Karthika Deepam Monitha : రూట్ మార్చిన కార్తీక దీపం మోనిత.. కుర్రాళ్లకు కిక్కిచ్చేలా శోభా ఫోటో షూట్లు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: September 20, 2022, 6:32 pm

Karthika Deepam Monitha : కార్తీక దీపం సీరియల్‌తో మోనితగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది ఈ కన్నడ సుందరి. శాండిల్ వుడ్ బ్యూటీ అయిన శోభా శెట్టి.. తెలుగు వారికి మాత్రం మోనితగానే పరిచయం. కార్తీక దీపం సీరియల్లో మోనితగా అనితర సాధ్యమైన పర్ఫామెన్స్, విలనిజంతో అందరినీ భయపెట్టేసింది. మోనిత పాత్ర మీద అందరికీ ద్వేషం కలిగించే రేంజులో నటించేసి మెప్పించింది. అలా మోనితగా శోభా శెట్టికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే కన్నడలో మాత్రం శోభా శెట్టికి పలు సీరియళ్ల ఆఫర్లు వచ్చాయి.

ఇక్కడ ఫేమస్ అయిన దేవత సీరియల్, రుక్కు పాత్రను కన్నడలో శోభా శెట్టి వేసింది.అయితే కొన్ని రోజులకే ఆ సీరియల్ నుంచి శోభా తప్పుకుంది. మళ్లీ తెలుగు సీరియల్స్ మీదే ఆమె ఫోకస్ పెట్టేసింది. కార్తీక దీపం సీరియల్ నుంచి అకస్మాత్తుగా ఈ పాత్రలను తప్పించేసిన సంగతి తెలిసిందే. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలు లేకపోవడంతో సీరియల్ రేటింగ్స్ పడిపోయాయి. దీంతో మళ్లీ పాత కథనే పట్టుకొచ్చారు. ఫ్లాష్ బ్యాక్ అంటూ ఈ మూడు పాత్రలను దింపేశారు.

Karthika Deepam Monitha Latest Photoshoot

Karthika Deepam Monitha Latest Photoshoot

ఇప్పుడు మోనిత, డాక్టర్ బాబు, వంటలక్కల చుట్టూ ఈ సీరియల్ తిరుగుతోంది. దీంతో మోనిత మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో మోనిత కాస్త సోషల్ మీడియాలోనూ డోసు పెంచేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. కార్తీక దీపం సీరియల్ కోసం వాడే క్యాస్టూమ్స్‌తో మోనిత ఎఫ్పుడూ ఫోటో షూట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె తన అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ నెట్టింట్లో నెటిజన్లలో కాకపుట్టించేస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp