Srinidhi Shetty : 6 నెలల క్రితం రూ.5 కోట్లు డిమాండ్.. ఇప్పుడు రూ.1 కోటి అయినా ఓకే అంటోంది
Srinidhi Shetty : కేజిఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. ఈ అమ్మడు అంతకు ముందు కన్నడంలో ఒక్కటి రెండు సినిమాల్లో నటించింది. అయినా కూడా ఏకంగా కే జి ఎఫ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. కే జి ఎఫ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడికి దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. కే జి ఎఫ్ రెండు పార్ట్ లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తనకు అమాంతం స్టార్డం పెరిగి పోయింది అంటూ శ్రీనిధి శెట్టి ఏకంగా ఐదు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. కన్నడంతో పాటు అన్ని భాషల నుండి కూడా ఈమెకు ఆఫర్లు వచ్చాయి కానీ ఐదు కోట్ల డిమాండ్ తో ఏ ఒక్కరు కూడా ఈమెను మారు మాట్లాడకుండా ఎంపిక చేయకుండా వెనక్కు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేయడం ఎక్కడా చూడలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఇది చాలా ఓవర్ అంటూ ఆమెకు నేరుగా చెప్పి వెళ్లి పోయారట. కట్ చేస్తే ఆమె నటించిన కోబ్రా సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో శ్రీనిధి శెట్టి ఆకాశం నుండి పాతాళంలోకి పడిపోయినట్లు అయింది. మొన్నటి వరకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తేనే తాను సినిమాకు సైన్ చేస్తాను అంటూ భీష్మించుకు కూర్చున్న శ్రీనిధి ఇప్పుడు కోటి రూపాయల పారితోషికం ఇచ్చిన కూడా తాను నటించేందుకు సిద్ధం అన్నట్లుగా తన సన్నిహితుల ద్వారా ఫిలిం మేకర్స్ కి సమాచారం పంపుతుందట. హీరోయిన్ గా ఈమె ఇప్పటికే భారీ విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ ఆ విజయాల యొక్క క్రెడిట్ కనీసం 10% కూడా ఈమెకు లేదు.
ఆ సినిమాల్లో ఒక బొమ్మ మాదిరిగానే ఉంది.. అందుకే ఈమెకు ఎక్కువ భారితోషికం ఇచ్చి నటింపజేయాలి అనే ఆసక్తి ఏ ఒక్కరికి లేదు. పైగా చాలా మందికి ఈమె కేజిఎఫ్ హీరోయిన్ అనే విషయం కూడా తెలియదు. ఆ సినిమాలో మొత్తం యాక్షన్స్ సన్నివేశాలు మరియు హీరో పైనే ప్రేక్షకులు దృష్టి పెట్టారు. కనుక హీరోయిన్ గురించి ఎక్కువ టాపిక్ రాలేదు. అలాంటి శ్రీనిధి శెట్టి ఏకంగా ఐదు కోట్లు పారితోషికం డిమాండ్ చేయడం అనేది విడ్డూరమే. అయినా కూడా ఆమె భారీ ఎత్తున భారతదేశం డిమాండ్ చేయడం తప్పు అని చాలా తక్కువ సమయంలోనే తెలుసుకొని కోటి రూపాయలకు తన పారితోషికంను తగ్గించింది. ఇప్పుడైనా ఆమెకు ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఆరు నెలల్లోనే హామీలు వచ్చిన మార్పును చూసి కొందరు నిర్మాతలు నవ్వుకుంటున్నారట.