Keerthy Suresh : దసరా సినిమా చేస్తున్న టైములో మేకప్ వేసుకుంటూ వీడియో అనుకోకుండా ఆన్ చేసిన కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న వీడియో..!!
Keerthy Suresh : నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తరకెక్కిన దసరా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే చిన్న చిన్న కట్స్ తో ఈ సినిమా U/A సర్టిఫికెట్ తో సెన్సార్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రెండు గంటల 36 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం సెన్సార్ సభ్యులు చూసి సంతృప్తి చెందినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో సినిమా యూనిట్ కూడా ఫుల్ సంతోషంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ సింగరేణి నేపథ్యంలో.. వైవిధ్య భరితమైన జోనర్ తో “దసరా” తెరకెక్కటం జరిగింది. కచ్చితంగా “జెర్సీ” సినిమా కంటే అతిపెద్ద విజయం “దసరా” సాధిస్తుందని ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తోంది. అయితే ఈ పాత్రకి సంబంధించి మేకప్.. వేసుకుంటూ ఉంటుండగా..
అనుకోకుండా… వీడియో ఆన్ అయిపోయింది. దీంతో “దసరా” లో కీర్తి సురేష్ లుక్ కీ సంబంధించి వేసుకుంటున్న మేకప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇటీవల ఈ సినిమాలో ఓ సాంగ్ కి సంబంధించి రీల్స్ కూడా కీర్తి సురేష్ మరియు నాని చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఈ క్రమంలో కీర్తి సురేష్ “దసరా”ల్లో లుక్ కీ సంబంధించి వేసుకుంటున్న మేకప్ వీడియో లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.