Karthika Deepam 9 Sep Today Episode : దీపను పట్టుకొని గన్ గురి పెట్టిన మోనిత.. నువ్వు చస్తేనే నీ మొగుడు నాకు తాళి కడతాడు.. అంటూ దీపను మోనిత?

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
Karthika Deepam 9 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ గురువారం తాజాగా విడుదలైంది. 1140 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. ఎలాగైనా మోనితను పట్టుకోవడం కోసం ఛేజ్ చేస్తూ వెళ్తుంది దీప. దీప ఎక్కడికెళ్లిందో తెలియక కార్తీక్ టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో బయటికి వస్తాడు. దీప కోసం వెతుకుతుంటాడు. దీంతో అక్కడే ఉన్న ఎస్ఐ ఆగండి.. బయటికి ఎందుకు వస్తున్నారు.. అని అడుగుతాడు. దీంతో దీప కనిపించడం లేదు.. నాకు భోజనం పెట్టి ప్లేట్స్ కడగడానికి బయటికి వచ్చింది. అప్పటి నుంచి కనిపించడం లేదు.. బయటికి వెళ్లి చూసి వస్తాను.. అని అడుగుతాడు కార్తీక్. అలా వెళ్లడం కుదరదు అని తెగేసి చెబుతారు పోలీసులు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు కార్తీక్ కు.

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
మోనిత మేడం దీపకు దొరికిపోయి ఉంటుందా అని అనుకుంటుంది రత్నసీత. ఇంతలోనే మోనిత.. రత్నసీతకు ఫోన్ చేస్తుంది. ఎవరూ లేని చోటుకు వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది. కార్తీక్ ను కోర్టుకు తీసుకెళ్తున్నారా? అని అడగడంతో లేదు మేడమ్ అని చెబుతుంది. దీప ఎక్కడుంది అని అడుగుతుంది రత్నసీత. దీంతో ఈరోజు దీప చావు నా చేతుల్లో ఉంది అని చెబుతుంది మోనిత. దీప.. కారులో మోనితను ఛేజ్ చేస్తుంటుంది. ఈరోజు మోనితను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటుంది దీప.
Karthika Deepam 9 Sep Today Episode : దీప కోసం వెతికిన కార్తీక్
కట్ చేస్తే.. మరోసారి కార్తీక్ బయటికి వెళ్లడం కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ.. ఎస్ఐ నాయుడు తనను అస్సలు వెళ్లనీయడు. మీరు ఖైదీ. మిమ్మల్ని అలా ఎలా పంపిస్తాం అని అంటాడు.

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
కట్ చేస్తే అప్పుడే ఏసీపీ హాస్పిటల్ కు వస్తుంది. కార్తీక్ ను తీసుకొని కోర్టుకు వెళ్లేందుకు రోషిణి సన్నాహాలు చేస్తుండగా… మేడమ్ దీప కనిపించడం లేదు. మోనిత ఏం చేసిందో అనగానే.. మోనిత చచ్చిపోయింది అని అంటుంది రోషిణి.

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
డాక్టర్ రీనా ప్లేస్ లో వచ్చింది మోనితే. అక్కడ చాయ్ ఇచ్చింది మోనితే. తను బతికే ఉంది. నన్ను బెదిరిస్తోంది.. అంటూ అసలు నిజాలు రోషిణికి చెబుతాడు కార్తీక్. అయినప్పటికీ కార్తీక్ చెప్పిన మాటలు రోషిణి వినదు. డాక్టర్ రీనా వేషంలో మోనిత వచ్చింది.. అనడానికి సాక్ష్యం ఉందా? అని అడుగుతుంది రోషిణి. నా భార్య దీప సాక్ష్యం.. దానికి అని చెబుతాడు కార్తీక్. మరి ఒక్క ఫోటో అయినా తీశారా.. వీడియో తీశారా.. అని అడిగితే.. లేదు ఏం లేదు.. కానీ.. మోనిత బతికి ఉంది అని చెబుతాడు కార్తీక్.
Karthika Deepam 9 Sep Today Episode : దీప బతికే ఉందని రోషిణికి చెప్పిన కార్తీక్

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
మోనిత నన్ను బెదిరించింది. నా తల్లిదండ్రులను, దీపను, పిల్లలను కూడా చంపేస్తానంటూ బెదిరించింది.. అని చెబుతాడు కార్తీక్. మరి నువ్వు ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు.. అని ప్రశ్నిస్తుంది రోషిణి. మోనితను పట్టుకోవడానికి దీప వెళ్లి ఉంటుంది. నాకు ఏ శిక్ష వేసినా పర్లేదు కానీ.. నా భార్య నాకు కావాలి. మీకు దండం పెడుతాను మేడమ్. దీపను వెతికించండి. దీప ఎక్కడుంటుందో అక్కడ మోనిత కూడా ఉంటుంది.. అని చెబుతాడు కార్తీక్.

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
దీప మీద నాకు చాలా గౌరవం ఉంది కానీ.. నాకు ఇప్పుడు డ్యూటీనే ముఖ్యం. నిన్ను కోర్టులో సరెండర్ చేయడం నా బాధ్యత.. కోర్టు పని అయిపోయాక.. దీపను వెతికిస్తా.. అని చెబుతుంది. కానీ.. అంతలోపు దీపను మోనిత చంపేస్తుంది.. అని చెప్పినా వినకుండా కార్తీక్ ను కోర్టుకు తీసుకెళ్తారు పోలీసులు.
Karthika Deepam 9 Sep Today Episode : కారు దిగిన మోనిత

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
కట్ చేస్తే.. మోనిత కారు దిగుతుంది. నేను వేరే క్యాబ్ లో వెళ్తాను.. అని చెప్పి క్యాబ్ ను పంపిస్తుంది. మరోవైపు చూస్తే దీప కారులో పెట్రోల్ అయిపోతుంది. దీంతో వారణాసి పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తాడు. ఇంతలో పోలీస్ కారులో కార్తీక్ ను తీసుకెళ్తారు పోలీసులు. డాక్టర్ బాబును కారులో చూసి.. డాక్టర్ బాబు.. అని చెప్పినా ఆయనకు వినపడదు. ఇంతలోనే మోనిత వెళ్తున్న రోడ్డు మీద కార్తీక్ ను తీసుకెళ్తున్న పోలీసుల కార్లు వెళ్తుంటాయి. మోనిత కూడా ఆ కార్లను చూస్తుంది. వెళ్లిపోతున్నావా కార్తీక్.. అని అనుకుంటుంది మోనిత. నన్ను నమ్మి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.. అని అనుకుంటుంది మోనిత.

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
కొంచెం ముందుకెళ్లి చూడగానే.. అక్కడ వంటలక్క కనిపిస్తుంది మోనితకు. ఒంటరిగానే ఉంది కదా.. ఎవ్వరూ లేరు కదా. ఇక్కడ దీపను చంపేద్దాం.. అని అనుకుంటుంది మోనిత.
Karthika Deepam 9 Sep Today Episode : నా గుండె దడగా ఉందంటూ కార్తీక్ తో కోర్టులో చెప్పిన ఆనంద రావు

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
ఇంతలోనే కార్తీక్ ను కోర్టుకు తీసుకొస్తారు. పదండి.. లోపలికి వెళ్దాం అంటుంది రోషిణి. కోర్టుకు అప్పటికే ఆనందరావు, సౌందర్య, ఆదిత్య.. ముగ్గురూ వస్తారు. ఒరేయ్ పెద్దోడా.. ఇందాకటి నుంచి నా గుండెలో దడ పెరుగుతోందిరా అని అంటాడు ఆనంద రావు. నువ్వే చెక్ చేయ్ రా అంటాడు ఆనంద రావు. కార్తీక్ చెక్ చేసి ఏం కాదు.. అని చెబుతాడు. నేను హాస్పిటల్ లో అడ్మిట్ కాను అని చెబుతాడు ఆనంద రావు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి.. ఆదిత్య మొబైల్ లో ట్యాబ్లెట్స్ రాసి ఇస్తాడు కార్తీక్.

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
మమ్మీ.. దీప మోనితను పట్టుకోవడానికి వెళ్లలింది.. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటాడు కార్తీక్. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. దీప మోనితను పట్టుకోవడానికి వెళ్లడం ఏంటి.. అని సౌందర్య ఆశ్చర్యపోతుంది.

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
కట్ చేస్తే.. కోర్టులో కార్తీక్ కేసు వాదన జరుగుతుంటుంది. మీరు ఈ నేరాన్ని చేసినట్టు అంగీకరిస్తున్నారా? అని జడ్జి.. కార్తీక్ ను అడుగుతాడు. దీంతో లేదు యువర్ ఆనర్.. నేను ఈ నేరం చేయలేదు అంటాడు. కట్ చేస్తే దీప దగ్గరికి వెళ్లి దీప తలకు గన్ గురి పెడుతుంది మోనిత. కారు ఎక్కు అంటుంది మోనిత.

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights
ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నావు.. అని అడుగుతుంది దీప. నీ మొగుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.. అంటుంది మోనిత. నువ్వు చస్తే నాకు ఏ అడ్డూ ఉండదు. నువ్వు చచ్చిపో.. మీ ఆయనను నాకు ఇచ్చిపో.. అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

karthika deepam 9 september 2021 thursday episode 1140 highlights