Karthika Deepam 25 Nov Today Episode : మళ్లీ కార్తీక్ ఇంట్లో సంబురాలు.. కలిసిపోయిన కార్తీక్, దీప.. కానీ వాళ్లకు మోనిత మరో షాక్

0
Advertisement

Karthika Deepam 25 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 నవంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 1206 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ల్యాబ్ లో దొంగతనం చేసి శాంపిల్స్ ప్రవేశపెట్టుకొని.. అబ్బో మా చెల్లి చేసిన బాగోతాలు మామూలుగా లేవు అంటుంది దీప. ఏంటి దీపక్క నువ్వు చెప్పేది.. తాళి నేనే కట్టుకున్నాను కానీ.. తల్లిని మాత్రం కార్తీక్ వల్లే అయ్యాను అంటుంది మోనిత. ఓరోజు బాగా తాగొచ్చి.. అంటూ మోనిత అనబోయేసరికి.. నోర్మూయ్ అంటుంది దీప. నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. ఏమనుకుంటున్నావు. నువ్వు బారసాలకు పిలిస్తే ఇక్కడికి వచ్చి బాబును ఆశీర్వదించి.. చాటుకు వెళ్లి నా బతుకు ఇంతే దేవుడా అని అనుకొని మళ్లీ బస్తీకి వెళ్తాను అనుకుంటున్నావా? అంటూ మోనితకు వార్నింగ్ ఇస్తుంది దీప.

karthika deepam 25 november 2021 full episode
karthika deepam 25 november 2021 full episode

ఏమన్నావు.. నేను అబద్ధాలు చెబుతున్నానా.. ఇప్పుడే.. ఇక్కడే ఏది అబద్ధమో.. ఏది నిజమో నిరూపిస్తా అంటుంది దీప. ప్రియమణి… నీకిచ్చిన బ్యాగ్ తీసుకురా అంటుంది దీప. మోనిత.. నీ బతుకు ఒక అబద్ధం. నీ మాట అబద్ధం. నీ ఆలోచన అబద్ధం. ఇన్ని అబద్ధాల మధ్య బతుకుతున్నావు. జైలుకు వెళ్లి వచ్చినా నీ బుద్ధి మాత్రం మారలేదు. ఇంకా నీకు శిక్ష కూడా మిగిలి ఉన్నట్టుంది కదా.. అన్నింటికీ కలిపి శిక్ష అనుభవిద్దువు కానీలే వెయిట్ చేయ్ అంటూ దీప.. మోనితకు వార్నింగ్ ఇస్తుంది దీప.

బ్యాగు ఓపెన్ చేసి అందులో ఉన్న రిపోర్ట్ లను బయటికి తీస్తుంది దీప. ఇదేంటో తెలుసా? ల్యాబ్ నుంచి నీకు శాంపిల్ ఇచ్చినట్టు ఓనర్ రాజారావు ఇచ్చిన స్టేట్ మెంట్ అంటుంది దీప. దీంతో ఈ పేపర్స్ అబద్ధం అంటుంది మోనిత. నేను ఆ శాంపిల్స్ తీసుకోలేదు.. ఇది సహజ గర్భం అంటుంది మోనిత.

దీంతో అరవకు మోనిత. నీకు ఇంకో బలమైన సాక్ష్యం చూపిస్తాను. అది చూపిస్తే నీ నోటి మాట ఆగిపోతుంది అంటుంది దీప. ఫోన్ ఓపెన్ చేసి.. అందులో ఓ వీడియో చూపిస్తుంది. అందులో ల్యాబ్ ఓనర్ రాజారామ్ శాంపిల్స్ మోనితకు అమ్మేసినట్టు చెబుతాడు.

ఆ వీడియో చూసి.. మోనిత, కార్తీక్ షాక్ అవుతారు. ఇప్పుడు చెప్పు చిట్టి తల్లి. ఏది అబద్ధం. నీది సహజ గర్భమా. డాక్టర్ బాబు తాగొచ్చి తప్పు చేశారా? ఆయన నీకు శ్రీవారు. వీళ్లు నీకు అత్తమామలు.. బారసాల.. ఆర్బాటాలు.. ఏం మాట్లాడవేంటి చెల్లెమ్మా అంటుంది దీప.

దీంతో వెళ్లిపోండి.. అని సీరియస్ గా అంటుంది మోనిత. అందరూ వెళ్లిపోండి.. బారసాల లేదు.. ఏమీ లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటుంది. దీంతో ఇంటికి వచ్చిన అతిథులు అందరూ వెళ్లిపోతారు. ఇంతటితో అయిపోయిందని అనుకోకు దీప. నా ప్రేమ అనంతం. అందరూ కలిసిపోయారని.. అంతా ఒక్కటయ్యారని సంబురపడకు. సినిమా అయిపోలేదు దీప.. నేను ఏం చేయగలనో.. ఏం చేస్తానో మీరు ఊహించలేరు.. అంటుంది మోనిత.

Karthika Deepam 25 Nov Today Episode : మోనిత చెంప చెళ్లుమనిపించిన సౌందర్య

దీంతో సౌందర్య.. వెళ్లి మోనిత చెంప వాయిస్తుంది. ఏం చేస్తావే..  ఏం చేస్తావు అంటుంది సౌందర్య. నా కోడలును నువ్వు ఏం చేయలేవు. నా కోడలు బంగారం. నువ్వు ఎన్ని వెదవ వేషాలు వేసినా.. అన్నింటినీ నా కోడలు కనిపెట్టింది. ఇకనైనా ఒక మనిషిలా బతుకు అంటుంది సౌందర్య. పదండి వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్లిపోతారు అందరూ.

వెళ్లండి.. వెళ్లండి.. అంతా అయిపోయిందని అనుకోకండి.. మోనిత.. ఇక్కడ.. అంటూ లోపలికి వెళ్లి ఒక ఫైల్ తీసుకొస్తుంది. ఈ ఫైల్ చాలు మీ అందరి జీవితాలు తలకిందులు అయిపోతాయి. మీ అందరి పని అయిపోతుంది. మీ ఖేల్ ఖతం అంటుంది మోనిత. వారం రోజుల్లో మీ పని క్లోజ్ అంటుంది.. అయినా కూడా నవ్వుతూ వెళ్లిపోతారు అందరూ. దీంతో మోనితకు తీవ్రంగా కోపం వస్తుంది.

ఇంటికి వచ్చాక.. కార్తీక్.. దీపకు అన్ని విషయాలు చెబుతాడు. తన తప్పు తెలుసుకున్నానని అంటాడు. మోనిత విషయంలో నీకు చెప్పకపోవడం తప్పే. కానీ.. నువ్వు తట్టుకుంటావో తట్టుకోవో అని నీకు చెప్పలేదు.. అంటాడు. నువ్వు లేకపోయి ఉంటే నేను ఏమైపోయేవాడిని అంటాడు.

నమ్మకం అనే పునాది మీదే బంధం నిలుస్తుంది. ఆ నమ్మకంతోనే ల్యాబ్ కు వెళ్లి కలిశాను. ఆ ల్యాబ్ ఓనర్ మొదటిసారి అద్భుతంగా నటించాడు. రెండోసారి దొరికిపోయాడు.. అని చెబుతుంది దీప. ఉదయానే లేచి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించాలి అంటారు.. కానీ మగాళ్లు అందరూ భార్య కాళ్లకు కూడా నమస్కరించాలి అంటాడు కార్తీక్. దీంతో ఇద్దరూ కలిసిపోతారు.

మరోవైపు మోనిత ఇంటికి ఎవరో వస్తారు. ప్రియమణి ఉంటుంది. లాయర్ సురేశ్ వచ్చారని మోనితకి చెప్పండి అంటాడు. దీంతో పిలుస్తాను అంటుంది ప్రియమణి. మోనితమ్మ లాయర్ ను పిలిచిందంటే మళ్లీ ఏం చేయబోతుందో.. దీపమ్మను ప్రశాంతంగా ఒక్క రోజు కూడా నిద్రపోనిచ్చేలా లేదు.. అని అనుకుంటుంది ప్రియమణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Advertisement