Karthika Deepam 6 Sep Monday Episode Highlights : ఆదిత్యకు లాయర్ ఏమని చెప్పాడు? కార్తీక్ కు బెయిల్ వస్తుందని చెప్పాడా? ఆదిత్య ఎందుకు లాయర్ గురించి దీప ముందు మాట్లాడలేదు?
Karthika Deepam 6 Sep Monday Episode Highlights : కార్తీక దీపం సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. అయితే.. సోమవారం, 6 సెప్టెంబర్ 2021 ఎపిసోడ్ 1137 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. మోనిత.. అన్నంత పని చేసేసింది. కార్తీక్ ను పెళ్లి చేసుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తానని చెప్పిన మోనిత.. ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించింది. ఆదిత్యకు యాక్సెడెంట్ చేయించి.. అదే విషయాన్ని కార్తీక్ కు ఫోన్ చేసి చెబుతుంది మోనిత.
తనను పెళ్లి చేసుకోకపోతే.. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తానంటూ బెదిరించేసరికి.. ఏం చేయాలో కార్తీక్ కు అర్థం కాదు. తనను పోలీసులకు పట్టిద్దామని అనుకున్నా.. తను ఫ్యామిలీని ఏం చేస్తుందోనని కార్తీక్ వెనుకడగు వేస్తున్నాడు. అందుకే.. తనలో తానే మాట్లాడుకోవడం.. ఎప్పుడూ ఆ మోనిత గురించే ఆలోచిస్తుండటంతో.. కార్తీక్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడని అనుకుంటున్నారు తన కుటుంబ సభ్యులు.
Karthika Deepam 6 Sep Monday Episode Highlights : అప్పుడు దీప చెబితే ఎవ్వరూ నమ్మలేదు
నిజానికి.. మోనితను సోది చెప్పే ఆవిడ రూపంలో దీప ఎప్పుడో చూసింది. ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పినా నమ్మలేదు. చివరకు కార్తీక్ కు చెప్పినా నమ్మలేదు. తనే స్వయంగా చూశాక కానీ.. అప్పుడు నమ్మాడు కార్తీక్. తనకు టీ ఇచ్చే మూగ అమ్మాయిగా వచ్చింది మోనితే అని.. తన చేయి స్పర్శ చూసి కనిపెట్టాడు కార్తీక్. ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చి డాక్టర్ గా వేషం వేసుకొని తను కార్తీక్ కు ట్రీట్ మెంట్ చేస్తుంది.
కార్తీక్ కు కడుపునొప్పి వచ్చేలా ప్లాన్ చేసి.. చాయ్ లో కడుపు నొప్పి ట్యాబ్లెట్ కలిపి కార్తీక్ కు ఇవ్వడంతో.. ఆరోజు సాయంత్రం కాగానే.. కార్తీక్ కు కడుపునొప్పి లేస్తుంది. దీంతో కార్తీక్ ను రత్నసీత.. ఆసుపత్రికి తరలిస్తుంది. అక్కడ డాక్టర్ అవతారం ఎత్తిన మోనిత.. కార్తీక్ దగ్గరికి వెళ్లి.. తనను బెడ్ కు కట్టేసి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరిస్తుంది.
Karthika Deepam 6 Sep Monday Episode Highlights : ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించిన మోనిత
తనను పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పింది మోనిత. దీంతో మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవుతాడు కార్తీక్. కార్తీక్ కు తన కన్నా కూడా తన ఫ్యామిలీ అంటేనే ఇష్టం. దాన్నే అలుసుగా తీసుకుంది మోనిత. అయితే.. మోనిత ఊరికే.. బెదిరిస్తోందని కార్తీక్ అనుకున్నాడు కానీ.. ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించేసరికి.. కార్తీక్ భయం ఇంకా పెరిగింది.
డాక్టర్ బాబుతో దీప ఉన్నప్పుడే.. దీపకు పిల్లలు ఫోన్ చేసి.. బాబాయ్ కి యాక్సిడెంట్ అయిందని చెబుతారు. దీంతో దీప హుటాహుటిన ఇంటికి వెళ్తుంది.
Karthika Deepam 6 Sep Monday Episode Highlights : ఇక నుంచి ప్రాణాలు పోతాయని చెప్పిన మోనిత
అయితే.. అంతకుముందే డాక్టర్ బాబుకు మోనిత ఫోన్ చేసి.. ఆదిత్యకు యాక్సిడెంట్ అయిందని.. ఇక నుంచి గాయాలు చేయడం కాదు.. ఏకంగా ప్రాణాలే పోతాయని చెప్పుకొచ్చింది మోనిత. దీంతో మరింత ఆందోళనకు గురవుతాడు కార్తీక్.
వెంటనే ఇంటికి వెళ్లి ఆదిత్యను పలకరిస్తుంది దీప. అయితే.. ఆదిత్య వెళ్లే రోడ్డును బ్లాక్ చేసి.. వేరే రోడ్డు ద్వారా వెళ్లేలా చేసి రోడ్డుకు అడ్డంగా తీగ కట్టి.. ఆదిత్య బైక్ కిందపడేలా చేపిస్తుంది మోనిత. దీంతో ఆదిత్య కిందపడిపోతాడు. ఆయనకు హెల్మెట్ ఉండటం వల్ల పెద్దగా దెబ్బలు తాకవు కానీ.. ఆయన చేతికి, కాళ్లకు కొన్ని గాయాలు అవుతాయి.
చేతికి కట్టుకట్టించుకొని ఆదిత్య.. ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే.. అందరూ షాక్ అవుతారు. శ్రావ్య అయితే గుక్కపెట్టి ఏడుస్తుంది. దీప చూసి.. ఏంటి ఆదిత్య ఇది.. అని అడుగుతుంది. ఏం కాలేదు వదినా.. మీరు టెన్షన్ పడకండి.. అంటాడు ఆదిత్య. చిన్న దెబ్బలే అంటాడు.
Karthika Deepam 6 Sep Monday Episode Highlights : లాయర్ ఏమన్నాడు.. అని ప్రశ్నించిన ఆనంద రావు
అదంతా ఓకే కానీ.. అసలు.. ఏం జరిగింది.. నువ్వు లాయర్ దగ్గరికి వెళ్లిన విషయం ఏమైంది అని అడుగుతాడు ఆనంద రావు. దీంతో ఆదిత్య.. ఇప్పుడెందుకు నాన్న… దాని గురించి తర్వాత మాట్లాడుతానులే అని అంటాడు. అంటే.. లాయర్ దగ్గర మాట్లాడినప్పుడు ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అలాగే.. అక్కడ పిల్లలు కూడా ఉండటంతో.. ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని ఆదిత్య.. ఆ టాపిక్ ను డైవర్ట్ చేస్తాడు.
అసలు.. ఆదిత్య లాయర్ దగ్గరికి వెళ్లి ఏం మాట్లాడాడు. లాయర్ ఆదిత్యకు ఏం చెప్పాడు? కార్తీక్ కు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.