Keerthy Suresh : కేక పెట్టిస్తున్న కీర్తి సురేష్ అందాల జాతర.. కుర్రకారుకి కంటిపై నిద్ర ఉండదేమో..!
Keerthy Suresh : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో కీర్తి సురేష్ ఒకరు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో రాబోతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన కళావతి సాంగ్ నెట్టింట్లో రచ్చ చేస్తుంది. ఈ సాంగ్‌కి కీర్తి సురేష్ రీల్ వీడియో చేసి షేర్ చేయగా, ఫుల్ వైరల్ అయింది. ఇక కీర్తి సురేష్ మొదటి సారి పాపు సాంగ్‌లో నటించింది. మొట్ట మొదటి సారి గాంధారి అనే పాప్ సాంగ్ ఆల్బమ్ చేసింది కీర్తి సురేష్. సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్మెంట్, ది రూట్ అసోషియేషన్‌లో ఈ సాంగ్ రూపొందింది. ఇటీవల మ్యూజికల్ వీడియోను విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కీర్తి సురేష్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాల జాతరతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా కిల్లింగ్ లుక్స్ లో కేక పెట్టించే అందాలతో మైమరిపిస్తుంది. కీర్తి క్యూట్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ఫొటోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే ‘మహానటి’ లాంటి ఉత్తమ చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్ కు సోషల్ మీడియాలో హేటర్స్ పెరిగిపోతున్నారు. తన స్థాయికి తగ్గ అవకాశాలను కీర్తి ఎంచుకోవడం లేదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
keerthy suresh mesmerizing looks viral in internet
Keerthy Suresh : కీర్తి నువ్వు కేక..
చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. ఈ అమ్మడు అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంటుండగా, సరైన కథలను ఎంచుకోక పోవడం వల్ల వరుస ఫ్లాపులు వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.