Keerthi Suresh : అబ్బా .. కీర్తీ సురేష్ ఎంత క్యూట్ గా ఉందో.. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

Authored By mallesh | The Telugu News | Published on: May 18, 2022, 1:30 pm

Keerthi Suresh : నేనూ శైల‌జా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కీర్తీ సురేష్..ఈ పేరు మ‌హాన‌టి సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో కీర్తి న‌ట‌న‌కు గాను ఉత్తమ తెలుగు న‌టిగా అవార్డు అందుకుంది. కాగా రీసెంట్ గా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో స‌ర్కారు వారి పాట మూవీలో న‌టించి అద‌ర‌గొట్టింది. నేనూ శైల‌జా త‌ర్వాత‌ నానీతో నెను లోక‌ల్ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో అజ్ఞాత‌వాసి సినిమాలో న‌టించి మెప్పించింది. అలాగే నితిన్ తో రంగ్ దే.. అలాగే మిస్ ఇండియా.. పెంగ్విన్, వంటి చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది.

కీర్తి మొద‌ట‌గా మలయాళం సినిమా గీతాంజ‌లి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించారు. అందుకే ఎక్కువ‌గా తమిళ, తెలుగు సినిమాల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కీర్తీ మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె. ప‌లు సినిమాల్లో బాలనటిగా కూడా న‌టించింది. సినిమాల్లోకి రాక‌ముందు కీర్తీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. లండన్ లో ఫ్యాషన్ డిజైనింగ్ పై ఇంట్రెన్స్ షిప్ కూడా చేసింది.

Keerthi Suresh Cute Pics Viral

Keerthi Suresh Cute Pics Viral

కాగా మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తీ సురేష్ ప‌లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.కాగా ఆ సినిమాలు పెద్దాగా ఆడ‌లేదు. ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట హిట్ తో జోష్ లో ఉంది. సోష‌ల్ మీడియాలో కూడా కీర్తీ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటుంది. కాగా కీర్తీ అందాల ఆర‌బోత‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌దు. చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేయ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. బ్లాక్ టాప్ ఎల్లో డ్రెస్ లో మెరిసిపోతోంది. కేవ‌లం రెండు గంట‌ల్లోనే మూడు ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చిప‌డ్డాయి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp