Keerthi Suresh : ఎన్నాళ్లకెన్నాళ్లకు మహానటి అనిపించుకునే మరో పాత్ర.. కీర్తి సురేష్ ఇక రెచ్చిపోవడమే ఉంది..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 18, 2022, 3:30 pm

Keerthi Suresh : మళయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో వారిద్దరి జోడీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఆ సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను గాయపరచింది అమ్మడు. బొద్దుగా ముద్దుగా ఉండే కీర్తి సురేష్ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. ఇక మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమా తో కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ అందుకుంది.

మహానటి సినిమాతో ఆమె చూపిన అభినయం కీర్తి సురేష్ క్రేజ్ ని డబుల్ చేసింది. అయితే ఆ సినిమా కోసం కొద్దిగా బొద్దుగా మారిన కీర్తి సురేష్ ఆ తర్వాత తన సైజ్ తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు జీతో సైజ్ తో అమ్మడు సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న సినిమాల్లో స్లిం లుక్ తో కనిపిస్తుంది. అయితే తన మార్క్ కనిపించడంలో వెనకపడ్డది కీర్తి సురేష్. సర్కారు వారి పాటలో కూడా కీర్తి సురేష్ గ్లామర్ డాల్ గా కనిపించింది. అయితే ఇన్నాళ్లకు అమ్మడికి మరో అద్భుత అవకాశం వచ్చింది.

mahanati Keerthi Suresh dasara performance

mahanati Keerthi Suresh dasara performance

ఇంతకీ ఆ ఛాన్స్ ఏంటి అంటే దసరా అని తెలుస్తుంది. నాని హీరోగా వస్తున్న ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ మరోసారి తన నట విశ్వరూపం చూపిస్తుందని అంటున్నారు. దసర మూవీలో నానికి ఈక్వల్ గా కీర్తి సురేష్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. మరోసారి మహానటి రేంజ్ లో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో అలరిస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు కీర్తి సురేష్ పెద్ద అసెట్ అవుతుందని టాక్. మరి దసరా మూవీ కీర్తి సురేష్ మళ్లీ ఓ మంచి బ్రేక్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp