Karthika Deepam 25 Aug Today Episode : మోనిత మనిషి నీ నాలుగు పీకి నిజం తెలుసుకున్న దీప.. మోనితను ఏం చేయబోతుందో చూడాలి…

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 25 August 2022, 10:00 am

Karthika Deepam 25 Aug Today Episode : కార్తీకదీపం సీరియల్ ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదల అయింది. ఈరోజు ఎపిసోడ్ 1440 హైలెట్ సెంటు ఇప్పుడు మనం చూద్దాం… సౌందర్య కార్తీక్ దీపాల ఫోటోలను చూస్తూ సౌర్య గురించి చెప్తూ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే దీప, మోనిత వెనక ఫాలో అవుతూ తన ఇంటికి వస్తుంది. మౌనిత తన ఇంట్లో కార్తీక్ ఫోటోను చూస్తూ ఏడుస్తున్నట్లు డ్రామాలాడుతూ ఉంటుంది. దీనిని నమ్మడానికి లేదు అని దీప ఇల్లంతా కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది. లోపలికి వెళ్లి చూడగా కార్తీక్ ఫోటో కార్తీక్ కార్తీక్ అని గోడ నిండా రాసి పెట్టి ఉంచుతుంది. దీప అదంతా చూసి ఆశ్చర్యానికి గురవుతుంది. మౌనిత తిరిగి దీపనే అనుమానించుకుంటూ దీప తన దగ్గర నిన్ను పెట్టుకొని డ్రామాలాడుతుందా అని ఇంకాస్త డోస్ పెంచి ఏడుస్తూ ఉంటుంది మోనిత. దీప మౌనిత ఓవరాక్షన్ చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌందర్య, సౌర్య గురించి ఆలోచిస్తూ ఉండగా..

హిమ శౌర్య కోసం బట్టలు, పిండి వంటలు అన్ని తీసుకొని వస్తుంది. సౌర్య దగ్గరికి వెళ్లడానికి హిమ రెడీ అవుతూ ఉంటుంది. ఆనంద్ రావు ఏమైంది సౌందర్య, హిమ అంత ఉత్సాహంగా ఉంటే నువ్వెందుకు అలా ఉన్నావు అని అంటాడు. అప్పుడు సౌందర్య, శౌర్య దగ్గర వెళ్లడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ హిమను చూసి సౌర్యా ఎక్కడ మండిపడుతుందో ఆ కోపంగా కాస్త దేశంగా ద్వేషంగా మారి వాళ్ళు ఎప్పటికీ ఇలాగే విడిపోయి ఉంటారు అని భయంగా ఉందండి అని అంటుంది. అప్పుడు హిమ అదంతా విని వచ్చి నాయనమ్మ నేను రానులే మీరే వెళ్లి తనకు ఇవన్నీ ఇచ్చి తనని తీసుకొని రండి అని చెప్తుంది. కట్ చేస్తే శివ కార్తీక్ అటువైపు వస్తుండగా దీప కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు దీప ని చూసి కార్తీక్ తనని మనం ఎక్కడో చూశాము తన దగ్గర ఆపు అని కారు ఆపి దిగి తన దగ్గరికి వెళ్తూ ఉండగా.. మోనిత మనిషి మాత్రం భయంతో కంగారు పడిపోతూ ఉంటాడు.

Karthika Deepam 25 August 2022 Full Episode

Karthika Deepam 25 August 2022 Full Episode

తన మాట లెక్కచేయకుండా దీప దగ్గరికి కార్తీక్ వెళుతూ ఉండగా దీప అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోతుంది. దాంతో కార్తీక్ అయ్యో మిస్సయింది అని వాళ్లు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళింట్లో పెద్దావిడ దీపనీ ఏమైందమ్మా.. డాక్టర్ బాబు దొరకలేదా అని అంటుంది. ఇప్పుడు డాక్టర్ బాబు సమస్య కాదమ్మా.. మౌనిత సమస్య అని తన గురించి అంతా చెబుతుంది. అప్పుడు ఆ పెద్దావిడ దానిది ప్రేమ కాదమ్మా.. వ్యామోహం అలాంటివాళ్లు ఎప్పటికైనా నాశనం అయితారు అని చెప్తుంది. అది నాలాగే ఫోటో పట్టుకొని వెతుకుతూ ఉంది డాక్టర్ బాబుని అని అంటుంది. అప్పుడు పెద్దావిడ వెతికితే వెతికిందిలే ఒకవేళ దొరికితే తన దగ్గరకైతే వెళ్ళడు కదా కార్తీకు అని పెద్దావిడ ధైర్యం చెబుతుంది దీపకి. రేపటి ఎపిసోడ్ లో మౌనిత మనిషిని నాలుగు పీకి నిజం తెలుసుకుంటుంది దీప. రేపటి సీన్లో మౌనిత కార్తీకి భోజనం పెడుతూ ఉంటుంది. మౌనిత కుట్ర తెలుసుకున్న దీప ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే..

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి