Sridevi Drama Company : స్టార్ మా జోడిలను వాడేస్తోన్న మల్లెమాల.. స్టేజ్ మీద రొమాన్స్‌తో రెచ్చిపోతోన్నారుగా

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 17 July 2022, 10:00 am

Sridevi Drama Company : స్టార్ మా చానెల్‌లో గోరింటాకు సీరియల్‌తో కావ్య, అర్జున్ ఫేమస్ అయ్యారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ ప్రేమికులేనని అంతా అనుకుంటున్నారు. ఆ లైన్‌ను మల్లెమాల పట్టేసుకుంది. ఈ జోడిని తమ ఈవెంట్లలో తెగ వాడేస్తోంది. కానీ స్టార్ మా చానెల్ ద్వారా ఫేమస్ అయినా కూడా.. అక్కడి టీం మాత్రం ఉపయోగించుకోలేకపోతోంది. ఇక మరో జోడిని సైతం మల్లె మాల వాడేస్తోంది. దేవత సీరియల్‌తో అంబటి అర్జున్, సుహాసిని జంట అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీదేవీ డ్రామా కంపెనీ టీం రెచ్చిపోయింది.

స్టేజ్ మీదే శోభనం గదిలా అరేంజ్ చేశారు. గోరింటాకు జోడి దుమ్ములేపేసింది. అదిరిపోయే హాట్ రొమాన్స్‌తో రెచ్చిపోయింది. అయితే అలానే శ్రీదేవీ డ్రామా కంపెనీ జోడిలు పర్ఫామెన్స్ చేయాలని మిగతా వారు కోరారు. దీంతో హైపర్ ఆది రెచ్చిపోయాడు. అయితే శోభనం మంచం మీద ఎక్కడంతో గుద్దులతో గుద్దిపడేసింది. ఇక ఫైమా పటాస్ ప్రవీణ్‌‌ల ట్రాక్ ఇంకో రకంగా మారింది. దారా అంటూ ప్రేమగా పిలిచింది ఫైమా. ఇక జబర్దస్త్ ప్రవీణ్, ఫైమా జోడి మరింతగా నవ్వించేసింది. అలా మొత్తానికి ఈ స్టార్ మా జోడిల సందడితో శ్రీదేవీ డ్రామా కంపెనీ అదిరిపోతోంది.

Kayva Arjun Suhasini Ambati Arjun In Sridevi Drama Company

Kayva Arjun Suhasini Ambati Arjun In Sridevi Drama Company

ఈ జోడిలనే స్టార్ మా యూనిట్ వాడుకున్నా కూడా ఇలాంటి పర్ఫామెన్స్‌లు పెట్టించదు. అలా అందుకే ఈ జోడిలను మల్లెమాల ఇలా వాడేసుకుంటోంది. దాదాపుగా స్పెషల్ ఈవెంట్లలో కచ్చితంగా వీళ్లందరినీ మల్లెమాల తీసుకొస్తుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో అందరినీ తీసేసుకుంటారు. పండుగ ఈవెంట్లను కూడా ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనే యాడ్ చేసేశారు. ఇది వరకు పండుగలకు స్పెషల్ఈవెంట్లు చేసేవారు. కానీ ఇప్పుడు అంతా కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీలోనే కలిపేశారు. అందుకే శ్రీదేవీ డ్రామా కంపెనీ కాలెండర్ అంటూ ఈ ఏడాది ఏ ఏ స్పెషల్ ఈవెంట్లు చేయబోతోన్నారో ముందే చూపించేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp