Intinti Gruhalakshmi 26 Feb Today Episode : అభిని ఎన్ కౌంటర్ చేసిన ఎస్ఐ.. ఈ విషయం తెలిసి తులసి షాకింగ్ నిర్ణయం.. అభి గురించి తెలుసుకున్న గాయత్రి ఏం చేస్తుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 26 Feb Today Episode : అభిని ఎన్ కౌంటర్ చేసిన ఎస్ఐ.. ఈ విషయం తెలిసి తులసి షాకింగ్ నిర్ణయం.. అభి గురించి తెలుసుకున్న గాయత్రి ఏం చేస్తుంది?

Intinti Gruhalakshmi 26 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 ఫిబ్రవరి 2022, శనివారం ఎపిసోడ్ 566 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకితకు ఏదో ఒకటి సర్దిచెప్పి ఫోన్ పెట్టేస్తుంది తులసి. మరోవైపు అభిని తీవ్రంగా కొట్టిస్తాడు ఎస్ఐ. ఏరా బంగారం.. నీకు ఇంకా పొగరు తగ్గినట్టు లేదే. వీడికి మసాజ్ సరిపోవట్లేదు. కాస్త జాగ్రత్తగా చూసుకోండి అంటాడు ఎస్ఐ. ఒకే దెబ్బకు రెండు […]

 Authored By gatla | The Telugu News | Updated on :26 February 2022,9:30 am

Intinti Gruhalakshmi 26 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 ఫిబ్రవరి 2022, శనివారం ఎపిసోడ్ 566 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకితకు ఏదో ఒకటి సర్దిచెప్పి ఫోన్ పెట్టేస్తుంది తులసి. మరోవైపు అభిని తీవ్రంగా కొట్టిస్తాడు ఎస్ఐ. ఏరా బంగారం.. నీకు ఇంకా పొగరు తగ్గినట్టు లేదే. వీడికి మసాజ్ సరిపోవట్లేదు. కాస్త జాగ్రత్తగా చూసుకోండి అంటాడు ఎస్ఐ. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. కొడుకు ఇక్కడ ఏడుస్తున్నాడు. దీక్ష చేస్తూ నీ తల్లి  స్టేషన్ ముందు ఏడుస్తుంది అని అభితో పోలీస్ చెబుతాడు. మా మామ్ దీక్ష చేస్తుందంటే.. నీకు మూడిందని అర్థం. నన్ను వదిలే వరకు తను నిన్ను వదలదు అని వార్నింగ్ ఇస్తాడు అభి. దీంతో అవునా.. ఇప్పుడే దాని టెంట్ పీకించి దాన్ని అక్కడి నుంచి తరిమేయిస్తా చూడు అని కానిస్టేబుల్ కు ఫోన్ చేస్తాడు ఎస్ఐ.

intinti gruhalakshmi 26 february 2022 full episode

intinti gruhalakshmi 26 february 2022 full episode

తులసి టెంట్ పీకించి.. అక్కడి నుంచి తరిమేయండి అని చెబుతాడు ఎస్ఐ. దాన్ని వీడియో తీసి నాకు పంపించండి. దాని కొడుకుకు చూపిస్తా అంటాడు ఎస్ఐ. మరోవైపు అంకిత ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో లాస్య వస్తుంది. అభి గురించి టెన్షన్ పడకు. మీ అంకుల్ ఎలాగైనా అభిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైలేవల్ లో మాట్లాడుతున్నారు అంటుంది. ఆ తులసి పేరుకే బయట తిరుగుతోంది కానీ.. వేస్ట్ అంటుంది లాస్య. ఇంకా తులసిపై లేనిపోనివి చెప్పేందుకు తెగ ప్రయత్నిస్తుంది కానీ.. అంకిత అవేవీ వినదు. తులసి ఆంటి నాకు ఫోన్ చేసింది. రేపటికల్లా అభిని వెంట పెట్టుకొని తీసుకొస్తా అని చెప్పింది అని చెబుతుంది అంకిత. దీంతో అవన్నీ ఊరికే చెబుతుంది. నిన్ను ఓదార్చడం కోసం అంటుంది లాస్య. దీంతో తులసి ఆంటి మీద నాకు నమ్మకం ఉంది అని చెబుతుంది అంకిత. దీంతో లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు దీక్ష మానుకొని ఇంటికి వెళ్లిపోండి అని కానిస్టేబుల్స్ తులసి టెంట్ దగ్గరికి వెళ్లి తనకు చెబుతారు. దీంతో నాకొడుకును చూపించేవరకు నేను ఇక్కడి నుంచి కదలను అంటుంది తులసి. అయితే.. మీ టెంట్ పీకి ఇక్కడి నుంచి పంపించాల్సి ఉంటుంది. మీకు రెండు నిమిషాలే టైమ్ ఉంది.. అంటారు కానిస్టేబుల్స్.

Intinti Gruhalakshmi 26 Feb Today Episode : తులసికి సపోర్ట్ ఇచ్చిన మీడియా

నా కొడుకును అప్పగించే వరకు నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు అంటుంది తులసి. దీంతో తన టెంట్ పీకేసేందుకు అక్కడికి పోలీసులు రాబోతారు. వెంటనే మీడియా వాళ్లు అక్కడికి వస్తారు. దీంతో పోలీసులు భయపడి లోపలికి వెళ్లిపోతారు.

మీ పోరాటంలో మీకు మీడియా ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది అని చెబుతారు మీడియా వాళ్లు. దీంతో తులసి సంతోషిస్తుంది. మరోవైపు ఏమైంది.. చెప్పిన పని పూర్తయిందా అని పోలీసులను ప్రశ్నిస్తాడు ఎస్ఐ. దీంతో అసలు విషయం చెబుతారు కానిస్టేబుల్స్.

దీంతో ఎస్ఐ షాక్ అవుతాడు. మీకు ఏదీ చేతగాదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అది విన్న అభి.. నవ్వుతాడు. మరోవైపు ఇంట్లో వాళ్లంతా టెన్షన్ గా కూర్చుంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది అంటుంది అంకిత.

బాధ్యత లేకపోవడం అంటే ఇదే.. అంటాడు నందు. తనకేమైనా అయితే ఏమంటారు. మగాడివి.. ఇంట్లో ఉన్నవాడివి నువ్వు చూసుకోవా అంటారు అని అంటాడు నందు. లేకపోతే అభిని వెతుక్కున్నట్టే.. ఇప్పుడు తులసిని కూడా వెతుక్కోవాలి అంటుంది లాస్య.

అసలు.. తులసి గురించి అనే హక్కు నీకు ఎక్కడిదిరా అంటుంది అనసూయ. ఉదయం కాగానే ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు వస్తాడు. వెంటనే తులసి దగ్గరికి వెళ్తాడు. హేయ్.. పోనీలే కదా అని చూస్తుంటే హద్దు దాటుతున్నావు అంటాడు ఎస్ఐ. దీంతో నేను దాటడం లేదు ఎస్ఐ గారు. మీరే దాటిస్తున్నారు అంటుంది తులసి.

మీరు ఇంతలా మారిపోయారు ఏంటి.. జీపు దిగగానే స్టయిల్ గా స్టేషన్ కు వెళ్లిపోయేవారు. ఇప్పుడేంటి.. జీపు దిగగానే నేరుగా నా వైపు వస్తున్నారు. కంగారు మొదలైందా. ఎస్ఐ గారు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీ పరువును నిలబెట్టుకోండి.. అంటుంది.

దీంతో నేను నీ ఆఫర్ కు ఒప్పుకోవాలో.. నువ్వు నా ఆఫర్ కు ఒప్పుకోవాలో.. ఇది విన్నాక చెప్పు అంటాడు ఎస్ఐ. అందులో అభిని కొడుతున్న ఆడియో ఉంటుంది. అభి ఏడుస్తుండటం చూసి తులసి తట్టుకోలేకపోతుంది. ఎప్పుడో చిన్నప్పుడు విని ఉంటావు నీ కొడుకు ఏడుపు. నా పుణ్యమాని ఇప్పుడు వినే అదృష్టం దక్కింది. ఎలా ఉంది అని అంటాడు ఎస్ఐ.

ఇప్పటి వరకు నేను ఇగోయిస్టును. ఇప్పుడు శాడిస్ట్ గా మారుస్తున్నావు. నువ్వు చీమవు. చీమలాగే ఉండు. పాములా బుసగొట్టకు. వెనక్కి తగ్గు అంటాడు ఎస్ఐ. నేను ఈ స్టేజ్ లో వెనక్కి తగ్గితే నా అభిని మరింత ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది.. అంటుంది.

మంచికి ఎప్పుడూ ఓటమి లేదు. నా అభిని నా కళ్ల ముందు నిలబెట్టడానికి రెడీ అయిపోండి అంటుంది తులసి. దీంతో చూద్దాం.. అదీ చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఎస్ఐ. మరోవైపు గాయత్రి.. ఆపరేషన్లు చేసి చిరాకు పడుతుంది.

ఇంతలో తన రూమ్ కు  వెళ్లి టీవీ ఆన్ చేస్తుంది గాయత్రి. అందులో తులసి స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతున్న వార్తను చూస్తుంది. ఇంత జరుగుతున్నా నాకు ఎవ్వరూ ఏం చెప్పలేదు ఏంటి.. అని అంకితకు ఫోన్ చేస్తుంది గాయత్రి. కానీ.. అంకిత ఫోన్ కలవదు.

దీంతో లాస్యకు ఫోన్ చేస్తుంది. మీ ఇంట్లో పిల్లి పిల్లలు పెట్టినా ఫోన్ చేసి చెప్పేదానివి. నా అల్లుడు కనిపించకుండా పోతే మాత్రం ఆ విషయం చెప్పవా అని లాస్యపై సీరియస్ అవుతుంది గాయత్రి. తులసి తన కొడుకు కోసం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని దీక్షలు చేస్తోంది అంటంది గాయత్రి.

దీంతో మాకు ఈ విషయం తెలియదు గాయత్రి అంటుంది లాస్య. దీంతో నీతో మాట్లాడి టైమ్ వేస్ట్ ఎందుకు. తులసి దగ్గరికే వెళ్లి తేల్చుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది గాయత్రి. మరోవైపు అభిని తీసుకొని అడవికి తీసుకెళ్తాడు ఎస్ఐ.

నిన్ను క్షమించేశాను.. పారిపో అంటాడు ఎస్ఐ. దీంతో అభి పరిగెత్తుతుంటే.. తన గన్ తో అభికి గురి పెట్టి కాల్చేస్తాడు ఎస్ఐ. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది