
karthika deepam 31 january 2022 episode highlights
Karthika Deepam 31 Jan Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం, 31 జనవరి 2022న ప్రసారం అవుతుంది. సోమవారం 1263 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ను వెతుక్కుంటూ రుద్రాణి మనుషులు తాడికొండ మొత్తం గాలిస్తుంటారు. సైకిల్ మీద ఫాస్ట్ గా వెళ్తున్న కార్తీక్ ను చూసి వెంటనే ఆపి.. పదా అక్క పిలుస్తోంది అంటారు. నా కూతురుకు బాగా లేదు. నేను డబ్బులు తీసుకురావడాని వెళ్తున్నాను అంటాడు కార్తీక్. కానీ.. వాళ్లు వినరు. చెబుతుంటే మీకు అర్థం కావడం లేదా.. మీరు అసలు మనుషులేనా అని చెప్పి వాళ్లను కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. దీంతో కార్తీక్ ను పట్టుకోవడానికి అతడి సైకిల్ వెంట పరిగెడతారు రుద్రాణి మనుషులు.
karthika deepam 31 january 2022 episode highlights
వీళ్లు ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటుంది రుద్రాణి. చెప్పిన పని ఎప్పుడూ టైమ్ కు చేయరు. ఎక్కడ చచ్చారో ఏమో అని ఫోన్ చేస్తుంది. కానీ.. పిల్లిగడ్డం ఫోన్ తీయడు. మరోవైపు డాడీ ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది శౌర్య. వచ్చేస్తాడు అమ్మా అంటుంది దీప. అమ్మ.. మనం నానమ్మ, తాతయ్యకు ఫోన్ చేద్దాం. వాళ్లు వచ్చి రౌడీని ఆసుపత్రికి తీసుకెళ్తారు అంటుంది హిమ. భగవంతుడా మాకు ఏంటి ఈ శిక్ష అని అనుకుంటుంది దీప. శౌర్యకు స్పృహ పోతూ ఉంటుంది. కళ్లు తెరువు శౌర్య అంటుంది హిమ. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు అని అనుకుంటుంది దీప. అన్నీ ఉన్నా ఏం లేనివాళ్లలా అయిపోయాం.. అని అనుకుంటుంది. అమ్మ శౌర్యకు ఏం కాదు కదా అంటుంది హిమ.
ఇంతలో కార్తీక్.. హోటల్ కు వెళ్తాడు. అప్పు ఉన్నాడా అంటాడు. లేడు అంటాడు. ఓనర్ గారు ఉన్నారా అంటాడు. ఓనర్ కూడా లేడు అంటాడు. అప్పు రావడానికి ఎంత టైమ్ పడుతుంది అని అడుగుతాడు. పక్కూర్లో సంత జరుగుతోంది కదా.. రావడానికి లేట్ అవుతుంది అంటాడు పని వ్యక్తి.
మరోవైపు రుద్రాణి మనుషులు హోటల్ కు వస్తారు. అక్క నిన్ను తీసుకురమ్మన్నది.. అంటారు. కార్తీక్ నాకు పని ఉంద. నేను ఇప్పుడు రాను అన్నా కూడా వినరు. దీంతో మళ్లీ వాళ్లను కొడుతాడు. మీరు మా వెంట వచ్చేదాకా మీ వెంట పడుతూనే ఉంటాం అంటారు. దీంతో సరే.. ఆ రుద్రాణికి ఏం కావాలో తేల్చుకుంటాను పదండి అని రుద్రాణి దగ్గరికి వెళ్తాడు కార్తీక్.
డబ్బులు కట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్లు అంటుంది రుద్రాణి. నా కూతురుకు ఒంట్లో బాగాలేదు అంటే.. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. నేను డబ్బులు ఇస్తా అని సంతకం పెట్టాను కదా అంటాడు కార్తీక్. అయినా కూడా రుద్రాణి వినదు. డబ్బులు కట్టి ఇక్కడి నుంచి కాలు బయటపెట్టండి అంటుంది రుద్రాణి.
దీంతో కార్తీక్ వినడు. నేను వెళ్తున్నా. నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి వెళ్లబోతుండగా ఒక్క నిమిషం అని అంటుంది రుద్రాణి. 5 లక్షలు తెచ్చి ఇస్తుంది. తీసుకో.. నీ కూతురుకు ఆరోగ్యం బాగాలేదు అంటున్నావు కదా. తనకు ట్రీట్ మెంట్ చేయించుకో అంటుంది. నాకు డబ్బులు అవసరం లేదు అంటాడు కార్తీక్.
వెంటనే ఇంటికి వెళ్లి శౌర్యను ఆసుపత్రికి తీసుకెళ్తారు. కానీ.. ఆసుపత్రిలో శౌర్యను చేర్చుకోరు. అప్పుడే అక్కడికి రుద్రాణి వస్తుంది. నేను చెప్పేదాకా.. వాళ్లు ఆసుపత్రిలో జాయిన్ చేసుకోరు అంటుంది. పాత బాకీ మొత్తం రద్దు చేస్తాను. శౌర్య ట్రీట్ మెంట్ కోసం కూడా డబ్బులు ఇస్తాను.. ఈ డబ్బు కూడా నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. బదులుగా నాకు ఈ బంగారు తల్లిని ఇవ్వండి చాలు.. అని హిమను చూపిస్తుంది.
దీంతో రుద్రాణిపై దీప కోప్పడుతుంది. ఇది హాస్పిటల్ కాబట్టి కోపాన్ని అదుపు చేసుకుంటున్నాను అంటుంది దీప. జరగరానిది ఏదైనా జరిగితే జీవితాంతం మీరు బాధపడుతూ కూర్చోవాల్సి ఉంటుంది అంటుంది రుద్రాణి. ఆ తర్వాత రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
శౌర్యకు ఎలాగైనా ట్రీట్ మెంట్ చేయించాలని అనుకున్న హిమ.. రుద్రాణి ఇంటికి వెళ్తుంది. రుద్రాణిని కలిసి.. నేను ఇక్కడే ఉంటాను. మీతోనే ఉంటాను. దయచేసి శౌర్యకు ట్రీట్ మెంట్ చేయించండి అని వేడుకుంటుంది. దీంతో రుద్రాణి చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.