
shanmukh gives clarity about break up
Shanmukh : తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు అయిదు సీజన్ లు పూర్తి చేసుకుంది. ఈ అయిదు సీజన్ ల్లో మొదటి నాలుగు సీజన్ లకు ఎలాంటి విమర్శలు రాలేదు.. అయితే అయిదవ సీజన్ కు మాత్రం రెండు జంటలను విడదీసిన విమర్శలు మాత్రం తప్పలేదు. షన్నూ మరియు దీప్తి సునైనలు అందరికి తెలిసిన సుపరిచిత ప్రేమ జంట.. ఇద్దరు కూడా కాబోయే భార్య భర్త అనే విషయం అందరికి తెల్సిందే. టీవీ షోల్లో వారిద్దరు కూడా జంటగానే వెళ్లారు.. ఒకానొక సమయంలో సహజీవనం సాగిస్తున్నట్లుగా కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇక సిరి మరియు శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు సహజీవనం సాగిస్తున్నారు.
ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. వారికి ఒక దత్త బాబు కూడా ఉన్నాడు. ఈ రెండు జంటలు సంతోషంగా హాయిగా తమ రిలేషన్ లో ఉండగా బిగ్ బాస్ అనూహ్యంగా వారి జీవితంలో మార్పు తీసుకు వచ్చింది. బిగ్ బాస్ అవకాశం తో సిరి మరియు షన్నూ లు లోనికి వెళ్లారు.. బయట ఉన్న వారి తోడు ఓట్లు అడుగుతూ వారి కోసం కష్టపడ్డారు. లోపల సిరి మరియు షన్నూ లు ఎంత అడ్వాన్స్ అయినా.. వారిద్దరు ఎంతగా క్లోజ్ అయ్యి ముద్దులు పెట్టుకుని ఒకే బెడ్ షేర్ చేసుకుని హగ్ చేసుకున్నా కూడా బయట ఉన్న దీప్తి మరియు శ్రీహాన్ లు వాళ్లను అర్థం చేసుకుని వాళ్ల తరపున ఓట్లు అడిగారు. వారి పై వచ్చే విమర్శలకు సమాధానాలు ఇచ్చారు. నేను నమ్ముతున్నాను అన్నట్లుగా ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా అనిపించారు.
siri and Shanmukh in leaving relation in biggboss house only they planed
సరే లోపల ఎలా ఉన్నా బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఎవరి జీవితం వారిదే అని అనుకున్నారు. కాని వారు హౌస్ లోనే కలిసి సహజీవనం సాగిద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నట్లుగా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ తన బ్లాగ్ లో ఇదే విషయాన్ని రాశాడు. సిరి ముందుగానే ప్లాన్ చేసింది.. వైజాగ్ లో షన్నూ తో ఆమె సహజీవనం సాగిస్తుంది అంటూ ఆయన రాశాడు. షన్నూ బయటకు వచ్చిన తర్వాత దీప్తి ని కలిసేందుకు ప్రయత్నించలేదు.. అలాగే సిరి కూడా శ్రీహాన్ ను దూరం పెట్టే ప్రయత్నం చేసింది. షన్నూ పై కోపంతో మొదట దీప్తి బ్రేకప్ చెప్పింది. ఆసమయంలో సిరి మరియు శ్రీహాన్ అయినా బాగుంటారు అనుకుంటూ ఉండగా వారిద్దరి మద్య కూడా సరిగా లేదు అని తేలిపోవడంతో కొందరు అనుకున్నదే అయ్యింది.
వారిద్దరి మద్య ప్రేమ కొనసాగుతుంది.. ఆ కొత్త ప్రేమ పాత ప్రేమను డామినేట్ చేసింది. అందుకే పాత వారికి దూరం అయ్యారు.. వారితోనే బ్రేకప్ చెప్పించారు. దీప్తి సునైన ఇప్పటికే బ్రేకప్ చెప్పింది. ఇక శ్రీహాన్ ఇన్ స్టా లో సిరి ఫొటోలను డిలీట్ చేశాడు కనుక అతడు కూడా బ్రేకప్ చెప్పినట్లే అంటూ క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లోనే వీరిద్దరు కూడా బయట సహజీవనం సాగించాలనే నిర్ణయానికి వచ్చారని.. ఇప్పుడు అదే ప్లాన్ ను అమలు చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. సిరి మరియు షన్నూ లు కలిసి రిలేషన్ మొదలు పెడితే నెటిజన్స్ వారిని ఏ స్థాయిలో ఏకి పారేస్తారో అనేది ఇప్పుడు అంశం. అందుకే ఇప్పుడే బయట పడకుండా వీరిద్దరు ఈ హడావుడి అయ్యాకే బయట పడే అవకాశం ఉందని టాక్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.