుంది దీప. నా ప్రయత్నం నన్ను చేయనివ్వు దీప అంటాడు కార్తీక్. ఎందుకురా పెద్దోడా.. దీప చెప్పింది వినొచ్చు కదా అంటుంది సౌందర్య. దీంతో మమ్మీ మీరు ప్రతిసారి దీపకే సపోర్ట్ చేస్తారేంటి.. నా ఆలోచనలను మీరు పట్టించుకోరేంటి.. అని అంటాడు కార్తీక్. ఆ ఫుటేజ్ ఎక్కడుంది అని అడుగుతాడు. దీంతో అది ఎక్కడుందో చూడలేదు. నేను దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు అంటుంది సౌందర్య.

మరోవైపు ఆనంద్ తో ఆడుతుంటారు పిల్లలు. అంతలోనే మోనిత వస్తుంది. ఆనంద్ ను చూసి.. నా ఆనందరావు.. నాబిడ్డ అని అనుకుంటుంది మోనిత. హిమ.. ఎవరీ బాబు అంటుంది. దీంతో మా తమ్ముడు అంటుంది హిమ. తాడికొండ నుంచి తెచ్చుకున్నాం అంటుంది శౌర్య. వీడు మా తమ్ముడు అంతే అంటుంది హిమ.

ఒక్కసారి నేను ఎత్తుకుంటాను ఇవ్వవా అంటుంది మోనిత. దీంతో నేను ఇవ్వను అంటుంది హిమ. పేరు ఏం పెట్టారు అంటే ఆనంద్ అంటుంది హిమ. దీంతో అరె.. మా అబ్బాయి పేరు కూడా ఆనందే అంటుంది మోనిత. ఆనంద్ ను మోనిత ఎత్తుకోబోయే సరికి దీప వచ్చి ఆనంద్ ను లాక్కుంటుంది.

ఆడ శకుని మా ఇంట్లో అడుగుపెట్టింది ఏంటి.. ఎందుకు వచ్చావు అని అడుగుతుంది దీప. క్షేమసమాచారాలు తెలుసుకుందామని వచ్చాను అంటుంది. ఏంటి దీపక్క అంతలా లాక్కున్నావు. నా బాబులా ఉన్నాడని ఎత్తుకోబోయా అంటుంది మోనిత.

ఇది మరీ బాగుంది దీపక్క.. ఎవరి బిడ్డనో తీసుకొచ్చి మీ ఇంటి బిడ్డ అంటున్నారా అంటుంది మోనిత. నీకు పుట్టిన బిడ్డకు తండ్రిని నేను కాదు అన్నాడు కార్తీక్. ఈరోజు నాతోటి అదే అంటున్నాను. నీకు, నాకు పెద్దగా తేడా ఏం లేదు. నా బిడ్డ పుట్టాకే నీ నిజాయితీ ఏంటో కార్తీక్ కు తెలిసింది. అది నీ ద్వారానే కదా.. అంటుంది మోనిత.

సర్లే.. నిన్ను నమ్మినట్టే నన్నూ నమ్ముతాడు త్వరలో.. అంటుంది మోనిత. దీంతో అది జరగదు అంటుంది దీప. జరిగి తీరుతుంది అంటుంది మోనిత. కార్తీక్ ఉన్నాడా.. నా బిడ్డను వెతుకుతాను అన్నాడు కదా.. నా బిడ్డ గురించి కొన్ని వివరాలు చెప్పడం కోసం వచ్చాను అంటుంది.. దీంతో మోనిత అంటూ సీరియస్ అవుతుంది. దీంతో సరే దీపక్క వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది.

Karthika Deepam 24 Feb Today Episode : ఆనంద్ తో ఎక్కువ అనుబంధం పెంచుకున్న హిమ, శౌర్య

అన్నీ ఆలోచించి టెన్షన్ పడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని ఆనంద రావుతో సౌందర్య అంటుంది. ప్రతి విషయంలో రచ్చ చేసి మనకు ప్రశాంతత లేకుండా చేస్తోంది మోనిత. ఈ బాబు విషయంలో ఇంకేం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటాడు ఆనంద రావు.

బాబును ఎత్తుకెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ ను కార్తీక్ కు చూపించలేం. నిజాన్ని దాచలేం. నిజం తెలిసిన రోజు కార్తీక్ ఎలా రియాక్ట్ అవుతాడో.. ఎలా స్పందిస్తాడో అర్థం కావడం లేదు. ఆనంద్ మోనిత కొడుకు అని తెలిస్తే కార్తీక్, దీప ఏం చేస్తారు అని అంటుంది సౌందర్య.

ఇంతలో పిల్లలు ఇద్దరూ సౌందర్య దగ్గరికి వచ్చి ఏమైంది నానమ్మ.. మోనిత ఆంటి రాగానే మమ్మల్ని ఎందుకు పక్కకు వెళ్లమంటారు అంటుంది హిమ. మోనిత.. నాన్న బెస్ట్ ఫ్రెండే కదా. మోనిత మంచిదే కదా.. ఎందుకు ఇలా మమ్మల్ని పక్కన పెడుతున్నారు అంటుంది హిమ.

తర్వాత కోపంతో హిమ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది. మరోవైపు మోనిత.. తన బాబు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కారులో వెళ్తూ… నా ప్రేమను నా కొడుకే గెలిపిస్తున్నాడు అని అనుకుంటుంది మోనిత. తండ్రి కార్తీక్.. తల్లి మోనిత.. పెంచుతోంది దీపక్క.. ఇప్పుడు మోనితకు బలం వచ్చింది అని అనుకుంటుంది మోనిత.

ఇప్పుడు మోనిత ఆట ఆడుతుంది చూడు అని తనలో తానే నవ్వుకుంటుంది మోనిత. మరోవైపు దీప.. కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మోనిత కళ్లలో ఏదో తెలియని ఆత్మవిశ్వాసం కల్పిస్తోంది. ఇది వరకులా లేదు. ఇప్పుడు ఆ మాటల్లో అంత విశ్వాసం ఎలా వచ్చింది అని అనుకుంటుంది దీప.

ఇంతలో పిల్లలు వచ్చి తమ్ముడిని మాకు ఇవ్వు.. నేను ఎత్తుకుంటాను అంటుంది హిమ.  అమ్మ.. మన తమ్ముడికి గ్రాండ్ గా ఫంక్షన్ చేద్దామా అంటారు హిమ, శౌర్య. ఇంతలోనే సౌందర్య వచ్చి.. వీళ్లకు ఏమైంది అంటుంది. 24 గంటలు తమ్ముడూ తమ్ముడూ అంటూ వీడి పేరే జపిస్తున్నారు అంటుంది సౌందర్య.

ఆ తాడికొండ వెళ్లి వచ్చాక వీళ్లు మారిపోయారు అంటుంది సౌందర్య. దీంతో మేమేం మారలేదు అంటుంది హిమ. దీపుగాడిని ఎప్పుడైనా ఓ గంట సేపు అయినా ఎత్తుకున్నారా అని అడుగుతుంది సౌందర్య. మాకు వీడు నచ్చాడు ఎత్తుకుంటున్నాం అంటుంది హిమ.

దీంతో వీడు కాదు.. మీకు దీపు గాడే తమ్ముడు అంటుంది సౌందర్య. దీంతో మాకు వీడే సొంత తమ్ముడు అంటుంది హిమ. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. మరోవైపు మోనిత కారును చూసి కారు నెంబర్ ను చూసి ఏదో గుర్తుకు తెచ్చుకుంటుంది దీప.

కోటేశ్ ఈ కారు నెంబర్ ను బుక్ లో ఎందుకు రాసినట్టు అని అనుకుంటుంది. ఆ తర్వాత రత్నసీత దగ్గరికి వెళ్తుంది. కోటేశ్.. మోనిత కొడుకును ఎత్తుకెళ్లే వీడియోను రత్నసీత దీపకు చూపిస్తుంది. దీంతో షాక్ అవుతుంది. మోనిత కొడుకుతో ఇన్ని రోజులు అనుబంధం పెంచుకున్నామా అని అనుకుంటుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

4 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

5 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

6 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

8 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

9 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

10 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

11 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

12 hours ago