Ketika Sharma : రొమాంటిక్ హీరోయిన్ అప్పుడే అలా ఆలోచిస్తుందా..?

 Authored By govind | The Telugu News | Updated on :6 April 2021,2:50 pm

Ketika Sharma : రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన హాట్ బ్యూటీ కేతిక శర్మ ..ఈ సినిమా పోస్టర్‌తో కుర్రాళ్ళకి వేడి పుట్టించింది. ఫస్ట్ పోస్టర్‌లోనే కేతిక శర్మని చూసిన యూత్ అబ్బబ్బా..ఈ హాట్ హీరోయిన్‌ని ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూస్తామా అని ఆరాట పడ్డారు. కానీ ఆ అవకాశం ఇంకా రానేలేదు. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రెండవ సినిమా రొమాంటిక్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

Ketika Sharma Insta Pics

Ketika Sharma Insta Pics

ఒక దశలో ఈ సినిమాని డైరెక్తర్ అండ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాధ్ ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు కూడా యూత్ అంతా రెడీ అయ్యారు. కానీ ఎందుకనో ఈ సినిమా రిలీజ్‌కి ఓటీటీలో కూడా మోక్షం కలగలేదు. థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. గత ఏడాది రిలీజ్ చేయాలనుకున్న సినిమాలన్నీ వరస బెట్టి థియేటర్స్‌లో వచ్చేస్తున్నాయి. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా రిలీజ్‌కి ముందు ఈ సినిమాల ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహిస్తున్నారు. దాంతో కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న వాళ్ళకి బాగా పబ్లిసిటీ కూడా వస్తోంది.

 Ketika Sharma : కేతిక శర్మ గురించి మాత్రం ఎవరూ మాట్లాడుకోవడం లేదు..?

కానీ ఇంకా కేతిక శర్మ గురించి మాత్రం ఎవరూ మాట్లాడుకోవడం లేదు. డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే మరో రెండు సినిమాలు కమిటయింది. ప్రస్తుతం ఆ సినిమాలలో ఒక సినిమా సెట్స్ మీద ఉండగా ఒక సినిమా త్వరలో షూటింగ్ మొదలవబోతోంది. కానీ ఈ బ్యూటీకి పబ్లిసిటీనే రావడం లేదు దాంతో తన కెరీర్ ఏంటీ అన్న డైలమాలో పడిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి దూసుకెళుతోంది. ప్రస్తుతం తన చేతిలో దాదాపు 6 సినిమాలున్నాయని సమాచారం. మరి ఈ పోటీ కేతిక శర్మ తట్టుకుంటుందా..!

govind

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి