
karthika deepam 29 march 2022 full episode
Karthika Deepam 29 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 312 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఫస్ట్ టైమ్ ఒక అబ్బాయికి నచ్చాను. నేను బాగున్నాననట.. అంటూ నిరుపమ్ గురించి అనుకుంటుంది శౌర్య. మరోవైపు నిరుపమ్ కూడా తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. హిమ కూడా అదే అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హాస్పిటల్ లో మనం చూసిన అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉంది కదా అంటుంది హిమ. దీంతో అవును.. నాకు కూడా అదే అనిపిస్తోంది అంటాడు నిరుపమ్.
karthika deepam 29 march 2022 full episode
డాక్టర్ సాబ్.. ఈ రోజు నేను హ్యాపీ. చాలా చాలా హ్యాపీ. అమ్మాయంటే ఎలా ఉండాలి. నాలా ఉండాలి.. అని కలలు కంటుంది శౌర్య. అలా.. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఆలోచించుకుంటుండగానే.. నిరుపమ్ కారు.. తన ఆటోను దాటేసి వెళ్లిపోతుంది. ఏంటో నిరుపమ్.. అక్కడ రోడ్డు పక్కన ఆగిన ఆటోను చూశాక అందులో ఆ అమ్మాయే ఉందేమో అనిపిస్తోంది అంటుంది హిమ. ఉంటే ఉందేమో తనెందుకు నీకు గుర్తొస్తుంది అంటాడు నిరుపమ్. అయినా మనకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు. మనదంతా ఆటో బ్యాచ్ కదా అనుకుంటుంది శౌర్య.
నాకు ఒక ఐడియా వచ్చింది హిమ. అలాంటి శివంగి నీకు ఫ్రెండ్ అయితే నీ సిగ్గు, బిడియం అన్ని పోతాయి తెలుసా అంటాడు నిరుపమ్. మరోవైపు సౌందర్య.. స్వప్న ఇంటికి వెళ్తుంది. మీడాడికి అంటూ ఏదో చెప్పబోతుండగా తెలిసింది.. రాలేదు అంటుంది.
అక్కడ నువ్వుంటావని రాలేదు అంటుంది స్వప్న. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు అంటే.. నన్ను ఇలా మార్చింది నువ్వే కదా మమ్మీ అంటుంది స్వప్న. డాడీ మీద ప్రేమ్ ఉంది కానీ.. అక్కడ నువ్వు ఉంటావు కాబట్టి.. అందుకే రాలేదు అంటుంది స్వప్న.
ఎంతకాలమే నీకు ఈ కోపం. ఎప్పుడో నీ కూతురును నేను ఏదో అన్నానని.. అంటుంది సౌందర్య. మమ్మీ నువ్వు అన్న మాటలు.. చేసిన గాయం అంత ఈజీగా మానదు అంటుంది స్వప్న. హిమను కావాలని నిరుపమ్ ఆసుపత్రిలో డాక్టర్ గా ఎందుకు పెట్టావు. నాకు తెలుసు మమ్మీ.. పిల్లల గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో. అలా జరగదు అంటుంది స్వప్న.
ఇంతలో నిరుపమ్ వస్తాడు. తాతయ్యకు త్వరగా నయం అవ్వాలని గుడికి వెళ్లి వస్తున్నాను అంటుంది సౌందర్య. నేను ఫోన్ చేసి చెప్పాను కదా హాస్పిటల్ కు రాలేదేంటి అని అడుగుతాడు నిరుపమ్. దీంతో ప్రేమలు ఉన్నాయని చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది స్వప్న.
మమ్మీ ఎందుకు ఈ పంతాలు.. నేను నీలాగా హార్ష్ గా మాట్లాడలేను. ఆలోచించలేను. నీలాగా బంధాలను తెంచుకోనూ లేను అంటాడు నిరుపమ్. నాకు అందరూ కావాలి. అందుకే నువ్వు వద్దన్నా డాడీని కలుస్తాను. డాడీని ప్రేమిస్తాను. అమ్మమ్మ, తాతయ్య, హిమ విషయంలో కూడా అంతే అంటాడు నిరుపమ్.
మమ్మీ మారదు కానీ.. నువ్వు ఇక ఇక్కడికి రాకు అని సౌందర్యతో అంటాడు నిరుపమ్. మరోవైపు చంద్రమ్మను ఆసుపత్రికి తీసుకొస్తుంది. నిరుపమ్ డాక్టర్ దగ్గరికి శౌర్య తీసుకొని వస్తుంది. మరోవైపు శౌర్య.. నిరుపమ్ ప్రేమలో పడిపోతుంది. 24 గంటలు అతడి గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక నుంచి అయినా దొంగతనాలు మానేయండి. ఒళ్లు వంచి పనిచేయండి అంటుంది శౌర్య. మరోవైపు ఆటో అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉంటుంది హిమ. తనెందుకు పదే పదే గుర్తొస్తుంది అనుకుంటుంది. ఇంతలో ఆ ఆటో అమ్మాయిని చూస్తుంటే మన శౌర్యను చూసినట్టు లేదు అంటాడు నిరుపమ్.
బావ నా మనసులో మాటను చెప్పావు. తనను చూస్తుంటే తనే ఎందుకో మన శౌర్య అనిపిస్తోంది అంటుంది హిమ. అప్పుడే శౌర్య.. వాళ్ల దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
This website uses cookies.