Karthika Deepam 25 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 25 సెప్టెంబర్ 2021, శనివారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1154 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్కూల్ కు వెళ్లి కార్తీక్.. పిల్లలను కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుంటాడు. వాళ్లు.. కార్తీక్ తో ఏం మాట్లాడరు. కార్తీక్ ఎంత ప్రయత్నించినా కూడా మాట్లాడరు. అసలు ఏమైంది చెప్పడం లేదు ఏంటి.. వెళ్లేటప్పుడు బాగానే ఉన్నారు కదా… ఇప్పుడు ఏంటి ఈ మౌనవ్రతాలు.. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఏం మాట్లాడుకుండా బాధపడితే ఏమనుకోవాలి. చెప్పండి.. అని అనగానే ఇంటికి వెళ్దామా నాన్న.. అని సీరియస్ గా అంటుంది శౌర్య.
కట్ చేస్తే.. ఇంటికి వెళ్తారు అందరూ. సౌందర్య.. గతాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు తనకు. ఇప్పుడు వాళ్లు సంతోషంగానే ఉన్నారు కానీ.. అది ఎంత సేపు ఉంటుంది అనేదే తనకు భయంగా ఉంటుంది. కార్తీక్ గురించి నేనే ఇంతలా ఆలోచిస్తున్నాను అంటే కార్తీక్ మనసులో ఈ ఆలోచనలు ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయో. ఇద్దరి మనసుల్లో ఆ రాక్షసి ఆలోచనలు పోవాలి. దీపా కార్తీక్ లు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి.. అని అనుకుంటుండగానే దీప ఇంటికి వస్తుంది.
దీప.. బాధపడుతూ ఇంటికి రావడం చూసిన సౌందర్య.. దీప షాపింగ్ అయిపోయిందా.. అని అడుగుతుంది. షాపింగ్ కూడా జీవితం లాంటిదే అత్తయ్య. ఐపోయింది అని అనుకుంటాం కానీ.. ఐపోదు అని చెబుతుంది. ఇలారా.. కూర్చో… ఏంటో కొత్త కాపురం మొదలు పెట్టినట్టు ఇంట్లోకి కొత్త వస్తువులు కొన్నావా.. అని అడుగుతుంది. వస్తువులు కొత్తవి వచ్చిన తర్వాత పాత పాతపడిపోతుందా అత్తయ్య.. అంటుంది. కొత్త అంటేనే పాత పోయినట్టు. అన్నీ మరిచిపోయి.. మళ్లీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంటుంది సౌందర్య.
అంతా అయిపోయింది అని మనం మాత్రమే అనుకుంటున్నాం. కానీ.. బయట వేరేలా ఉంది అత్తయ్య.. అనగానే ఏంటే.. ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను.. అంటే అనడం కాదు.. అనుకుంటున్నారు.. మోనిత వల్ల డాక్టర్ బాబు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పుడు అందరి కళ్లలో పడ్డారు. మనసు బాగాలేదు అత్తయ్య. అందుకే వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాను అత్తయ్య. సత్యనారాయణ వ్రతం అని చెబుతుంది.
డాక్టర్ బాబు గురించి అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు అత్తయ్య. డాక్టర్ బాబు గురించి వారణాసితో చాలా చీప్ గా మాట్లాడారట.. అని చెబుతుంది. దీంతో ముందు నువ్వు లేవవే.. ఆ కన్నీళ్లు తుడిచేయ్. ఏంటే ఇది.. నువ్వసలు దీపవేనా.. ఎవడో ఏదో అన్నాడని.. అది వారణాసి నీకు చెప్పాడని అది విని.. నువ్వు బాధపడతావా? బయటవాళ్లు వంద అంటారు. నువ్వు ఇలా భయపడటం ఏంటి. ఎవరో ఏదో అన్నారని బాధపడుతున్న దీపేనా నువ్వు.. అని గడ్డిపెడుతుంది సౌందర్య.
దీప.. బస్తీ అన్నాక వందమంది వందరకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్లకు వేరే ఏం పనులు ఉండవు. పనిలేని వాళ్లు, పనికిరాని వాళ్లు మాట్లాడుకునే వాటి గురించి నువ్వెందుకే అంత డీలా అవుతున్నావు. వాడి ముందు కూడా ఇలాగే ఉంటే వాడు ఏం అయిపోవాలి. ధైర్యే సాహసే దీప అని నేను నమ్ముతున్నాను. ధైర్యంగా ఉండు. ఏమంటావు.. అంటూ ధైర్యం చెబుతుంది సౌందర్య.
ఇంటికి వచ్చాక పిల్లలు దాని గురించే ఆలోచిస్తుంటారు. మోనిత ఆంటి విషయంలో డాడీ అబద్ధాలు చెప్పాడా? డాడీ మంచోడు అని.. అబద్ధాలు చెప్పడని అనుకున్నాం కదా. కానీ షైనీ ఎందుకు అలా చెప్పింది. అమ్మకు కూడా నిజం తెలిసినా కావాలని అమ్మ కూడా అబద్ధం చెప్పిందా. ఎవరు నిజం చెబుతున్నారో.. ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలుసుకునే శక్తి నాకివ్వు దేవుడా.. అని హిమ తనలో తాను అనుకుంటుంది.
కట్ చేస్తే సౌందర్య.. బంతిపూల మాల చేస్తుంటుంది. కార్తీక్ వచ్చి ఎందుకు ఈ పూలు అని అడుగుతాడు. దీంతో.. దీప.. వ్రతం చేసుకుంటోంది.. అని చెబుతుంది సౌందర్య. అన్నీ చక్కబడ్డాయి కదా అందుకే చేసుకుంటోంది అంటుంది. ఏం చక్కబడ్డాయి మమ్మీ.. నాకైతే ఎప్పుడూ ఉన్నట్టే ఉంది. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు మమ్మీ. అందరూ నా పరిస్థితిని చూసి ఏమనుకున్నా పర్వాలేదు కానీ.. ఇంట్లో పిల్లలే.. అంటూ తెగ బాధపడతాడు కార్తీక్.
పిల్లలా.. ఏమైందిరా.. అందరూ బాగానే వెళ్లారు కదా. మళ్లీ ఏమైంది అని అడిగితే.. పిల్లలు కారులో వెళ్లేటప్పుడు బాగానే ఉన్నారు కానీ.. వచ్చేటప్పుడు అస్సలు ఏం మాట్లాడలేదు. తమలో తామే బాధపడ్డారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అని కార్తీక్ బాధపడతాడు. నేనే తప్పు చేయలేదు మమ్మీ. అయినా దోషిగా అందరి ముందు నిలబడ్డాను. లాకప్ లో పెట్టారు. కోర్టు బోనులో నిలబడ్డాను. బాధపడ్డాను. బాధను ఓర్చుకున్నాను. ఎందుకంటే నేను ఏతప్పు చేయలేదు కాబట్టి. ప్రపంచమంతా ఏమైనా అనుకోని. పిల్లలు నన్ను దోషిలా చూస్తున్నారు. నా పక్కన కారులో కూర్చోవడానికి కూడా.. వాళ్లు వెనకాడుతున్నారు.. అని చెప్పి బాధపడతాడు కార్తీక్.
వెళ్లేటప్పుడు అందరం బాగానే కబుర్లు చెప్పుకున్నాం. పిల్లలు బాగానే మాట్లాడారు. వచ్చేటప్పుడు ఏమైందో తెలియదు మమ్మీ. పక్కన కూర్చోమంటే కూర్చోరు. వెనుక సీట్లలో కూర్చున్నారు. వాళ్లకు వాళ్లే చూసుకుంటున్నారు. వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటున్నారు. అసలు నాకు ఏం అర్థం కావడం లేదు. ఏమైంది అని అడిగితే చెప్పరు. నాకేంటి ఈ శిక్ష. కనీసం నా కళ్లలో కళ్లు పెట్టి కూడా చూడటం లేదు. పలకరిస్తే మాట్లాడరు. ఎదురు పడితే చూపులు తిప్పుకుంటున్నారు. దీనికన్నా నాకు ఆ కోర్టులో శిక్ష పడ్డా బాగుండు ఏమో.. అని అని బాధపడతాడు కార్తీక్.
ఇంతలో రౌడీ అక్కడికి వస్తుంది. ఏయ్.. రౌడీ ఇలా రావే.. అని పిలవగానే.. ఆ హిమ వస్తున్నా.. హిమ పిలుస్తుంది నానమ్మా అని చెప్పి వెళ్లిపోతుంది. చూశావుగా మమ్మీ నాముందుకు రావడానికి కూడా తనకు ఇష్టం లేదు అంటాడు. కార్తీక్ పిల్లలది ఏముంది చెప్పు.. ఏదో విషయంలో నీమీద అలిగినట్టున్నారు. కాసేపటికి మాట్లాడుతారులే. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు. నిరాశగా మాట్లాడకు. దీప కూడా ఇందాక అలాగే చేసింది. అసలు మీరిద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారు.. తనకు సర్దిచెప్పేలోపే నువ్వు ఇలా.. కార్తీక్ నా మాట విను. మీరిద్దరూ ధైర్యంగా ఉండాలి. అన్నీ ముగిసిపోయాక ఇంకేంటి బాధ. నువ్వు, దీప సంతోషంగా ఉండండి.. పిల్లలు కాసేపు అయ్యాక వాళ్లే వస్తారు. కార్తీక్ గతం గతహా అనుకో. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు.. అని చెబుతుంది సౌందర్య.
అయినా కూడా కార్తీక్.. అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. నీకేదో ధైర్యం చెబుతున్నాను కానీ.. నామనసులో కూడా ఏదో భయంగానే ఉంది.. అని అనుకుంటుంది సౌందర్య. పిల్లలు ఎందుకు సడెన్ గా మారిపోయారు. నేనే పిల్లలను అడిగి తెలుసుకుంటా.. అని అనుకుంటుంది సౌందర్య.
కట్ చేస్తే.. దీప.. మళ్లీ మోనిత గురించే ఆలోచిస్తుంటుంది. వారణాసి చెప్పిన మాటలను కూడా గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత పిల్లలను తీసుకొని సౌందర్య.. కార్తీక్, దీప దగ్గరికి వస్తుంది. ఏమైందే మీకు ఏం కావాలి మీకు అని అడుగుతుంది దీప.
ఏమైంది బంగారం.. అని కార్తీక్ అడుగుతాడు. దీంతో నీ గురించి, ఆ మోనిత ఆంటీ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారు డాడీ స్కూల్ లో. మీరిద్దరూ ఫ్రెండ్స్ కాదంట కదా.. అని హిమ చెబుతుంది. మీ ఇద్దరి మధ్య ఇంకేదో ఉందంటున్నారు. అసలు మోనిత ఆంటి అప్పుడు ఎక్కడికి వెళ్లింది. మోనిత ఆంటి కనిపించకపోతే నిన్నెందుకు జైలులో వేశారు.. అంటూ ఇద్దరు పిల్లలు కార్తీక్ ను ప్రశ్నిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.