Kasthuri : సొట్ట బుగ్గల సుందరి.. జబర్దస్త్‌లో ‘కస్తూరీ’ సీరియల్ నటి

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 30, 2021, 6:30 am

Kasthuri బుల్లితెరపై తారలంతా కూడా ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంటున్నారు. కేవలం సీరియల్స్ మాత్రమే చేసుకోకుండా స్పెషల్ షోలు, ఈవెంట్లు అంటూ ఫుల్లుగా సంపాదించుకుంటున్నారు. జనాల్లో క్రేజ్‌ను కూడా పెంచుకుంటున్నారు. అలా సీరియల్ నుంచి జబర్దస్త్ వంటి షోలకు వచ్చిన ఎంతో మంది సీరియల్ నటీమణులు బాగానే క్రేజ్ తెచ్చుకున్నారు.

Kasthuri Serial Shabena In Kevvu Karthika Team

Kasthuri Serial Shabena In Kevvu Karthika Team

అందులో వర్ష కూడా ఒకరు. వర్ష ఎప్పటి నుంచో సీరియల్స్‌లో నటిస్తూ వచ్చింది. కానీ జబర్దస్త్ ద్వారానే ఇంతగా ఫేమస్ అయింది. అలా ఇప్పుడు మరో తార జబర్దస్త్ వేదికపై మెరిసేందుకు సిద్దమైనట్టు కనిపిస్తోంది. కస్తూరి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. కస్తూరీ సీరియల్‌లో మధు ప్రకాష్ కూతురు ప్రవళిక పాత్రలో షబీనా అనే అమ్మాయి నటిస్తోంది.

సొట్ట బుగ్గల సుందరి.. జబర్దస్త్‌లో ‘కస్తూరీ’ సీరియల్ నటి Kasthuri

Kasthuri Serial Shabena In Kevvu Karthika Team

Kasthuri Serial Shabena In Kevvu Karthika Team

 

చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆమె ఇప్పుడు జబర్దస్త్ వేదిక మీద రచ్చ చేస్తోంది. ఆమెను కెవ్వు కార్తీక్ తన టీంలోకి తెచ్చుకున్నట్టున్నాడు. గత వారంలో ఆమెతో చేసిన స్కిట్ బాగానే వర్కవుట్ అయింది. అయితే అందరూ ఆ ఒక్క వారం కోసం ఆమెను తెచ్చుకున్నాడని అనుకుని ఉండొచ్చు.కానీ ఈ వారం కూడా ఆమె వచ్చింది. షబీనా అందానికి జనాలు ఫిదా అవుతున్నారు.

Kasthuri Serial Shabena In Kevvu Karthika Team

Kasthuri Serial Shabena In Kevvu Karthika Team

ఆమె సొట్ట బుగ్గలపై కెవ్వు కార్తీక్ మంచి లైన్ రాసుకున్నాడు.. డైలాగ్ కొట్టేశాడు. దీంతో నెటిజన్లు అందరూ కూడా ఆమెకు సొట్ట బుగ్గల సుందరి అని పేరు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో వారి స్కిట్ కింద ఉన్న కామెంట్లు అన్నీ కూడా షబీనా గురించే. అంతలా ఆమె అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి మరో బ్యూటీ జబర్దస్త్ షోకు దొరికినట్టే. ఆమెకు కూడా మంచి పాపులారిటీ దక్కినట్టే.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp