Karthika Deepam 6 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ రుద్రాణి ఏంటి అమ్మా.. చాలా ఎక్కువ చేస్తోంది. తను ఎందుకు మాకు లంచ్ తీసుకొస్తోంది. తనకు ఏం అవసరం అంటూ దీపను అడుగుతారు పిల్లలు. తన గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి.. అని చెప్పి దీప వాళ్లకు భోజనం తినిపిస్తుంది. మరోవైపు అందరి ఆనందాలను నేను దూరం చేశాను. అందరికీ దూరమై నేను ఏం సాధించాను. దీపను, పిల్లలను కష్టపెడుతున్నాను. దానికి తోడు ఆ రుద్రాణితో వైరం.. ఇదంతా ఏంటి.. ఇక్కడికి వచ్చి నేను సాధించింది ఏంటి అని తెగ బాధపడుతుంటాడు కార్తీక్. ఏంటండి.. ఏం ఆలోచిస్తున్నారు అని దీప వస్తుంది.
ఏమండి.. మీ చేతుల్లో ఉన్న వైద్యం ఆ పసివాడిని బాగు చేసింది. మీ బలం ఏంటో.. మీ గొప్పతనం ఏంటో మీకు తెలియడం లేదు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. నేను ఉన్నాను కదా అంటుంది దీప. రుద్రాణి అప్పు గురించి టెన్షన్ పడుతున్నారా అని అడుగుతుంది దీప. అప్పు మాత్రమే కాదు.. మన బిడ్డలలో ఒకరిని తీసుకెళ్తా అని అగ్రిమెంట్ లో రాయించుకుంది. ఈ విషయం నీకు నేను ఎలా చెప్పాలి దీప అని అని అనుకుంటాడు కార్తీక్. అసలు.. రుద్రాణి ఎందుకు అప్పు తీరుస్తా అన్నా కూడా ఎందుకు ఇలా చేస్తోంది. పిల్లల మీద ఉన్నట్టుండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది.. నా దగ్గర మీరు ఏదైనా విషయం దాస్తున్నారా అని అడుగుతుంది దీప. నిజం చెప్పండి.. నా మీద ఒట్టే అని తన తల మీద చేయి పెట్టించుకొని ఏం దాస్తున్నారు.. ఎందుకు నలిగిపోతున్నారో చెప్పండి డాక్టర్ బాబు. లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అంటుంది దీప.
రుద్రాణి పిల్లల్లో ఒకరిని తీసుకెళ్లిపోతా అన్నది.. అని చెబుతాడు కార్తీక్. ఏంటి.. అంటుంది దీప. అవును దీప.. గడువులోగా ఒప్పుకున్న బాకీ సొమ్ము చెల్లించకపోతే.. శౌర్య, హిమల్లో ఒకరిని తీసుకెళ్లిపోతా అంటోంది.. అని అసలు నిజం చెబుతాడు కార్తీక్. దీంతో దీపకు తల తిరుగుతుంది. అలా ఎలా ఒప్పుకున్నారు మీరు అంటూ వెక్కివెక్కి ఏడుస్తుంది.
మాట కోసం బిడ్డను ఇచ్చేస్తారా? నా బతుకు ఇంతేనా. ఎప్పుడూ బిడ్డలను దూరం చేసుకొని బతకాలా. ఏంటి డాక్టర్ బాబు మీరు. ఎందుకు ఇలా చేశారు అని అంటుంది. ఏంటి డాక్టర్ బాబు.. మీరు సంతకం పెడితే తను తీసుకెళ్లిపోతుందా? నా బిడ్డను తను ఎలా తీసుకుపోతుంది. అంతా మీ ఇష్టమేనా.. నాది ఏం లేదా.. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి.. అంటుంది దీప.
దేవుడా ఏంటిది నాకీ పరీక్ష. నామీద నీకు ఇంకా కోపం పోలేదా. నా బిడ్డ హిమ కోసం పిచ్చిదానిలా తిరిగాను. తిరా కనిపించాక.. నీ కన్నతల్లిని నేనేనమ్మా అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో తెలుసా? పడరాని మాటలు పడ్డాను.. వినరాని నిందలు విన్నాను.. అంటుంది దీప.
అందరం కలిశాం.. అంతా బాగుంది అని అనుకుంటుండగానే దిక్కులేని వాళ్లలా.. బయటికి వచ్చేశాం. మీరు ఆస్తి ఇచ్చేసినా నేను ఒక్క మాట అనలేదు. కానీ.. నా బిడ్డల విషయంలో ఇలా చేస్తున్నారేంటి. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారేంటి డాక్టర్ బాబు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది దీప. భగవంతుడా.. నాకు ఎందుకు ఈ శిక్ష. ఎంత పని చేశారు డాక్టర్ బాబు అని అనుకుంటుంది దీప.
మరోవైపు రుద్రాణి.. తన పనోడిని నువ్వు ఏదో డబ్బులు అడిగావు కదరా అంటుంది. అవును అక్క అంటాడు. దీంతో ఒక పదివేలు ఇవ్వు పిల్లి గడ్డం అంటుంది. డబ్బులు తీసుకోవడమే కాదురా.. చెప్పిన పని కూడా సరిగ్గా చేయడం నేర్చుకోండి అని అంటుండగానే కార్తీక్ అక్కడికి వస్తాడు.
మీరు చేస్తుంది కరెక్ట్ కాదు రుద్రాణి గారు అంటాడు కార్తీక్. పెత్తనం చేయడం తప్పా సారు.. అంటుంది. దీంతో మీరు పెత్తనం చేస్తారో.. ఇంకేం చేస్తారో నాకు తెలియదు. నా పిల్లల జోలికి రాకూడదు.. అని అంటాడు. మీ బాకీ తీరుస్తా అన్నాను కదా.. మీ బాకీ తీరుస్తాను. అంతకుమించి మా పిల్లల జోలికి మాత్రం రాకూడదు.. అంటాడు.
మీరు అప్పు తీర్చడం కుదరదు. తీర్చలేరు. అందుకే.. ఇప్పటి నుంచే పిల్లలను మచ్చిక చేసుకుంటున్నాను. ఇందులో నాకు ఏమీ చెడు ఉద్దేశంలేదు. మా పిల్లల గురించి ఆలోచించడం మానేయండి. ఇది నేను మంచి కోరి చెబుతున్నాను. మీ బాకీ తీరుస్తాను.. ఏం చేసి తీరుస్తానని మీకు అవసరం లేదు. పిల్లల మీద కన్నేస్తే మాత్రం ఊరుకోను.. అంటాడు కార్తీక్.
అరిస్తే అప్పులు తీరుతాయా.. వెళ్లు సారు వెళ్లు.. జరిగేదేదో.. నా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది అని అనుకుంటుంది. ఇంటికి వచ్చి మంచినీళ్లు తాగుతాడు కార్తీక్. ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది దీప. అప్పు తీర్చకపోతే అమ్మాయిని తీసుకెళ్తా అంటుందా? కానీ మనం ఆవేశపడకూడదు. ఆలోచించండి.. అంటుంది దీప.
మీరు మాటి మాటికి ఆ రుద్రాణిని వెళ్లి కలుస్తుంటే తను ఇంకా రెచ్చిపోతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల మీద కన్నేసింది. ఇలాంటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. అవసరానికి మంచి ఆవేశపడకండి. ఎలాగైనా ఆ అప్పు తీర్చేద్దాం. బాధపడకండి.. అంటుంది దీప.
మీరు అవునన్నా కాదన్నా ఎప్పటికీ మీరు నా డాక్టర్ బాబే. బయటికి ఎలా పిలిచినా మనసు మాత్రం మిమ్మల్ని డాక్టర్ బాబు అనే పిలుస్తుంది.. అంటుంది దీప. మరోవైపు బాబును వెనుక వేసుకొని.. పిండి వంటలు అమ్మేందుకు షాపులలో తిరుగుతూ ఉంటుంది దీప. కానీ.. ఎవ్వరూ తన పిండి వంటలు కొనరు. అప్పటికే రుద్రాణి దగ్గర్నుంచి కొన్నాం అని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.