Karthika Deepam 4 Oct Today Episode : కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 4 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1161 హైలైట్స్ ఏంటో చూద్దాం. ఇప్పటికైనా పిల్లలకు నిజం చెప్పేయండి అని ఆదిత్య.. సౌందర్యతో అంటాడు. ఇంతలో కార్తీక్ వస్తాడు. మమ్మీ.. పిల్లలు ఎక్కడ అని అడుగుతాడు. దీంతో ఎక్కడో ఉంటారు లేరా.. పిల్లల గురించి నీకెందుకు. ముందు ఆసుపత్రికి వెళ్లు అంటుంది సౌందర్య.
మోనితతో మాట్లాడిన అనంతరం వారణాసితో కలిసి కారులో బయలుదేరుతుంది దీప. కారు తోలుతూ.. మోనిత ఏమన్నది అక్క. మోనిత ఏం చెప్పింది. ఏమన్నా అయితే ఎలా.. పిల్లాడు పుట్టాక డైరెక్ట్ గా ఇంటికే పంపిస్తే ఎలా.. అప్పుడు ఏం చేస్తావు అక్క.. అంటూ మోనిత గురించి అడుగుతాడు వారణాసి. ఇవన్నీ నేను అంటున్నవి కాదు అక్కా.. సరోజక్క చెప్పింది.. అంటాడు. వారణాసి.. ముందుకు చూసి డ్రైవ్ చేయి. నువ్వు కానీ.. సరోజ అక్క కానీ.. బస్తీలో మోనిత గురించి.. డాక్టర్ బాబు గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది.. అని చెప్పి వారణాసికి వార్నింగ్ ఇస్తుంది దీప.
కట్ చేస్తే.. జైలులో తన గదిలో నిలబడి తెగ ఆలోచిస్తుంటుంది మోనిత. ఇంతలో సుకన్య అక్కడికి వచ్చి మేడం.. ఏం ఆలోచిస్తున్నారు అంటుంది. మీరు బాధపడుతున్నారేమో అంటుంది. నేనెందుకు బాధపడతాను. నా కార్తీక్ ప్రేమ నాతో ఉండగా నేనెందుకు బాధపడతా అంటుంది మోనిత. కార్తీక్ సారు నిజంగా అదృష్టవంతుడు మేడమ్ అంటుంది. ఇందాక వచ్చింది ఎవరు మేడమ్.. మీ అక్కా అని అడుగుతుంది. అవును.. నాకు దేవుడు ఇచ్చిన అక్క అంటుంది. ఆవిడ సహనంలో భూదేవి, నేను ప్రేమలో ఆకాశం.. ఆవిడ ఒక టైప్ లే అని చెబుతుంది. సుకన్య.. ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి.. పంపించవా అని అడుగుతుంది మోనిత. వెళ్లబోతూ.. ఆ వచ్చినావడ భర్తే ఆ కార్తీక్ కదా మేడమ్ అని అడుగుతుంది సుకన్య. నేను ప్రేమించిన కార్తీక్ భార్య ఆమె.. నేను ప్రేమించిన తర్వాత తనకు భర్త అయ్యాడు.. అంటుంది మోనిత. తనకు అర్థం కాలేదు అన్నట్టుగా చూస్తుంది సుకన్య. అర్థం కాలేదా.. సరే నువ్వు కూడా మరో స్ట్రాంగ్ కాఫీ తెచ్చుకో.. అప్పుడు అర్థం అవుతుంది అని చెబుతుంది మోనిత.
ఇంట్లో ఉండి శౌర్య తెగ ఆలోచిస్తుంటుంది. ఆ పేపర్ గురించే ఆలోచిస్తుంది. హిమ బాగా ఏడ్చింది. తను చాలా ఫీల్ అవుతుంది పాపం. అస్సలు మాట్లాడటం లేదు. అదే ఆలోచిస్తోంది. మొన్న షైనీ అన్న మాటలు.. ఇప్పుడు ఈ పేపర్.. వీటితో హిమ బాగా డిస్టర్బ్ అయింది.. నాకు ఉన్న ధైర్యం తనకు లేదు.. తనకు ఊరికే జ్వరం వస్తుంది అని అనుకుంటుండగానే అప్పుడే దీప అక్కడికి వస్తుంది. అత్తమ్మ.. ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు అంటుంది. హిమ ఎక్కడుంది అంటుంది.. ఇంట్లో ఉంది.. హిమకు మళ్లీ జ్వరం వస్తుందేమో అంటుంది. అస్సలు మాట్లాడటం లేదు.. అంటుంది శౌర్య.
ఏమైందో చెప్పు. ఎందుకు మీరు అలిగారు.. అంటుంది. దీంతో లోపలికి రా అమ్మా అని లోపలికి దీపను తీసుకొని వస్తుంది. హిమ దగ్గరకు రా అమ్మా.. తను బాధపడుతోంది అనగానే.. నేను వస్తానులే నువ్వు వెళ్లు అంటుంది. ఎక్కడికెళ్లావు దీప అని అడుగుతుంది సౌందర్య. బయటికి వెళ్లాను అత్తయ్య.. బేరం కుదరలేదు అంటుంది. ఏదైనా నువ్వు బాగానే బేరం ఆడతావు కదా.. అనగానే అన్నిసార్లు అన్ని విషయాల్లో బేరాలు, సెటిల్ మెంట్స్ కుదరవు అత్తయ్య అంటుంది.
అసలు ఎక్కడికి వెళ్లావు నువ్వు.. అని అడుగుతాడు కార్తీక్. దీంతో ప్రశాంతమైన జీవితాన్ని బేరం ఆడుదామని మోనిత దగ్గరకి వెళ్లాను.. అంటుంది. పిచ్చా నీకు.. నువ్వు మోనిత దగ్గరికి ఎందుకు వెళ్లావు అని ప్రశ్నిస్తాడు కార్తీక్. నెమ్మదిగా మాట్లాడండి.. పిల్లలు వింటారు.. అంటుంది దీప.
అసలు.. నువ్వు మోనిత దగ్గరికి ఎందుకు వెళ్లావు చెప్పు అంటాడు కార్తీక్. ఆ మోనిత గురించి పేపర్ లో ఆర్టికల్ ను చూశారు కదా.. ఆ పేపర్ లో రేపు కూడా వేస్తారని చెప్పారు కదా.. మళ్లీ పేపర్ లో వేస్తే ఏమౌతుందో అని ఇవన్నీ ఆపేయమని చెప్పేందుకు వెళ్లాను అంటుంది దీప.
అసలు ఏమైంది నీకు.. ఏం చేస్తున్నావు నువ్వు.. ఎందుకు ఇలా చేస్తున్నావు.. అని కార్తీక్.. దీప మీద సీరియస్ అవుతాడు. నీకు నువ్వు సమర్థించుకుంటున్నావా? అసలు.. అక్కడికి వెళ్లి నువ్వు ఒరగబెట్టింది ఏంటి.. అని కార్తీక్ అంటాడు.
మనం చూసిన న్యూస్ పేపర్ కనిపించడం లేదు డాక్టర్ బాబు అంటుంది దీప. వాట్.. అని షాక్ అవుతాడు కార్తీక్. దాన్ని వెంటనే కాల్చేయకపోయావా? అని అనగానే తీసుకెళ్లగానే శౌర్య వచ్చింది. అందుకే బెడ్ కింద దాచి వెళ్లాను. తర్వాత పేపర్ కోసం వెళ్లే సరికి పేపర్ కనిపించలేదు. పిల్లలు ఏమైనా తీసి ఉంటారా? అని అడుగుతుంది సౌందర్య. పిల్లలు ఎందుకు తీసి ఉంటారు.. ఒకవేళ వాళ్లు తీస్తే ఇప్పటికే మనల్ని నిలదీసి ఉండాలి.. అంటాడు కార్తీక్. అందుకే.. నేను మోనిత దగ్గరికి వెళ్లాను. ఇకనైనా ఈ పేపర్ వ్యవహారం బయటికి రాకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
కట్ చేస్తే.. సుకన్య.. మోనిత జైలు గది వైపు చూస్తుంది. పడుకుందేమో తర్వాత వద్దాం అని అనుకుంటుంది. ఇంతలో సుకన్య అని పిలుస్తుంది. నేను వచ్చినట్టు ఎలా కనిపెట్టారు మేడమ్ అంటుంది. నీ జుట్టుకు రాసుకున్న ఆయిల్ వాసనతో గుర్తు పట్టా కానీ.. నువ్వు నాకు ఒక ముఖ్యమైన పని చేయాలి.. అని చెబుతుంది.
ఇంట్లో తన రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఉన్న హిమ దగ్గరికి వెళ్లి.. ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా.. అని అడుగుతుంది. అమ్మ.. డాడీ మంచోడే కదా.. అని అడుగుతుంది. డాడీ మంచోడే అమ్మ అని దీప చెబుతుంది. మరి డాడీకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని అడుగుతుంది. మంచివాళ్లకే ఎక్కవ కష్టాలు వస్తాయి అంటారు అంటుంది దీప. అలా ఎలా వస్తాయి అమ్మా.. అందరితో బాగుండాలి.. అందరికీ మంచి చేయాలి.. అని డాడీ అంటాడు. ఇన్ని మంచి చేసేవాళ్లకు కష్టాలు వస్తే ఎలా అమ్మా.. మాట్లాడవేంటమ్మా అని అడుగుతుంది హిమ.
కొన్ని రోజులే మంచి వాళ్లకు కష్టాలు వస్తాయి.. తర్వాత వాళ్లకు అంతా మంచే జరుగుతుంది అని చెబుతుంది దీప. మరి మోనిత ఆంటీకి కష్టాలు వచ్చాయి కదా.. మోనిత ఆంటీ మంచిదా.. చెడ్డదా.. అని అడగ్గానే.. హిమ.. ఇప్పుడు మోనిత ఆంటీ గురించి ఎందుకు చెప్పు. నువ్వు ఇంకా మీ స్కూల్ లో షైనీ చెప్పిన మాటలు మరిచిపోలేదా అని అడుగుతుంది. జైలులో ఉన్నవాళ్లు మంచివాళ్లా.. బయట ఉన్నవాళ్లు చెడ్డవాళ్లా.. అని అడుగుతుంది. నా మాట విను.. ఏవేవో ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. నువ్వు మాట్లాడకపోయినా.. డల్ గా ఉన్నా మీ డాడీ బాధపడతారు కదా అమ్మా.. అనగానే నేను బాధపడేది కూడా డాడీ కోసమే కదమ్మా అంటుంది.
అమ్మా.. డాడీ గురించి నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కదా అంటుంది హిమ. నేను డాడీ దగ్గరే పెరిగాను కదా. డాడీ గురించి ఆలోచించకు అంటే ఎలా చెప్పు. ఆలోచిస్తాను.. అని చెబుతుంది హిమ. దీంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.