kaushal comments about his career
Kaushal: కౌశల్ .. ఈ పేరు బిగ్ బాస్ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచి సక్సెస్ అయిన కౌశల్ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం అతడు.. ఆమె.. ప్రియుడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత యండమూరి వీరెంద్రనాథ్ దర్శకత్వం వహించారు. అయితే కౌశల్ ఒక్కోసారి సంచలన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటారు. తన క్రేజ్‌కి తగ్గ రెమ్యునరేషన్ నిర్మాతలు ఇవ్వలేకపోతున్నారని అందుకే సినిమాల్లో నటించడం లేదని చెప్పిన కౌశల్.. ఈసారి అంతకు మించే అనేట్టుగా కీలక వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్‌కి రాకముందు దాదాపు 86 చిత్రాల్లో నటించాడు కౌశల్. అయితే తనకు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదని అన్నాడు.
అయితే డైరెక్టర్, ప్రొడ్యుసర్స్ దగ్గరకు వెళ్లి.. నాకు సినిమా ఛాన్స్ ఇవ్వండి అడగను. నాకు ఎవరైనా ఫోన్ చేసి.. సినిమా ఉందంటే వెళ్లి చేస్తా.. అంతేకాని వేషం ఇవ్వమని అడుక్కోను. కొంతమంది అడుక్కునేవాళ్లు ఉంటారు.. నాది ఆ స్టైల్ కాదు. నా టాలెంట్ చూసి ఛాన్స్ ఇవ్వాలి. సొంతంగా నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది. ప్రతిరోజు షూట్ ఉంటుంది.. ఫ్యాషన్ షోస్ ఉంటాయి.. యాడ్స్ ఉంటాయి.. నేను మల్టీటాలెంట్.. ఎప్పుడూ ఖాళీగా ఉండను.. ఏదోటి చేస్తూనే ఉంటాను. ఎప్పుడూ బిజీగా ఉంటాను అని చెప్పుకొచ్చాడు.నాటకరంగం నుంచి మా నాన్న సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారో నేను చూశాను. అందుకే నాకంటూ కొన్ని డోర్లు ఓపెన్ చేసి పెట్టుకున్నారు..
kaushal comments about his career
ఎవరో డోర్లు తెరుస్తారని ఎదురుచూడను. మా అమ్మకి క్యాన్సర్ అప్పుడు ఫైనాన్సియల్‌గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. హాస్పటల్‌లో డబ్బులు కోసమే అప్పట్లో నేను ఒక సినిమాకి కమిట్ అయ్యాను. ఆ సినిమాకి రూ.50 వేలు రెమ్యునరేషన్ అన్నారని వెంటనే ఒప్పుకున్నాను. అయితే ఆ సినిమా వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది. అది అడల్ట్ మూవీ కావడంతో.. కౌశల్ అడల్ట్ మూవీస్ చేస్తాడనే పేరు వచ్చేసింది. ఆ స్ట్రగుల్ నుంచి బయటపడటానికి చాలా టైం పట్టింది. చక్రవాకం సీరియల్ చేసిన తరువాత నాపై ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోయింది’’ అంటూ చెప్పుకొచ్చాడు కౌశల్.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.