Karthika Deepam 29 Nov Today Episode : బస్తీలో ఇల్లు కట్టుకోబోతున్న కార్తీక్, దీప.. కార్తీక్ కు మోనిత మరోసారి భారీ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 29 Nov Today Episode : బస్తీలో ఇల్లు కట్టుకోబోతున్న కార్తీక్, దీప.. కార్తీక్ కు మోనిత మరోసారి భారీ షాక్

 Authored By gatla | The Telugu News | Updated on :29 November 2021,9:00 am

Karthika Deepam 29 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 నవంబర్ 2021, సోమవారం 1209 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెడికల్ క్యాంపులు పెట్టి నువ్వు చేసిన పాపాలను కడుక్కోవాలని చూస్తున్నావా కార్తీక్.. అంటూ మోనిత ప్రశ్నిస్తుంది. డాక్టర్ బాబు.. బస్తీలో పెట్టిన హెల్త్ క్యాంప్ దగ్గరికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది మోనిత. అసలు నీకు ఏం కావాలి అని అడుగుతుంది దీప. ఏం చేయాలో నేను చేస్తాను అంటుంది మోనిత.మోనిత రెచ్చిపోతూ మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి ఆనంద రావు వస్తాడు. ఏం చేస్తావమ్మా నువ్వు ఏం చేస్తావు అని ప్రశ్నిస్తాడు ఆనంద రావు. నీ జీవితాన్ని నువ్వే ఇలా చేసుకున్నావు.

ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటాడు. దీంతో నాకు ఎవ్వరూ వద్దు కార్తీక్ మాత్రమే కావాలి. నా బిడ్డకు తండ్రి అని ఒప్పుకోవాలి అంటుంది మోనిత. దీంతో మోనిత అంటూ సీరియస్ అవబోతాడు ఆనంద రావు. వద్దు మామయ్య మీరు ఆగండి.. తనకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నేను చూసుకుంటా అంటుంది. బస్తీ వాళ్లకు మోనిత గురించి చెబుతుంది దీప. తను బిడ్డను ఎలా కన్నదో బస్తీ వాసులకు చెబుతుంది దీప. దీంతో బస్తీ వాసులకు కోపం వస్తుంది. డాక్టర్ బాబు ఏ తప్పు చేయలేదు. ఆ బిడ్డకు, డాక్టర్ బాబుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ మోనితే మోసం చేసి బిడ్డను కన్నది అని అంటుంది దీప.

ఇలాంటి తప్పు మన బస్తీలో ఎవరైనా చేస్తే ఏం చేస్తాం అని ప్రశ్నిస్తుంది దీప. జుట్టు పట్టుకొని నాలుగు కొడతాం అంటారు బస్తీ వాళ్లు. కోపం ఆగలేక.. చీపుర్లు పట్టుకొని అక్కడికి వస్తారు. దీంతో మోనిత, ప్రియమణి అక్కడి నుంచి పారిపోతారు. బస్తీ వాళ్లను నా మీదికే ఉసిగొల్పుతావా? చూస్తా మీ సంగతి. మీ వంటలక్కే నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేలా చేస్తా అని శపథం చేసి వెళ్లిపోతుంది మోనిత.

karthika deepam 29 november 2021 monday 1209 full episode

karthika deepam 29 november 2021 monday 1209 full episode

కట్ చేస్తే.. మోనిత ఇంటికి వెళ్లి భోజనం చేస్తుంటుంది. ప్రియమణి నువ్వు వంటలు బాగా చేస్తావు అని పొగుడుతుంది మోనిత. మీరు ఇంత హుషారుగా ఉన్నారేంటమ్మా అంటుంది ప్రియమణి. బస్తీలో జరిగిన గొడవకు బాధపడటం లేదా అని అడుగుతుంది.

ఒక మనిషి పరిగెడుతున్నాడు అనుకో.. కాలికి దెబ్బ తగిలింది అనుకో. మెల్లగా పరిగెడతాడు. నాకు దెబ్బ తగిలితే ఇంకా స్పీడ్ గా పరిగెడతాను. నన్ను రెచ్చగొడితే ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాను. నేను అందరిలా ఆలోచించను.. అందరికి మించి ఆలోచిస్తాను అంటుంది ప్రియమణి.

Karthika Deepam 29 Nov Today Episode : బస్తీకి వెళ్లిపోదామని చెప్పిన దీప.. కార్తీక్ కూడా గ్రీన్ సిగ్నల్

మరోవైపు డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరూ కలిసి వంట వండుతుంటారు. సరదాగా గడుపుతారు. తనకు వంటలో సాయం చేస్తుంటాడు కార్తీక్. బస్తీలో క్యాంప్ పెట్టినందుకు థ్యాంక్స్ డాక్టర్ బాబు అంటుంది దీప. అరుణక్క పొద్దున ఒక మాట అంది.. బస్తీకి దూరం అయ్యారు అని అంది అంటుంది.

బస్తీలోనే స్థలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకుంటాం అని చెప్పా.. అని అనే సరికి.. సరే దీప.. అక్కడే స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుందాం. ఆసుపత్రి కూడా కడదాం.. అని చెబుతాడు కార్తీక్. దీంతో దీప చాలా ఖుషీ అవుతుంది. ఇంతలోనే సౌందర్య వస్తుంది. దీంతో సౌందర్యకు ఈ విషయం చెప్పగానే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నావా? అంటుంది.

డాడీ అమ్మవాళ్లు ఎప్పటికీ ఇప్పటిలాగే కలిసి ఉండాలి.. హ్యాపీగా ఉండాలి అని శౌర్యతో హిమ అంటుంది. ఎప్పటికీ ఉంటారు హిమ అని చెప్పి నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. మనం బస్తీలో ఒక ఇల్లు కట్టుకోబోతున్నాం అని చెబుతుంది శౌర్య. దీంతో హిమ కూడా ఖుషీ అవుతుంది.

మరోవైపు డాక్టర్ కార్తీక్ ను డాక్టర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అప్పుడే అక్కడికి మోనిత వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది. నాకు న్యాయం చేస్తేనే కార్తీక్ ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటా అంటుంది. దీంతో దీప స్టేజ్ మీదికి వచ్చి తను అసలు డాక్టర్ గానే పనికిరాదు అని చెప్పి షాక్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది