Shanmukh Jaswanth : షణ్ముక్ కోసం వచ్చిందెవరు.. ‘బిగ్ బాస్’లో వెరీ బిగ్ ట్విస్ట్?
Shanmukh Jaswanth : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’లో కంటెస్టెంట్స్ రోజురోజుకూ అత్యద్భుతంగా తమ టాస్కులు పూర్తి చేస్తున్నారు. ‘టైటిల్ విన్నర్’ ఎవరు అయితారో అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతున్నది. మొత్తంగా బుల్లితెర ప్రేక్షకులు రియాలిటీ షోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హౌస్ పదకొండో వారం కొనసాగుతోంది.స్టార్ మా వారు బుధవారం విడుదల చేసిన ప్రోమోలో ఎవరూ ఊహించని విధంగా ట్విస్టులు ఉన్నాయి. ఇందులో ఆర్జే కాజల్ కోసం ఆమె భర్త, […]
Shanmukh Jaswanth : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’లో కంటెస్టెంట్స్ రోజురోజుకూ అత్యద్భుతంగా తమ టాస్కులు పూర్తి చేస్తున్నారు. ‘టైటిల్ విన్నర్’ ఎవరు అయితారో అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతున్నది. మొత్తంగా బుల్లితెర ప్రేక్షకులు రియాలిటీ షోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హౌస్ పదకొండో వారం కొనసాగుతోంది.స్టార్ మా వారు బుధవారం విడుదల చేసిన ప్రోమోలో ఎవరూ ఊహించని విధంగా ట్విస్టులు ఉన్నాయి. ఇందులో ఆర్జే కాజల్ కోసం ఆమె భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చారు
Shanmukh Jaswanth : దీప్తి సునయిన కోసం పరితపిస్తున్న షణ్ముక్ జస్వంత్..
. కాజల్ తన కూతురు, హస్బెండ్‌ను చూసి ఎమోషనల్ అయింది. ఇకపోతే శ్రీరామ చంద్రను చూసేందుకుగాను ఆయన భార్య హౌస్ ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా కంటెస్టెంట్స్‌లో ఇద్దరి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వడంతో హ్యాపీగా ఫీలయ్యారు.ఈ క్రమంలోనే తన కోసం ఎవరు వస్తారని ఆశగా షణ్ముక్ జస్వంత్ ఎదురు చూస్తున్నాడు. లాస్ట్ వీక్‌లో షణ్ముక్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన తనకు దీప్తి సునయిన గుర్తొస్తుందని చెప్పాడు. దాంతో నాగార్జున బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయాలని చెప్తాడు.
అయితే, షణ్ముక్‌ను పరామర్శించేందుకుగాను అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయినను హౌస్‌లోకి తీసుకొచ్చారా? లేదా ? అనేది పెద్ద ట్విస్టుగానే ఉంది. దీప్తి సునయినను చూడాలని షణ్ముక్ ఆరాటపడుతున్నప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు షణ్ముక్ తల్లిదండ్రులను హౌస్ లోకి తీసుకొచ్చి ట్విస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. ఏమవుతుందో.. ప్రోమో కట్ చేసిన తీరును బట్టి షణ్ముక్ కోసం ఎవరు వచ్చారనేది అస్సలు తెలియడం లేదు. అదే అసలైన ట్విస్టుగా ఉంటుందని తెలుస్తోంది. సోషల్ మీడియలో మాత్రం షణ్ముక్ కోసం దీప్తి సునయినను తీసుకొస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. దీప్తి సునయినను హౌస్‌లోకి తీసుకెళ్లాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి.. దీప్తి సునయిన స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతుందో.. లేదో..