Karthika Deepam : త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతా.. నిరుపమ్ పరిటాల వీడియో వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 19, 2021, 7:15 pm

Karthika Deepam కార్తీకదీపం సీరియల్‌తో నిరుపమ్ పరిటాల తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా నిరుపమ్‌ను నిలబెట్టింది ఈ సీరియల్. బుల్లితెరపై శోభన్ బాబుగా మారిపోయాడీ డాక్టర్ బాబు. కార్తీక్, డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ నటనకు అందరూఫిదా అవుతుంటాయి. అలా నిరుపమ్ ఇప్పుడు బుల్లితెరపై తిరుగులేని ఆదరణతో దూసుకుపోతోన్నాడు.

Karthika Deepam Nirupam About Youtube Channel

Karthika Deepam Nirupam About Youtube Channel

త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతా.. నిరుపమ్ పరిటాల Karthika Deepam

అలాంటి నిరుపమ్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఆయన వేసే కౌంటర్లు, పంచ్‌లు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. కొటేషన్లలో ప్రాసలతో అందరినీ మెప్పిస్తాడు. ఇకపై నిరుపమ్ తనలోని ఇంకో కొత్త యాంగిల్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నట్టున్నారు. తాజాగా నిరుపమ్ లైవ్‌లోకి వచ్చారు. మొన్న తన బర్త్ డే సందర్బంగా విషెస్ చెప్పిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పేందుకు నిన్న లైవ్‌లోకి వచ్చాడు.

Karthika Deepam

Karthika Deepam

సీరియల్స్‌లో చూసి చూసి బోర్ వచ్చి ఉంటుంది.. అందరూ యూట్యూబ్ చానెల్ ప్రారంభించమని అడుగుతున్నారు.. దానిపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటా. మీరు కూడా నన్ను స్క్రీన్ మీద చూసి బోర్ అయి ఉంటారు.. యూట్యూబ్ ద్వారా మీతో మరింత ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే చాన్స్ ఉంటుందని నిరుపమ్ చెప్పుకొచ్చాడు. అంటే త్వరలోనే డాక్టర్ బాబు కొత్త యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించబోతోన్నాడన్న మాట.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp