Karthika Deepam 28 Sep Today Episode :పేప‌ర్‌లో మోనిత ఆర్టిక‌ల్‌.. చూసి షాక్ అయిన దీప‌, కార్తీక్‌.. చివ‌ర్లో పిల్ల‌ల ట్విస్టు..

Karthika Deepam 28 Sep Today Episode బుల్లితెరపై సూపర్ హిట్ సీరియల్‌గా ‘కార్తీక దీపం’ కొనసాగుతోంది. ప్రేక్షకులు ఈ సీరియల్ టైమ్ వచ్చిందంటే చాలు.. కచ్చితంగా దానిని చూడాల్సిందే అనేంతలా ఈ సీరియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ సీరియల్‌లో దీపగా ప్రేమి విశ్వనాథ్, కార్తీక్‌గా విరుపమ్ సీరియల్ లవర్స్, ప్రేక్షకులను అలరిస్తున్నారు.

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

మంగళవారం ఈ సీరియల్ 1156వ ఎపిసోడ్‌కు ఎంటర్ అయింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకుందాం. పేపర్‌లో వచ్చిన మ్యాటర్ గురించి దీప ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే పిల్లలు స్కూల్లో తమకు తమ స్నేహితురాలు షైనీ చెప్పింది నిజమా ? అబద్దమా ? అంటూ ఏడుస్తూనే దీపను నిలదీస్తారు.దీంతో దీప ఎమోషనల్ అయి ఆయన ఏ తప్పు చెయ్యలేదని, అయినా ప్రేమను పంచే తండ్రిపైన మీకు కోపం ఏంటి? ఇదేనా మీరు తండ్రికి ఇచ్చే గౌరవమని పిల్లలకు చెప్తూ వారిని మంచిగా మార్చేస్తుంది.

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

దాంతో పిల్లలు తండ్రిపైన ఉన్న కోపాన్ని వదిలేస్తారు. ఇక తెల్లవారగా కార్తీక్ ఇంటి బయట పేపర్ పట్టుకుని ఉంటాడు. అందులో ఉన్న మోనిత ఫొటో, ఆమె కథ చూసి షాక్‌లో ఉండిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలో అక్కడికి దీప వచ్చి ఏమైంది డాక్టర్ బాబు అని అడుగుతుంది. కార్తీక్ కళ్లు తుడుచుకుంటూ ఆ పేపర్ దీపకు అందిస్తాడు కార్తీక్. ఆ పేపర్ చదివి దీప షాక్ అవుతుంది.

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

‘నా బిడ్డకు తండ్రి అతనే.. ఓ డాక్టర్ వింత ప్రేమకథ’ అనే శీర్షికతో ఉన్న కథనాన్ని చదువుతండగా… సౌర్య తన డ్రెస్ కనిపించడం లేదని బయటకు వస్తుంది. ఆ సమయంలో పేపర్ దాయడం చూసి లాక్కుంటుంది. పేపర్‌లో ఏముందని అడగడంతో పాటు దానిని చదివి షాక్ అవుతుంది నాన్న ఇది నిజమేనా? అని సౌర్య అరుస్తుంది. అయితే, ఇదంతా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కాదండోయ్.. ఇలా జరిగినట్లు కార్తీక్ కలగంటాడు. కలలో నుంచి బయటకు వచ్చేస్తాడు.

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

ఇకపోతే కలలో మాదిరిగానే బయట కూర్చుని దీప పేపర్ పట్టుకుని ఉంటుంది. దాంతో కలలో ఊహించుకున్న మాదరిగా కార్తీక్ వచ్చి దీప చేతిలో ఉన్న పేపర్ లాక్కుని కిందపడేస్తాడు. అంతలోనే సౌందర్య బయటకు వచ్చి పేపర్ తీసుకుని ఎందుకు కింద పడేశావ్ అని అడుగుతుంది. పేపర్‌లో ఉన్న మ్యాటర్ చదివి దానిని ఉద్దేశించి ఇలా పేపర్‌కు ఎక్కి తమను నవ్వుల పాలు చేస్తున్నారంటుంది సౌందర్య.

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

ఇలా చేస్తే ఎవరైనా తల ఎత్తుకోగలరా? అని దీప అడుగుతుంది. ఈ క్రమంలోనే సౌందర్య పేపర్ దాచేయ్ అని దీపకు చెప్తుంది. కార్తీక్ కూడా దాచేయమని చెప్పడంతో దీప పేపర్ తీసుకుని లోపలకి వెళ్లిపోతుంది. ఇదే టైంలో జైలులో ఉన్న మోనిత ఆ పేపర్ కథనం చదువుతుంది.

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

Karthika Deepam 28 Sep Today Episode అమ్మ‌మ్మ‌, తాత‌య్య అంటూ పిల్ల‌ల ఎంట్రీ..

జైలులో కూర్చొని మోనిత పేపర్ చదువుతూ తనకు కార్తీక్ మధ్య ఉన్న ప్రేమ పదహారేళ్ల నాటిదని గుర్తు చేసుకుంటుంది. తన ప్రేమ గెలుస్తుందని, కార్తీక్ మీద ఉన్న ప్రేమ గెలిపిస్తుందని అనుకుంటుంది. ఈ క్రమంలోనే దీప మొగుడు తనకు పుట్టబోయే బిడ్డకు డాడీ కార్తీక్ అని చెప్తుంది. కార్తీక్-దీపకు సౌర్య, హిమ పుట్టారని, వారికి ఇప్పుడు బ్రదర్ రాబోతున్నాడని, వారు ముగ్గురు కలిసి ఉంటారని, మోనిత- కార్తీక్ ప్రేమ కథ చరిత్రలో ఉండిపోతుందన్న మ్యాటర్ చదువుతూ ఆనంద పడుతుంది మోనిత.

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

సరిగ్గా అదే సమయంలో సౌర్య దీప ఉన్న రూమ్ తలుపు కొడుతూ.. అమ్మా ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. నానమ్మ పూజకు రమ్మంటుందని చెప్తుంది. దాంతో దీప పూజకు సిద్ధమవుతుంది. అలా నెక్స్ట్ సీన్‌లో దీప, కార్తీక్ పూజలో కూర్చుని పూజ కంప్లీట్ చేయగానే, ఇద్దరు మగపిల్లలు సౌర్య, హిమ కంటే పెద్దవాళ్లు ‘అమ్మమ్మా తాతయ్యా’ అని ఎంట్రీ ఇస్తారు. దాంతోసౌందర్య, ఆనందరావుల హ్యాపీగా చేతులు చాపి వారిని హత్తుకుంటారు.

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

వాళ్లు కూతురు స్వప్న పిల్లలు అయ్యి ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తానికి సౌందర్య, హిమకు జోడీగానే కథనడపనున్నట్లు అర్థమవుతోంది. వీరు ఎవరు అమ్మమ్మ తాతయ్య అంటున్నారు అని సౌర్య అడగడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

22 minutes ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

1 hour ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

2 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

4 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

5 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

7 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

8 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

9 hours ago