Karthika Deepam : కార్తీక దీపం మెల్ల మెల్లగా గాడిలో పడుతన్నట్లేనా?
Karthika Deepam ; తెలుగు టీవీ సీరియల్ చరిత్రలో కార్తీక దీపంకు అరుదైన ఘనత దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో భారీ కార్యక్రమాలకు మరియు షో లకు దక్కని రేటింగ్ కార్తీక దీపం సీరియల్ కు దక్కింది. డాక్టర్ బాబు మరియు దీపల గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలుసు. ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి ఇంట్లో డాక్టర్ బాబు మరియు దీపల గురించి చర్చ జరిగేది.దీప యొక్క కష్టాలను గురించి చర్చించుకుంటూ కన్నీరు పెట్టుకున్న మహిళ లోకం గురించి మనం చూశాం.
ఎంతో మంది ఎన్నో రకాలుగా కార్తీక దీపం గురించిన చర్చ జరిపే వారు. సోషల్ మీడియాలో కూడా కార్తీక దీపం గురించిన హడావుడి ఓ రేంజ్ లో ఉండేది. అలాంటి కార్తీక దీపం కథను మరీ పొడిగించడం సాధ్యం కాకపోవడంతో డాక్టర్ బాబు దీపలను కలిపేశారు.తెలుగు సీరియల్స్ లో అలా ఇద్దరు కలిసి పోయి సాఫీగా సాగిపోతే ఎలా.. అందుకే వారిద్దరిని చంపేశారు. సీరియల్ ను ఇంకా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో వారిద్దరిని చంపేసి వారి పిల్లల మద్య వైరం కలిగేలా ప్లాన్ చేశారు.

Karthika deepam again getting good rating
డాక్టర్ బాబు మరియు దీపల పిల్లలు పెరిగి పెద్ద వారు అయ్యారు. ఒకరు డాక్టర్ అయితే మరొకరు ఆటో డ్రైవర్ అయ్యారు. వారిద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే మండే రేంజ్ లో గొడవలు నడుస్తున్నాయి. జనరేషన్ మారిన తర్వాత సీరియల్ కాస్త డౌన్ అయ్యింది. కాని మళ్లీ పుంజుకుంది. మునుపటి రేంజ్ లో కాకున్నా మళ్లీ మంచి రేటింగ్ వస్తుంది. కార్తీక దీపం గాడిలో పడింది అంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.