Krithi Shetty: తెలుగు తెరకు కొత్త హీరోయిన్స్ ఎంతో మంది పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా కృతి శెట్టి పేరు తెచ్చుకుంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ భామ.. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతలా ఆమె తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. ఏళ్లకేళ్లు వేచి చూసినా కూడా రాని ఇమేజ్ మూడు సినిమాలతోనే తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ అంటే అమ్మడు లోని టాలెంట్ ను డైరెక్టర్లు టక్కున పట్టేసారు అనాల్సిందే.
ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగర్రాజు’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది అందాల తార కృతి శెట్టి. చూస్తుండగానే అగ్ర నాయికగా పేరు తెచ్చుకుంది. తొలి సినిమా లాక్ డౌన్ భయాలనూ ఎదుర్కొని ఘన విజయాన్ని సాధించింది. దీంతో అరంగేట్రంతోనే వెనుదిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయిందీ భామకు. నటిగా సవాలు విసిరే సినిమాల్లో నటించాలని ఉంది అని అంటుంది కృతి శెట్టి.క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో సొంత డబ్బింగ్ చెప్పుకోవాలనీ ప్రయత్నిస్తున్నా అంటుంది కృతి. అంతేకాదు రాకుమారి పాత్రలో నటించాలన్నది నా కోరిక.
అది ఎప్పటికి తీరుతుందో చూడాలి’ అని చెప్పింది. ప్రస్తుతం కృతి శెట్టి సుధీర్ బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్ సరసన ‘ద వారియర్’ చిత్రాల్లో నటిస్తున్నది. ఇటీవల ద వారియర్ సినిమా నుండి బుల్లెట్ సాంగ్ విడుదల కాగా, ఇది మంచి ఫీస్ట్ మాదిరి అనిపించింది. ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో సందడి చేస్తుండే కృతి తాజాగా చీరకట్టులో మెరిసింది. ఇందులో అమ్మడి అందచందాలకు కుర్రకారు మైమరచిపోతున్నారు. కృతి క్యూట్ లుక్స్‌కి పిచ్చెక్కిపోతున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.