Home » Entertainment » Kiraak Rp Sensational Comments On Jabardhasth
Entertainment

Kiraak RP : జ‌బ‌ర్ధ‌స్త్ నీచం.. అడుక్కునే ప‌రిస్థితి వ‌చ్చిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్పీ

Authored By
Sam C
The Telugu News | Updated on: July 7, 2022 7:02 pm
Advertisement

Kiraak RP: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించే కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ షోతో సామాన్యులు కూడా సెల‌బ్రిటీలుగా మారారు. కొంతమంది ఇంకా జబర్దస్త్ ని పట్టుకుని కాలం వెళ్లదీస్తుంటే మరికొందరు సినిమాల్లోకి వెళ్లారు. మరికొందరు ఇతర టీవీ చానల్స్ లోకి వెళ్లి ఇతర షోస్ కూడా చేస్తున్నారు. అలా స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో ఆర్పీ సందడి చేస్తున్నాడు. వారిలో కిరాక్ ఆర్పీ కూడా ఒక‌రు. ఈ మధ్యకాలంలో ఒక ఎపిసోడ్లో తన గుండెల మీద నాగబాబు పచ్చబొట్టు ఉందనే విషయాన్ని ఆర్పీ వెల్లడించాడు.

Advertisement

తాజాగా తనకి కాబోయే భార్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ జబర్దస్త్ పైన మల్లెమాల సంస్థ పైన, దాని యజమాని శ్యాంప్రసాద్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డి చేసేది వ్యాపారం అని పేర్కొన్న కిరాక్ ఆర్పీ నాగబాబు చేసేది మాత్రం వ్యవహారం అని చెప్పుకొచ్చారు. శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్లు ఎవరికీ సహాయం చేయరని కేవలం వ్యాపార దృక్కోణంతో ఆలోచిస్తారని అన్నారు. అదే నాగబాబు మాత్రం అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ అందరి సమస్యలను తీరుస్తారని అన్నారు.

kiraak rp sensational comments on Ja‌ba‌rdha‌sth

Advertisement

Kiraak RP : సంచ‌ల‌న కామెంట్స్..

నాగబాబు దేవుడితో సమానం, ఆయన నాకు అన్ని విషయాల్లో అండగా నిలిచాడు. చాలా సహాయం చేశారు. అందుకే ఆయన పేరు పచ్చబొట్టు వేయించుకున్నాను . అడుక్కుతినేవాడికి కూడా చూసి పెడతారు.. కానీ మల్లెమాల వాళ్లు పెట్టేటంత వరస్ట్ ఫుడ్ సినీ ప్రపంచ చరిత్రలో ఎక్కడా పెట్టరు. జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్లని ఎవర్నైనా వాళ్ల అమ్మ, నాన్న, బిడ్డలపై ప్రమాణం చేసి నిజం చెప్పమనండి.. అక్కడ భోజనం ఎంత దారుణంగా పెడతారో తెలుస్తుంది అంటూ ప‌లు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కిరాక్ ఆర్పీ ఇటీవల లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. త్వ‌ర‌లోనే ఆమెతో ఏడ‌డుగులు వేయ‌బోతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి