kinnera mogilaiah honered with padma sri award
Kinnera Mogilaiah : దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును కిన్నెర వాయిద్య కళాకారుడైన మొగిలయ్యకు ఇస్తున్నట్టు భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అతనితో పాటు మొత్తం 107 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన కృషికి దేశ అత్యున్నత పురస్కారంతో వారిని సత్కరించింది. అయితే, తెలంగాణ నుంచి కిన్నెర వాయిద్యా కళాకారుడికి పద్మ శ్రీ దక్కడంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా మొగిలయ్య చాలా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కిన్నెర మొగిలయ్య తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ అవుసలికుంటకు చెందిన వారు. తెలకపల్లి మండలం గుట్టరాయిపాకులలో మొగిలయ్య జన్మించాడు. ఆయన పెరిగిన ప్రాంతం చుట్టూ నల్లమల అటవీప్రాంతం. ఆయన్నునల్లమల ముద్దుబిడ్డగా అక్కడి ప్రజలు పిలుచుకుంటుంటారు. ప్రకృతి ఒడిలో కిన్నెర వాయిద్యంపై అవపోసన పట్టారు. తన తాత, తండ్రి నుంచి ఈ వారసత్వం సంక్రమించినదని మొగిలయ్య చెప్పుకుంటుంటారు. పూటగడవని టైంలో గ్రామగ్రామాన తిరుగుతూ అందంగా ముస్తాబు చేసిన కిన్నెర వాయిద్యంతో అందరినీ అలరించేవారు.కిన్నెరనే ఆయనకు జీవనోపాధి. కిన్నెర వాయిద్యం కళనే జీవనాధారంగా చేసుకుని బతుకీడుస్తున్నాడు.
kinnera mogilaiah honered with padma sri award
గతంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి కిన్నెర వాయించి వారు ఇచ్చే దాంతో కాలం వెల్లదీసేవాడు. తెలంగాణ ప్రభుత్వం మొగిలయ్య సేవలను గుర్తించింది. ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని ఆఫర్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’లో టైటిల్ సాంగ్ పాడి ఫేమస్ అయిపోయాడు మొగిలయ్య.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొగిలయ్య అంటే తెలియని వారుండరు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించడంతో మొగిలయ్య ఇన్నాళ్ల కృషికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని అందరూ అనుకుంటున్నారు.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.