Chiranjeevi Kondapolam Movie Review : మెగాస్టార్ రివ్యూ : ‘కొండ పొలం’ అదిరిందంటున్న చిరంజీవి..

Advertisement

Kondapolam Movie Review : క్రిష్ డైరెక్షన్‌లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండ పొలం’ Kondapolam Movie Reviewచిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రాన్ని చూసి ఫస్ట్ రివ్యూ చెప్పేశారు మెగాస్టార్ చిరంజీవి. చక్కటి ప్రేమ కథాంశంతో పాటు ప్రకృతి పరిరక్షణకు ఏం చేయాలనే విషయాలపై చిత్రంలో చక్కగా చూపించారని దర్శకుడు క్రిష్‌ను మెగాస్టార్ అభినందించారు.

Advertisement
Kondapolam review by chiranjeevi
Kondapolam review by chiranjeevi

డైరెక్టర్ క్రిష్ ప్రతీ సినిమా చాలా బాగుంటుందని, ముందటి సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్స్‌లో క్రిష్ ఫిల్మ్స్ చేస్తారని చిరు చెప్పారు. చిత్రంలో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ పర్ఫార్మెన్స్ బాగుందని ప్రశంసించారు. ఇకపోతే మెగా స్టార్ వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ చిత్రం గురించి ఫస్ట్ రివ్యూ ఇవ్వడాన్ని చూసి మెగా అభిమానులు ఆనందపడుతున్నారు. ఈ సారి కూడా వైష్ణవ్ హిట్ కొట్టేశాడని అనుకుంటున్నారు.

Advertisement

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌లో సినిమా చూసిన అనంతరం.. డైరెక్టర్ క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి మీడియాకు సినిమా విశేషాలు వివరించారు.

Advertisement
Advertisement