Krithi Shetty : చీర‌క‌ట్టులో కేక పెట్టిస్తున్న కృతి శెట్టి.. అమ్మ‌డి అందాల‌కు ఫిదా కావ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krithi Shetty : చీర‌క‌ట్టులో కేక పెట్టిస్తున్న కృతి శెట్టి.. అమ్మ‌డి అందాల‌కు ఫిదా కావ‌ల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :30 April 2022,2:30 pm

Krithi Shetty: తెలుగు తెరకు కొత్త హీరోయిన్స్ ఎంతో మంది పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా కృతి శెట్టి పేరు తెచ్చుకుంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ భామ.. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతలా ఆమె తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. ఏళ్లకేళ్లు వేచి చూసినా కూడా రాని ఇమేజ్ మూడు సినిమాలతోనే తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ అంటే అమ్మడు లోని టాలెంట్ ను డైరెక్టర్లు టక్కున పట్టేసారు అనాల్సిందే.

ఉప్పెన’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగర్రాజు’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది అందాల తార కృతి శెట్టి. చూస్తుండగానే అగ్ర నాయికగా పేరు తెచ్చుకుంది. తొలి సినిమా లాక్‌ డౌన్‌ భయాలనూ ఎదుర్కొని ఘన విజయాన్ని సాధించింది. దీంతో అరంగేట్రంతోనే వెనుదిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయిందీ భామకు. నటిగా సవాలు విసిరే సినిమాల్లో నటించాలని ఉంది అని అంటుంది కృతి శెట్టి.క్రేజ్ పెరుగుతున్న నేప‌థ్యంలో త్వరలో సొంత డబ్బింగ్‌ చెప్పుకోవాలనీ ప్రయత్నిస్తున్నా అంటుంది కృతి. అంతేకాదు రాకుమారి పాత్రలో నటించాలన్నది నా కోరిక.

keerthy suresh saree feast mesmarizing the netigens

keerthy suresh saree feast mesmarizing the netigens

Krithi Shetty : కృతి అందాల హంగామా..!

అది ఎప్పటికి తీరుతుందో చూడాలి’ అని చెప్పింది. ప్రస్తుతం కృతి శెట్టి సుధీర్‌ బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్‌ సరసన ‘ద వారియర్‌’ చిత్రాల్లో నటిస్తున్నది. ఇటీవ‌ల ద వారియ‌ర్ సినిమా నుండి బుల్లెట్ సాంగ్ విడుద‌ల కాగా, ఇది మంచి ఫీస్ట్ మాదిరి అనిపించింది. ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుండే కృతి తాజాగా చీర‌క‌ట్టులో మెరిసింది. ఇందులో అమ్మ‌డి అంద‌చందాల‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. కృతి క్యూట్ లుక్స్‌కి పిచ్చెక్కిపోతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది