Karthika Deepam 7 July Today Episode : హిమపై పట్టరాని కోపంతో జ్వాల షాకింగ్ నిర్ణయం.. ఊరొదిలి వెళ్లిపోతుందా? సౌందర్య ఏం చేస్తుంది?

Karthika Deepam 7 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జులై 2022, గురువారం ఎపిసోడ్ 1398 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాల ఏం చేసుకుంటుందో అని వెంటనే తన ఇంటికి వెళ్తారు సౌందర్య, ఆనందరావు, హిమ. ఇంటి ముందు చూడగానే ఆటో బోల్తా పడి ఉంటుంది. వదిలేదేలే అనే బోర్డు ముక్కలు ముక్కలు అయి ఉంటుంది. ఏం జరిగిందో ఏమో.. లోపలికి వెళ్దాం పదా అంటాడు ఆనంద రావు. లోపలికి వెళ్లగానే ఎవరు మీరు అని అడుగుతుంది జ్వాల. నా ఆటో బాగోలేదు.. నా మనసు బాగోలేదు. సవారీలు ఏం చేయను.. వెళ్లండి అంటుంది జ్వాల. దీంతో అందరూ షాక్ అవుతారు. తను బ్యాగ్ సర్దుకుంటుంది. మేము ఆటో కోసం రాలేదు అంటుంది. దీంతో మరి దేనికోసం వచ్చారు. నా పేరు జ్వాల.. ఆటో జ్వాల. ఇక్కడంతా అందరు అందే అంటారు. మీరు వెళ్లొచ్చు అంటుంది జ్వాల. దీంతో ఎందుకు శౌర్య ఇలా గుండె కోత కోస్తున్నావు అని అంటుంది సౌందర్య. దీంతో ఎంత గొప్ప మాట అన్నారే మీరు. గుండె కోతా అది గుండె ఉన్నవాళ్లకు కదా. మీకెలా వర్తిస్తుంది. నాకు తెలుసు. గుండె కోత అంటే ఏంటో అంటుంది జ్వాల.

karthika deepam 7 july 2022 full episode

మీరంతా ఏంటి.. కూడబలుక్కొని ప్లాన్ చేసుకొని నా దగ్గరికి వచ్చారా? ఇంకేం మిగిలింది. అంతా మటాష్. అందుకే బట్టలు సర్దుకుంటున్నా అంటుంది జ్వాల. ఊరెళ్తున్నావా.. అని అడుగుతుంది సౌందర్య. మోసాలు, కుట్రలు లేకుండా మనుషులు ఎక్కడైనా ఉన్నారేమో వెతికి అక్కడికి వెళ్తాను. నవ్వుతూ గొంతు కోసే నంగనాచి లాంటి మనుషులు లేని చోటకు వెళ్తాను అంటుంది జ్వాల. మేమంతా ఇక్కడ ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడుగుతుంది సౌందర్య. దీంతో మీరు ఇక్కడ ఉన్నారనే వెళ్తున్నాను అంటుంది జ్వాల. ఈ తాతయ్య అంటే నీకు ఇష్టం కదా. మిమ్మల్ని వదిలేసి వెళ్లింది.. దూరం అయింది చాలదా.. మళ్లీ వెళ్తావా అని అడుగుతాడు ఆనంద రావు.

తాతయ్య, నానమ్మ అనడానికి ఎంత బాగుందో కదా ఈ బంధాలు అంటుంది జ్వాల. మరి నేను లంచ్ బాక్స్ లు ఆటోలో తెస్తుంటే నన్ను చూశారు.. గుర్తు పట్టారు.. కానీ మీకు అప్పుడు ఏం బాధ కలగలేదా. ఈవిడ గారు ఆటోలో కూర్చొంటారు.. డబ్బులు ఇస్తుంటారు. చమత్కారాలు చేస్తుంటారు కానీ.. మనవరాలిని గుర్తుపట్టరు అంటుంది జ్వాల.

Karthika Deepam 7 July Today Episode : సౌందర్య, ఆనంద రావు, హిమను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పిన శౌర్య

ఇంతలో హిమ మాట్లాడబోగా.. నువ్వు మాట్లాడకు.. అంటుంది జ్వాల. మీతో నాకు మాటలు ఏంటి. నేను వెళ్తున్నాను తప్పుకోండి అంటుంది జ్వాల. వద్దు వెళ్లకు అంటుంది సౌందర్య. దీంతో ఎందుకు.. మీ మనవరాలి పెళ్లి ఉంది కదా. దానికి నాకు, నా ఆటోకు పని ఇస్తావా. వచ్చి పోయే చుట్టాలను అటూ ఇటూ ఆటోలో తిప్పాలా అంటుంది జ్వాల.

వంటలన్నీ ఆటోలో ఫంక్షన్ హాల్ కు, విడిది ఇంటికి చేర్చాలా? అందరూ కలిసి నన్ను పనిదానిలాగానే చూశారు అంటుంది జ్వాల. దీంతో మేము పనిదానిలా చూడటం ఏంటి అంటుంది సౌందర్య. చూడలేదా.. అలాంటప్పుడు ఆటో తోలుకుంటోంది.. అని తెలిసి కూడా శౌర్య అని అప్పుడే పిలిచి ఉంటే ఎంత సంతోషించేదాన్ని అంటుంది జ్వాల.

మిమ్మల్ని అంటున్నావు కదా.. అదే పని నువ్వెందుకు చేయలేదు అంటుంది సౌందర్య. కదా.. నేను ఒకటి అడిగితే సమాధానం చెప్పలేక నన్నే తిరిగి అడుగుతున్నావా? సరే చెబుతాను విను.. నేను పిలవకపోవడానికి కారణం హిమ అని చెబుతుంది.

మిమ్మల్ని నానమ్మ, తాతయ్య అని పిలిస్తే మీరు తట్టుకోలేరు. నేనూ తట్టుకోలేను. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఇంటికి రావాలి. ఇంటికి వస్తే దీన్ని చూడాలి. దీన్ని చూస్తే నాకు కోపం ఆగదు అని అంటుంది జ్వాల. ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది జ్వాల.

అంత కోపం అంటుంది జ్వాల. సరే.. దాని మీద కోపం మామీద ఎందుకు చూపించావు అంటుంది సౌందర్య. ఆహా.. మీరేం చేయలేదా అంటుంది జ్వాల. మీకేం తెలియదు అంటున్నారా? నాకోసం ఇన్నేళ్లలో ఎన్నిరోజులు వెతికారు అని అడుగుతుంది జ్వాల.

ఏ ప్రయత్నాలు చేశారు.. చేయలేదు కదా అంటుంది జ్వాల. ఇన్నేళ్లు లేని ప్రేమ.. సడెన్ గా ఒక్కసారి పొంగి పొర్లినట్టు మొన్నటికి మొన్న ఏదో బొమ్మలు గీయించడాలు చేశావు. నేను వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే అక్కడికి వచ్చారు.. అంటుంది జ్వాల.

నువ్వు సిమ్ పారేస్తే మేము ఏం చేయాలి అంటుంది సౌందర్య. దీంతో ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యమే కదా. మీకు ప్రేమ లేదు అంటుంది జ్వాల. మీ మనవరాలికేమో నా మీద ప్రేమ కదా. నేను కోరుకున్న డాక్టర్ సాబ్ ను తను పెళ్లి చేసుకుంటోంది అంటుంది జ్వాల.

శౌర్య.. నేను పెళ్లి చూసుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ అంటుంది హిమ. దీంతో అది ఉత్తుత్తి పెళ్లి అంటావా అంటుంది జ్వాల. నీకు అసలు విషయం తెలియదు అంటుంది హిమ. ఊరుకో.. ఈరోజుతో నేను మీకు కనిపించను అంటుంది జ్వాల.

అందరూ హాయిగా ఉండండి అని చెబుతుంది జ్వాల. చల్లగా ఉండండి అంటుంది. దీంతో ఇంటికి వెళ్దాం పదా. అన్నీ వివరంగా చెబుతా అంటుంది సౌందర్య. దీంతో అది మీ ఇల్లు. నాది కాదు. నా వాళ్లు అక్కడ ఎవరూ లేరు అంటుంది జ్వాల. ఈ రమ్మనేది ఏదో ముందుగానే రమ్మంటే ఆలోచించేదాన్నేమో అంటుంది జ్వాల.

ప్లీజ్ శౌర్య అని ఎంత బతిమిలాడినా అస్సలు ఉండను అంటుంది జ్వాల. నువ్వు వెళ్తే మీ అమ్మానాన్న ఆత్మలు ఘోషిస్తాయి అంటుంది సౌందర్య. దీంతో సరే నేను ఇక్కడే ఉంటాను కానీ.. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది జ్వాల. చచ్చిపోయిన అమ్మానాన్నల ఆత్మను అడ్డుపెట్టుకొని ఆపుతున్నారు. వెళ్లండి. మీకు, నాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంది జ్వాల.

ఇంతలో జ్వాల పిన్ని, బాబాయి వస్తారు. జ్వాల ఏమైంది అని అడుగుతారు. ఆటో పడి ఉండటం చూసి షాక్ అవుతారు. ఏమైంది.. ఎవరైనా వచ్చారా. గొడవ ఏమైనా జరిగిందా అని అడుగుతారు. తన పిన్ని, బాబాయిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

47 minutes ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

2 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

11 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

12 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

13 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

15 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

16 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

17 hours ago