Karthika Deepam 3 Jan Today Episode : శ్రీవల్లి కొడుకును దత్తత తీసుకున్న కార్తీక్.. ఆ పిల్లాడు మోనిత కొడుకు అని కార్తీక్ కు తెలుస్తుందా? దీప నిర్ణయం ఏంటి?

Karthika Deepam 3 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 జనవరి 2022, సోమవారం 1239 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. దీప.. పిండి వంటలు చేస్తూ ఉంటుంది. ఇంతలో పిల్లలు వచ్చి అమ్మా మాకు కూడా ఈ వంటలు ఎలా చేయాలో చెప్పండి అంటారు. మీకెందుకు ఈ వంటల బాధ అంటుంది దీప. ఇంతలో కార్తీక్ వస్తాడు. నాన్న.. మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోదాం అంటారు పిల్లలు. ఎందుకమ్మా అంటాడు. అందరూ ఈ బాబు శ్రీవల్లి కొడుకు.. మీ తమ్ముడు కాదు అంటున్నారు. అందుకే మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోదాం అంటారు. దీప కూడా అవునండి.. మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోదాం అంటుంది. కానీ.. ఇప్పుడు ఊరు వదిలి వెళ్లలేం అంటాడు కార్తీక్. మీరు రుద్రాణికి ఇచ్చే అప్పు గురించి ఆలోచిస్తున్నారా అని అంటుంది దీప. అప్పు త్వరలోనే తీర్చేద్దాం అంటుంది.

karthika deepam 3 january 2022 full episode

పిల్లలు వెళ్లిపోయాక.. ఈ ఇల్లును మనం రుద్రాణికి అప్పగించేసి బాబును తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోదాం అంటుంది దీప. ఇక్కడ వద్దు.. అంటుంది. ఈ ఇల్లును రుద్రాణికి అప్పగిస్తే.. అప్పు కట్టాల్సిన అవసరం ఉండదు కదా అని అంటుంది. శ్రీవల్లి, కోటేశ్ ను రుద్రాణి దారుణంగా చంపేసింది. వాళ్ల చావుకు అర్థం ఉండాలంటే కనీసం ఈ ఇల్లును వీడికి చెందేలా చేయాలి.. అని అంటాడు కార్తీక్. మరోవైపు సౌందర్య.. పిల్లలను గుర్తు తెచ్చుకొని తెగ ఏడుస్తుంది. వాళ్ల పుస్తకాల కోసం వెతుకుతుంటుంది. ఇంతలో ఆనంద రావు వచ్చి ఏం చూస్తున్నావు సౌందర్య అంటాడు. పిల్లలు పదే పదే గుర్తొస్తున్నారు. వాళ్ల చేతిరాత అయినా చూస్తాను అని అంటుంది. ఆపుస్తకాలు అన్నీ ఇక్కడ లేవు. వాటిని ఆదిత్య స్టోర్ రూమ్ లో పెట్టాడు అంటాడు ఆనంద రావు. కార్తీక్, పిల్లలు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. వాళ్లు వచ్చేదాకా మనమే గుండె నిబ్బరంగా ఉండాలి అని చెబుతాడు.

మరోవైపు కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటాడు. నేను దేనికీ పనికిరాను దీప అంటాడు కార్తీక్. శ్రీవల్లి, కోటేశ్ కు అన్యాయం జరిగినా నేను ఏం చేయలేకపోయాను. రుద్రాణి నువ్వు చేసింది తప్పు అని అరిచి లోకానికి చెప్పాలనుకున్నాను కానీ.. చెప్పలేకపోయాను. కాళ్లకు మట్టి అంటకుండా పెరిగిన పిల్లలకు కాళ్లకు చెప్పులు లేని పరిస్థితికి తీసుకొచ్చాను అంటాడు.

కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఏంటి దీపా ఇది. నా దగ్గర ఇంకా తగ్గించుకోవడానికి ఏముందని. ఇదంతా ఆత్మవంచన దీప. నేను బాధపడతాననో.. ఏదైనా చేసుకుంటాననో నువ్వు నాకు ధైర్యం చెబుతున్నావు కానీ.. నేనేంటి.. అసలు నేను ఎవరు. ఒక డాక్టర్ నా. డాక్టర్ అయి ఉండి వైద్యం చేయలేకపోతున్నాను. ఒక మనిషినా. మనిషి అయి ఉండి సాటి మనిషికి ధైర్యం చేయలేకపోతున్నాను అంటాడు.

ఒక తండ్రి, భర్త అయి ఉండి కూడా పిల్లలను సరిగ్గా చూసుకోలేక.. భర్తగా ఏ బాధ్యతా లేకుండా ఉన్నాను.. ఏంటి దీప ఇది అంటాడు కార్తీక్. మీరు ఇన్ని చెప్పారు కదా. నేను ఒక మాట చెబుతాను చూడండి.. మీకు ఇష్టమైన పని.. మీకు చేతనైన పని ఏదో ఒకటి చేయండి చాలు అంటుంది దీప. మీరు బాబును చూస్తూ ఉండండి.. నేను ఇవన్నీ అమ్మేసి వస్తాను అని చెప్పి దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Karthika Deepam 3 Jan Today Episode : పిల్లలు గుర్తుకు వచ్చి వాళ్ల పుస్తకాలను చూసి మురిసిపోయిన సౌందర్య

కట్ చేస్తే స్టోర్ రూమ్ కు వెళ్లి పిల్లల పుస్తకాలను చూసి వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది సౌందర్య. ఎక్కడికి పోయారు ఈ నానమ్మను వదిలేసి అని బాధపడుతుంది సౌందర్య. ఇంతలో మోనిత ఫోటో స్టోర్ రూమ్ లో కనిపిస్తుంది తనకు. మోనిత, కార్తీక్ కలిసి పూజ చేస్తున్న ఫోటో అది. దాన్ని తీసుకొని వచ్చి కింద విసిరేస్తుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన మోనిత.. దాన్ని పట్టుకుంటుంది. నువ్వా.. అంటుంది సౌందర్య. నమస్తే ఆంటి గారు. మీరు విసిరేస్తే క్యాచ్ పట్టుకున్నాను.. అంటుంది. నేను దీనికోసమే వచ్చాను. నా మనసు తెలుసుకున్నట్టే మీరు దీన్ని నాకు ఇచ్చారు. మీరు ఎంత మంచివారు ఆంటి గారు.. అంటుంది మోనిత.

చూశారా.. మీరు దీన్ని పడేద్దాం అనుకున్నాను. నేను దీన్ని తీసుకెళ్దాం అనుకున్నాను. కొన్ని మనం అనుకుంటాం కానీ.. అవి జరగవు.. అంటుంది మోనిత. అప్పుడె ఎందుకు మిడిసిపడుతున్నావు అంటుంది సౌందర్య. మళ్లీ ఈ ఇంట్లో నా కార్తీక్ తో, నా బిడ్డతో ఈ ఇంట్లో అడుగు పెడతాను అంటుంది మోనిత.

మరోవైపు కార్తీక్.. శ్రీవల్లి బిడ్డకు దగ్గరవుతాడు. బాబు ఒళ్లు తీవ్రంగా కాలిపోతూ ఉంటుంది. నువ్వు మా లైఫ్ లోకి వచ్చావు. ఈ పేదరికంలో నిన్ను ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదు అని అంటాడు కార్తీక్. ఏంటోరా మీ అమ్మా నాన్నా ఎవరో నాకు తెలియదు.. అంటాడు కార్తీక్.

ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు. శ్రీవల్లి, కోటేశ్ కొడుకు అయ్యావు. వాళ్లు వెళ్లిపోయారు. ఇప్పుడు ఒంటరినయ్యావు. బాధపడకురా. నీకు మేమున్నాం. మేమంతా ఉన్నాం అంటాడు కార్తీక్. వీళ్లిద్దరి ఆత్మలు పుణ్యలోకాలకు వెళ్లాలని కోరుకుందాం. క్షమించు శ్రీవల్లి, ఆనంద్ ఇప్పటి నుంచి నా కొడుకు. మా బిడ్డలతో సమానంగా చూసుకుంటాను. వీడిని మా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అని అనుకుంటాడు కార్తీక్.

పాలు తాగుతావా నాన్నా. ఎప్పుడు తాగావో ఏంటో తీసుకొస్తాను అని చెప్పి పిల్లాడిని ఊయలలో పడుకోబెట్టి వెళ్తాడు. మరోవైపు దీప పిండివంటలు చేసి నా అప్పు తీరుస్తుందా అని అనుకుంటుంది రుద్రాణి. దీప పిండి వంటలు చేయకుండా ఆపాలని డైరెక్ట్ గా కార్తీక్ దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

3 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

4 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

5 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

7 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

8 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

9 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

10 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

11 hours ago