Karthika Deepam 24 Jan Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 24 జనవరి 2022 ఎపిసోడ్ 1256 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ పనిచేసే హోటల్ కు కాఫీ తాగడానికి సౌందర్య, ఆనందరావు వెళ్తారు. అప్పారావుకు కాఫీ కావాలని చెబుతారు. దీంతో కార్తీక్ కాఫీ రెడీ చేస్తుంటాడు. ఇంతలో.. సౌందర్యతో మాట్లాడుతూ అప్పారావు మోనిత గురించి చెబుతాడు. దీంతో సౌందర్య, ఆనందరావు షాక్ అవుతారు. ఇంతలో అప్పారావు వెళ్లి కాఫీ తీసుకొచ్చి వాళ్లకు ఇస్తాడు. కాఫీ తాగి బాగుంది అంటారు. వెంటనే తన ఫోన్ తీసి మోనితతో దిగిన ఫోటోను చూపిస్తాడు అప్పారావు. ఆ ఫోటో చూసి షాక్ అవుతారు సౌందర్య, ఆనందరావు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు మహాలక్ష్మి.. ఆనంద్ ను తీసుకొచ్చి దీపకు ఇస్తుంది. దీప ఆనంద్ ను పడుకోబెట్టి ఇప్పుడే వస్తా.. అని చెప్పి బయటికి వెళ్తుంది. కార్తీక్ మాత్రం తన మమ్మీ డాడీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మమ్మీ డాడీ ఎందుకు వచ్చారు అని అనుకుంటాడు. మోనిత కూడా ఇక్కడికి వచ్చిన విషయం వీళ్లకు తెలుసా అని అనుకుంటాడు. అసలు.. వీళ్లు ఎందుకొచ్చారు. డాడీకి ఏమైంది అని టెన్షన్ పడతాడు కార్తీక్. దీంతో సరిగ్గా హోటల్ లో పనిచేయలేకపోతాడు. దీంతో అప్పారావుతో ఈరోజు సెలవు కావాలని అడుగుతాడు. దీంతో ఓనర్ కు నేను ఏదో ఒకటి చెబుతాను. నువ్వు వెళ్లి ఇంటికి అంటాడు. దీంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కారులో వెళ్తున్న సౌందర్య, ఆనందరావుకు కాఫీ తాగగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ కాఫీ అచ్చం మన ఇంట్లో తాగినట్టుగానే ఉంది కదా అంటాడు ఆనందరావు. అచ్చం దీప కలిపినట్టే అనిపిస్తోంది కదా. కొంపదీసి దీప అక్కడ పనిచేస్తుందా అని అనుకుంటారు. వెంటనే మళ్లీ హోటల్ కు బయలుదేరుతారు.
కట్ చేస్తే.. ఆనంద్ ను పిల్లి గడ్డం ఎత్తుకొస్తాడు. దీంతో వెంటనే దీప రుద్రాణి ఇంటికి వెళ్తుంది. బాబును తీసుకోబోతుంది కానీ.. రుద్రాణి ఆపేస్తుంది. ఆగు దీప. మాట్లాడుకుందామా ముందు అంటుంది. మీరు ఇప్పటి వరకు అసలు కట్టలేదు. చివరకు వడ్డీ కూడా కట్టలేదు.. అంటుంది.
వడ్డీ కట్టి రంగరాజును తీసుకెళ్లు అంటుంది రుద్రాణి. 6400 వడ్డీ కట్టి రంగరాజును తీసుకెళ్లు. అప్పటి దాకా నా దగ్గరే ఉంటాడు అని చెబుతుంది రుద్రాణి. అసలు కాదు కదా నేను అడిగేది. వడ్డీ డబ్బులు. అది కూడా న్యాయంగా ధర్మంగా వడ్డీ తీసుకుంటున్నాను. ఇప్పుడు రంగరాజును తీసుకొచ్చాను. కాదూ కూడదు అంటే ఊళ్లో పెద్ద మనుషులను తీసుకొచ్చి నీ ఇద్దరు పిల్లలను కూడా తీసుకొస్తాను అని దీపను బెదిరిస్తుంది రుద్రాణి.
దీంతో దీపకు ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత సౌందర్య, ఆనందరావు ఇద్దరూ హోటల్ కు వెళ్లి ఓనర్ భద్రాన్ని కాఫీ ఎవరు చేశారని అడుగుతారు. దీంతో వీళ్లు రుద్రాణి మనుషులేమో అని అనుకొని సాంబయ్య చేశాడు అని అబద్ధం చెబుతాడు. దీంతో అక్కడి నుంచి వెనుదిరుగుతారు.
తన తల్లిదండ్రులు ఎందుకు ఆశ్రమానికి వచ్చారో తెలుసుకునేందుకు కార్తీక్ కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. కానీ.. అతడు మాత్రం అవన్నీ విషయాలు అక్కడ చెప్పరని చెబుతాడు. దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత రుద్రాణి మనుషులు బాబును తీసుకెళ్లారని చెబుతుంది మహాలక్ష్మి.
వెంటనే రుద్రాణి ఇంటికి వెళ్తాడు కార్తీక్. వడ్డీ డబ్బులు కట్టి పిల్లాడిని తీసుకెళ్లు అంటుంది రుద్రాణి. దీంతో హోటల్ కు వెళ్లి జీతం డబ్బులు కావాలి అని భద్రాన్ని అడుగుతాడు. ఇంతకుముందే వంటమనిషి వచ్చి 4000 కావాలని తీసుకొని వెళ్లింది. ఇప్పుడు నువ్వొచ్చి అడుగుతున్నావా అంటాడు భద్రం.
దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. 4000 తో పాటు.. మిగితా డబ్బుల కోసం ఇంట్లో ఉన్న డబ్బులను లెక్కిస్తుంది దీప. కానీ.. డబ్బులు సరిపోవు. దీంతో ఏం చేయాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.