Keerthy Suresh : ` ఫ్యాన్స్ తో ఆసక్తికర విషయాలు పంచుకున్న కీర్తి సురేష్`.
Keerthy Suresh : మన టాలీవుడ్ పాపులర్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు.తొలి సినిమాతోనే యువకుల మనసు కొల్లగొట్టిన ఈ భామ తాజాగా మహేష్ బాబు నటించిన`సర్కారు వారి పాట`సినిమాలో నటించింది.పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి సక్సెస్ తో దూసుకెళుతుంది.ఈ మూవీ సక్సెస్ సంతోషంలో కిర్తీ సురేష్ కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. నటిగా వుండడం అంత సులువైన విషయం కాదు,ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కోవాల్సి వుంటుంది.ఏ సినిమాకి అయిన ఆ పాత్రకి తగ్గ న్యాయం చేస్తాను.
నేను చేసిన సినిమాలన్నింటిని ఆదరించినందుకు నా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.నన్ను బాగా సపోర్ట్ చేసిన నమ్రతకు ధన్యవాదాలు.అలాగే మహేష్ బాబుతో నటించడం నాకు చాలా సంతోషంగా వుంది.ఆయన చాలా హ్యండ్సమ్ గా వుంటారు.ఆయన అందానికి ఎవరైన ఫిదా అయితారు.సెట్లో చాలా సరదాగా వుంటారు.షూటింగ్ కూడా చాలా సరదాగా సాగిపోతుంటుంది.`సర్కారు వారి పాట`విజయానికి కృషి చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Sarkaru Vaari Paata Keerthi Suresh shares emotional letter to fans
ఇక నా అభిమానులే నా బలం.వాళ్ల ఆదరణ లేకపోతే నేను ఈ స్థాయిలో వుండే దాన్ని కాదు.వాళ్ల సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయికి ఎదగకలిగాను.ఎన్ని ఇబ్బందులు ఎదురైన నా వృత్తిని వదులుకోను,ధైర్యంగా ముందుగా వెళతాను అని కీర్తి సురేష్ అన్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిరంజీవి నటిస్తున్న`భోళా శంకర్` సినిమాలో నటిస్తుంది.అలాగే న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న`దసరా`సినిమాలో నటిస్తోంది.