Karthika Deepam 28 Feb Today Episode : సౌందర్యకు అసలు నిజం చెప్పిన దీప.. ఈ విషయాన్ని సౌందర్య కార్తీక్ కు చెబుతుందా? కార్తీక్ ఆనంద్ ను మోనితకు అప్పగిస్తాడా?

Karthika Deepam 28 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 ఫిబ్రవరి 2022, సోమవారం 1287 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద్.. మోనిత కొడుకేనని తెలుసుకున్న దీపకు ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి కోటేశ్ ఎంత పని చేశావు. మోనిత బిడ్డను ఎత్తుకొచ్చావా అని అనుకుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఈ బిడ్డ మోనిత బిడ్డ అని డాక్టర్ బాబుకు ఎలా చెప్పగలను అనుకుంటుంది. తమ్ముడు.. తమ్ముడు అని పిల్లలు సంబురపడుతున్నారు. వీడు వచ్చినప్పటి నుంచి గాలిలో తేలిపోతున్నారు. అలాంటిది.. వీడు మీ తమ్ముడు కాదు. ఎప్పటికైనా వెళ్లిపోతాడు అని ఎలా చెప్పగలను. నేనైనా.. వీడిని వదిలి ఎలా ఉండగలను అని అనుకుంటుంది దీప.

karthika deepam 28 february 2022 full episode

ఏరా నాన్న.. నిన్ను వదిలిపెట్టి నేను కూడా ఉండలేను కదరా. ఈ అమ్మను వదిలిపెట్టి వెళ్లిపోతావా అని ఆనంద్ తో అంటుంది దీప. అత్తయ్య, మామయ్యలకు ఇంకా వీడితో చనువు ఏర్పడలేదు అని అనుకుంటుంది. అత్తయ్య.. అప్పారావు తెచ్చిన ఫోటోలు చూసింది. అంటే.. అందులో కోటేశ్ ను చూసింది. అంటే.. అత్తయ్యకు నిజం తెలుసా అని అనుకుంటుంది దీప. అత్తయ్య కోటేశ్ ఫోటో చూసింది. కోటేశ్ వీడియో అప్పారావు దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా చూసే ఉంటుంది. అంటే.. అత్తయ్యకు నిజం తెలిసే డాక్టర్ బాబుకు నిజం తెలియకూడదని సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న వీడియోను ఇవ్వలేదా అని అనుకుంటుంది. అత్తయ్య మీది ఎంత గొప్ప మనసు.. అని అనుకుంటుంది.

ఒరేయ్ ఆనందు.. నన్ను వదిలేసి వెళ్లిపోతావరా.. అని అనుకుంటుండగానే ఒక కారు వస్తుంది. ఆ కారులో కార్తీక్ ఉంటాడు. దీపను అక్కడ చూసి షాక్ అవుతాడు కార్తీక్. ఏంటి దీప ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతాడు. ఏం లేదు డాక్టర్ బాబు. కూరగాయల కోసం అని వచ్చాను అంటుంది దీప.

ఇటు ఇవ్వు.. ఏరా.. డాడీకి హలో చెప్పవా అంటాడు కార్తీక్. ఏరా డాడీకి హలో చెప్పవా అనే సరికి.. దీప షాక్ అవుతుంది. కనిపించగానే హలో డాడీ అనాలి. సరేనా అంటాడు కార్తీక్. దీప వెళ్దామా అంటాడు కార్తీక్. దీంతో సరే అంటుంది దీప. ఆనంద్ ను తీసుకొని వెళ్లి కారులో కూర్చొని సరదాగా కాసేపు ఆడుకుంటాడు కార్తీక్.

ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్లిపోతారు. మరోవైపు మోనిత తన ఇంట్లో ఉన్న ఊయలను తీసేస్తుంది. విన్నీ చూసి ఎందుకు మేడమ్ అని అడుగుతుంది. దీంతో వీటి అవసరం ఇక లేదు విన్నీ అంటుంది మోనిత. బాబు దొరికాడా అని అడుగుతుంది. దీంతో ఎందుకు తీసేస్తున్నారు మరి అని అడుగుతుంది.

నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం కోసం నీకు జీతం ఇవ్వడం లేదు. నేను చెప్పే పని చేయడానికి అంటుంది మోనిత. దీంతో సరే మేడమ్ అంటుంది విన్నీ. ఈవడ ఎవ్వరికీ అర్థం కాదు అని అనుకుంటున్నావా? అవును.. నువ్వు అనుకున్నది కరెక్టే. నేను ఎవ్వరికీ అర్థం కాను అంటుంది మోనిత.

Karthika Deepam 28 Feb Today Episode : హిమ, శౌర్య.. ఆనంద్ తో అనుబంధం పెంచుకోవడంతో టెన్షన్ పడ్డ సౌందర్య

మరోవైపు ఆనంద్ తో సరదాగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. వాళ్లను అలా చూసి సౌందర్య తెగ టెన్షన్ పడుతుంది. పిల్లలు అప్పుడే వీడి గురించి కలలు కంటున్నారు. వీడితో జీవితాంతం కలిసి ఉండాలని ఆశ పడుతున్నారు. వాళ్ల తమ్ముడని.. అనుకుంటున్నారు. రేపు మోనిత వచ్చి తీసుకెళ్తే తట్టుకుంటారా అని అనుకుంటుంది సౌందర్య.

ఇంతలో కార్తీక్, దీప అక్కడికి వస్తారు. అత్తయ్య.. మీరెంత గొప్పవాళ్లు అత్తయ్య. నిజం తెలిసి మీరు ఎంత మథన పడుతున్నారో నాకు అర్థం అవుతోంది. ఎవ్వరికీ చెప్పలేరు. చెప్పకుండా ఉండలేరు. ఆనంద్.. మోనిత కొడుకు అన్న విషయాన్ని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను అని అనుకుంటుంది దీప.

డాడీ.. నాకు కారు డ్రైవింగ్ నేర్పించవా. పెద్దవగానే.. తమ్ముడిని నేను స్కూల్ కు కారులో తీసుకెళ్లి.. నేను పికప్ చేసుకుంటాను అని కార్తీక్ తో అంటుంది హిమ. దీంతో సౌందర్య, దీప.. ఇద్దరూ ఇంకా ఎక్కువ టెన్షన్ పడతాడు. మాట్లాడవేంటి డాడీ అంటుంది హిమ. దీంతో సరేనమ్మ.. చూద్దాంలే అంటాడు కార్తీక్.

బాబాయిని అడ్డుపెట్టుకొని గొప్ప ప్లాన్ వేస్తే.. ఆపరేషన్ అవ్వగానే డిశ్చార్జ్ అయి చెప్పాపెట్టకుండా అమెరికా వెళ్లిపోయి బతికిపోయాడు అని అనుకుంటుంది మోనిత. ఒక ప్లాన్ పోతే ఏం.. దేవుడు నాకు ఇంకో ప్లాన్ ఇచ్చాడు. నా కొడుకే గెలిపిస్తాడు అనుకుంటుంది మోనిత.

నా బిడ్డను మీ ఇంట్లో పెట్టుకొని మీ ఇద్దరు పిల్లలు.. నా తమ్ముడు.. నా తమ్ముడు అని సంబురపడిపోతున్నారు. కానీ.. వాడు నా బిడ్డ అని తెలిసినప్పుడు మీకు ఉంటుంది.. చుక్కలు కనబడతాయి అని అనుకుంటుంది మోనిత. ఈసారి నా ప్లాన్ లో ఎలాంటి మార్పు ఉండదు. విడదీయరాని ప్రేమను.. వదులుకోలేని బంధాన్ని పెంచుకున్నారు అని అనుకుంటుంది మోనిత.

మరోవైపు సౌందర్య టెన్షన్ పడుతూ పైన కూర్చుంటుంది. ఇంతలో దీప ఆనంద్ ను తీసుకొని అక్కడికి వస్తుంది. వీడు వస్తూ వస్తూ బోలెడంత ప్రేమను తీసుకొచ్చాడు. కానీ.. ఆ తీపి కూడా ఎక్కువై ఇప్పుడు చేదుగా మారింది.. అంటుంది దీప.

ఈ ఆనంద్ పాపం.. బోసినవ్వుల పాపాయి వీడు. వీడు చేసిన తప్పేంటి. వీడి ద్వారా మనకు ఒక పెద్ద సమస్య ఎదురైంది కదా అత్తయ్య అంటుంది దీప. వీడు మోనిత కొడుకని మీకు తెలుసని నాకు తెలుసు అత్తయ్య అంటుంది దీప. దీంతో సౌందర్య షాక్ అవుతుంది.

నిజం తెలిసి మీరు ఎంత బాధపడ్డారో ఏమో కానీ… ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఏం అర్థం కావడం లేదు అత్తయ్య అంటుంది దీప. మన మీద ఆ ఈశ్వరుడికి ఏం కోపమో నాకు అర్థం కావడం లేదు అంటుంది సౌందర్య. మోనిత కొడుకును ఎవరు తీసుకెళ్లారో ఆ వీడియో మీ దగ్గర ఉంది కదా. పాపం డాక్టర్ బాబు మోనిత పీడను వదిలించుకోవాలని అనుకున్నారు.

కానీ.. ఆ మోనిత కొడుకు మీదే ఇంట్లో వాళ్లందరం ప్రేమ పంచుకున్నామని ఎలా చెప్పగలం అంటుంది దీప. ఈ ఆనందే మీరు వెతుకుతున్న మోనిత బిడ్డ అని ఎలా చెప్తాం అంటుంది దీప. దీంతో సౌందర్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ దేవుడు కూడా మనల్ని ప్రతి సారి ఏడిపిస్తున్నాడు అని అంటుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago