why-pawan-kalyan-ignored-allu-arjun-ram-charan
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమాలు, రాజకీయాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత మరో అయిదు ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా ఒక సినిమా 2022 సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే 2022 ఏప్రిల్‌లో మరో పాన్ ఇండియన్ సినిమా హరి హర వీరమల్లును రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది చివరికి హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు సెట్స్ మీదకి తీసుకు రానున్నారు…
why pawan-kalyan-ignored allu arjun, ram charan
ఇలా వరుస సినిమాలతో పాటు తన జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారలలో కూడా తలమునకలై ఉన్న పవన్ కళ్యాణ్ ఇతర హీరోల సినిమాలను ప్రమోట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ – దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో రూపొందిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. సినిమా ప్రమోషన్‌తో పాటు ఇండస్ట్రీ వైసీపీ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. మీలాగా మాకు ఊరికే డబ్బులు రావడం లేదు మా సినిమా వాళ్ళకి అంటూ కౌంటర్ ఇచ్చాడు.
allu arjun tested covid positive
ఇదే సమయంలో బాహుబలి కోసం ప్రభాస్ కండలు పెంచి, ఎన్.టి.ఆర్ తన సినిమాల కోసం ఎంతో కష్టపడి డాన్సులు చేయడం వల్ల డబ్బులొస్తున్నాయని చెప్పుకొచ్చాడు. అయితే తన అల్లుడు అల్లు అర్జున్ మంచి డాన్సర్, రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా కష్టపడి కసరత్తులు చేసి కండలు పెంచాడు. కానీ పవన్ కళ్యాణ్ వీరిద్దరి పేరు రిపబ్లిక్ మూవీ ఈవెంట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా వీరి పేరు మాత్రమే చెప్పాలని పవన్ కళ్యాణ్ భావించలేదు. స్పీచ్‌లో భాగంగా ఫ్లోలో ఆ సమయంలో తన నోటికి ఠక్కున వచ్చిన ప్రభాస్, ఎన్.టి.ఆర్ పేర్లు ప్రస్తావించడం మాత్రమే జరిగిందని మెగా అభిమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.