Keerthy Suresh : అలా అందాలు ఆరబోసి మైమరిచిపోతున్న కీర్తి సురేశ్..

Authored By mallesh | The Telugu News | Updated on : 29 January 2022, 8:30 pm

Keerthy Suresh : ‘మహానటి’ కీర్తి సురేశ్.. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పలు చిత్రాల్లో లీడ్ రోల్ కూడా ప్లే చేస్తోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతున్నది. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సంగతులు అలా ఉంచితే..

కీర్తి సురేశ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.కీర్తి సురేశ్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ‘గుడ్ లక్ సఖి’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దిగిన ఫొటో ఒకదానిని ఇన్ స్టా గ్రామ్ వేదికగా కీర్తి షేర్ చేసింది. అది చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెసరు రంగు డ్రెస్సులో తగు ఆభరణాలు ధరించి ఎద అందాలను చూపుతూ..

keerthy suresh shared her latest photo in instagram

keerthy suresh shared her latest photo in instagram

Keerthy Suresh : అలా ప్రమోషన్స్‌లో అదరగొడుతున్న ముద్దుగుమ్మ..

అలా మైమరిచిపోయి స్టిల్ ఇచ్చింది కీర్తి సురేశ్.ఇక ఈ భామ ఈ ఫొటోను చూసి నెటిజన్లు ‘వావ్, లవ్ యూ, క్యూటీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచంలోనే సుందరమైన మహిళ కీర్తి సురేశ్ అని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. కీర్తి సురేశ్ తెలుగులో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ఫిల్మ్ లో చిరుకు చెల్లెలిగా నటిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp