Karthika Deepam Nirupam : పల్లకిలో పెళ్లి కూతురు.. డాక్టర్ బాబు కొత్త ప్రయోగం వర్కవుట్ అయ్యేనా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 12 September 2022, 9:30 pm

Karthika Deepam Nirupam : బుల్లితెరపై నిరుపమ్ పరిటాల సంపాదించుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్, డాక్టర్ బాబుగా నిరుపమ్ తెచ్చుకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నిరుపమ్ పరిటాల తన భార్యతో కలిసి నటించడం లేదు. దానికి చాలానే కారణాలున్నాయి. ఈ ఇద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్‌లో నటించారు. ఈ సీరియల్‌తోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహాం వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సీరియల్స్‌లో నటించడం లేదు. దీనిపై మంజుల ఆమద్య స్పందించింది.

తామిద్దరం కలిసి నటించడం కుదరదని, తనకు ఇప్పుడు ఎవ్వరూ కూడా హీరోయిన్ పాత్రలు ఇవ్వరని, తన పక్కన అలా నటించలేనని, తనకు అక్కా, వదిన ఇలాంటి పాత్రలు ఇస్తుంటారని అందుకే తామిద్దరం కలిసి నటించలేమని చెప్పేసింది. అయితే ఇప్పుడు నిరుపమ్ కొత్త సీరియల్లో మంజుల కూడా నటించేస్తోంది. అసలే నటుడిగానే కాకుండా నిరుపమ్ సీరియల్స్ కూడా నిర్మిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. తన తండ్రి పేరు ఓంకార్ వచ్చేట్టుగా ఓం ఎంటర్టైన్మెంట్స్ మీద సీరియల్స్ నిర్మిస్తుంటాడు. ఇది వరకు హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌లో నిరుపమ్ నటించాడు.

Karthika Deepam Nirupam New Serial Pallakilo Pellikuthuru

Karthika Deepam Nirupam New Serial Pallakilo Pellikuthuru

నిర్మించాడు. జీ తెలుగులో వచ్చిన ఈ సీరియల్ తక్కువ కాలంలోనే ఎక్కువగా ఫేమస్ అయింది. నిరుపమ్‌కు కొత్త ఇమేజ్ తెచ్చి పెట్టేసింది. అయితే తక్కువ రోజులే ఈ సీరియల్ రావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ఇంకో సీరియల్ గురించి ఎప్పుడూ నిరుపమ్‌ను అడుగుతుంటారు. అయితే తాజాగా తాను నిర్మిస్తోన్న కొత్త సీరియల్ గురించి అప్డేడ్ ఇచ్చాడు. పల్లికలో పెళ్లికూతురు అనే కొత్త సీరియల్ రాబోతోందని, అది స్టార్ మాలో వస్తోందని చెప్పుకొచ్చింది. ఇందులో మంజుల కూడా ఓ పాత్రలో కనిపించబోతోన్నట్టుంది. కానీ నిరుపమ్ నటిస్తాడా? లేదా? అన్నది తెలియడం లేదు. మరి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి