Karthika Deepam : డాక్టర్ బాబు ఇంటి విశేషాలు.. ఎంట్రీలోనే టచ్ చేసేశాడు!!
Karthika Deepam కార్తీకదీపం Karthika Deepam డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాలకు ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నిరుపమ్ తన భార్య మంజుల ఇద్దరూ కలిసి నెట్టింట్లో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మంజుల నిరుపమ్ అంటూ ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ చానెల్‌ను కూడా ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే లక్ష మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకున్నారు. రకరకాల వీడియోలతో నిరుపమ్, మంజుల తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

karthika deepam manjula nirupam home tour video viralkarthika deepam manjula nirupam home tour video viral
నిరుపమ్ హోం టూర్.. Karthika Deepam
తన శ్రీమతికి కారును బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన వీడియో, ముంబై టూరుకు సంబంధించిన వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. ఇక నిరుపమ్ మంజుల చేస్తోన్న వీడియోలు అన్నీ కూడా దాదాపు మిలియన్ మార్క్‌ను పూర్తి చేసేస్తున్నాయి. యూట్యూబ్ చానెల్ అంటే చాలు కచ్చితంగా హోం టూర్ పెట్టాల్సిందే. ఇళ్లు ఎలా ఉంది? ఇంట్లో ఎక్కడెక్కడ ఏ ఏ సామాన్లు ఉంటాయి.. ఎలాంటి సౌకర్యాలున్నాయి.. అనే వాటిని చూపించాల్సిందే.
అలా మంజుల కూడా తమ ఇంటి టూర్ వీడియోను పెట్టేసింది. ఇంటి డోర్ మీద ఓం అనే గుర్తును పెట్టారు. ఓం అంటే శభారంభానికి సూచిక అని, అంతే కాకుండా నిరుపమ్ తండ్రి గారి పేరు కూడా ఓంకార్. ఆయనకు గుర్తుగా ఓం అనే సింబల్‌ను కూడా వేశామని చెప్పుకొచ్చారు. అలా నాన్నకు ప్రేమతో అంటూ ఇంట్లో చాలా వరకు నిరుపమ్ అలానే డిజైన్ చేసి పెట్టారు. నిరుపమ్ తన తండ్రి ఫోటోను, ఆయనుకు వచ్చిన అవార్డులు, బహుమతులను జాగ్రత్తగా పెట్టేశాడు.
