Kiara Advani : రామ్‌చరణ్ – శంకర్ సినిమాలో కియారా అద్వానీ ఫిక్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Kiara Advani మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ Ram charan – క్రియేటివ్ జీనియ శంకర్ కాంబినేషన్‌లో చరణ్ 15వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అన్నీ ప్రధాన భాషలలో ఈ సినిమారూపొందబోతుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ..శిరీశ్ తో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే థమన్ ని అధికారకంగా ప్రకటించిన మేకర్స్ తాజాగా ఇందులో చరణ్ సరసన నటించే హీరోయిన్ ని ప్రకటించింది.
భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన బ్యూటీ కియారా అద్వానీ Kiara Advani ని మేకర్స్ ఫైనల్ చేశారు. తెలుగులో ఈమె వినయ విధేయరామ తర్వాత బాలీవుడ్ లో బిజీ అవడం వల్ల మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఆ స్థాయి హీరోయిన్ ఉండానే దిల్ రాజు – శంకర్ – చరణ్ RC 15 కియారానిఎంచుకున్నారు. కాగా నేడు (జూలై 31) కియారా అద్వాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తుందనే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Kiara Advani Joine Ram Charan rc 15 in Shankar
ఇక ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించబోతున్న 15వ సినిమా కాగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 50వ సినిమా కావడం విశేషం. ఆగస్టు నుంచి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇక అనీటికంటే హాట్ టాపిక్ చరణ్ RC 15 15కి కియారా అందుకునే రెమ్యునరేషన్. ఈ సినిమాకి ఆమె డేట్స్ ఇచ్చినందుకు గాను 4 నుంచి 5 కోట్లు ముట్టచెబుతున్నారట. ఇదే నిజమైతే సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న హీరోయిన్స్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకునేది కియారా అద్వానీనే అవుతుంది.