Allu Arjun‌ : అల్లు అర్జున్‌ తో కొరటాల శివ మూవీ.. ‘పుష్ప’ను మించిన స్టోరి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arjun‌ : అల్లు అర్జున్‌ తో కొరటాల శివ మూవీ.. ‘పుష్ప’ను మించిన స్టోరి..

Allu Arjun‌ : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ.. అపజయం ఎరుగని దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. ఈయన చేసింది ఐదు సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్‌గా బాగా పాపులర్ అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం వచ్చే ఏదాడి ఫిబ్రవరి 4న విడుదల కానుంది. కాగా, ఆయన నెక్స్ట్ మూవీ ‘ఎన్టీఆర్ 30’ పాన్ ఇండియా ప్రాజెక్టుగా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :16 December 2021,7:40 pm

Allu Arjun‌ : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ.. అపజయం ఎరుగని దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. ఈయన చేసింది ఐదు సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్‌గా బాగా పాపులర్ అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం వచ్చే ఏదాడి ఫిబ్రవరి 4న విడుదల కానుంది. కాగా, ఆయన నెక్స్ట్ మూవీ ‘ఎన్టీఆర్ 30’ పాన్ ఇండియా ప్రాజెక్టుగా రాబోతుంది. ఈ సంగతి అలా ఉంచితే.. దీని తర్వాత సినిమా బన్నీతో చేయబోతున్నట్లు కొరటాల శివ కమిట్ అయ్యారు.

పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా హాజరైన కొరటాల శివ మాట్లాడుతూ.. తాను అల్లు అర్జున్‌తో తప్పకుండా ఓ సినిమా చేస్తానని చెప్పారు. ‘పుష్ప’ పార్ట్ టూ.. పూర్తి అయిన తర్వాత ‘పుష్ప’ కంటే కూడా పెద్ద కథతో తప్పకుండా అల్లు అర్జున్ వద్దకు వెళ్తానని కొరటాల చెప్పుకొచ్చారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపల కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ 30వ చిత్రం చేయనున్నారు. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ పైన కూడా భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

 koratala siva will do a movie with Allu Arjun‌ in future

koratala siva will do a movie with Allu Arjun‌ in future

Allu Arjun‌ : ‘పుష్ప’ కంటే పెద్ద కథతో కొరటాల శివ-అల్లు అర్జున్ సినిమా..

గతంలో అల్లు అర్జున్‌తో కొరటాల శివ యూత్ స్టోరి ఒకటి చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ, అవి మెటీయరలైజ్ అయినట్లు లేదు. ఫైనల్‌గా అల్లు అర్జున్‌తో భవిష్యత్తులో ఓ సినిమా చేయబోతున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఇకపోతే మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చిత్రం ‘ఆచార్య’లో బోలెడన్ని సర్ ప్రైజ్‌లు ఉండబోతున్నాయి.ఈ పిక్చర్‌లో రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశాడు. చెర్రీకి జోడీగా బ్యూటిఫుల్ పూజా హెగ్డే నటించగా, మెగాస్టార్ సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటించింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది