karthika deepam : డాక్టర్ బాబు మద్దతు అతనికే.. బిగ్ బాస్‌ను ఫాలో అవుతున్న నిరుపమ్
karthika deepam కార్తీకదీపం డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటాడో అందరికీ తెలిసిందే. కార్తీకదీపం, హిట్లర్ గారి పెళ్లాం అంటూ తన సీరియల్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తుంటాడు. తన మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్ మీద స్పందిస్తుంటాడు. అయితే నిరుపమ్ ఓ వైపు షూటింగ్, మరో వైపు డబ్బింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంటాడు.

karthika deepam nirupam paritala supports vishwa in bigg boss 5 telugu
అలాంటి నిరుపమ్‌కు బిగ్ బాస్ షో చూసేంత టైం ఉంటుందా? అని అందరూ అనుకోవచ్చు. అయితే నిరుపమ్ మాత్రం బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ వారం అసలే తన స్నేహితుడు నామినేషన్‌లోకి వచ్చినట్టున్నాడు. అందుకే అతడిని సేవ్ చేసుకునేందుకు నిరుపమ్ రంగంలోకి దిగాడు. విశ్వ కోసం నిరుపమ్ ముందుకు వచ్చాడు.
karthika deepam విశ్వకు అండగా నిరుపమ్..

karthika deepam nirupam paritala supports vishwa in bigg boss 5 telugu
విశ్వకు ఓట్లు వేసి గెలిపించండి.. ఆయన్ను సేవ్ చేయండి అంటూ నిరుపమ్ తన ఇన్ స్టాగ్రాంలో స్టోరిని పోస్ట్ చేశాడు. అంటే నిరుపమ్ రెగ్యులర్‌గా బిగ్ బాస్ ఆటను గమనిస్తున్నాడన్న మాట. మొత్తానికి విశ్వ సేవ్ అవుతూనే వస్తున్నాడు. చాలా కష్టపడి బిగ్ బాస్ ఇంట్లో ఆరో వారం కెప్టెన్‌గా విశ్వ ఎన్నికయ్యాడు. ఇప్పటికే కెప్టెన్ అయిన విశ్వ.. రెండో సారి బాధ్యతలను చేపట్టాడు.